pizza

Varun Sandesh's 'Nindha' storms ETV Win OTT with 1.4 million streaming minutes in just one day
ఒక్క రోజులోనే 1.4 మిలియన్‌ స్ట్రీమింగ్‌ మినిట్స్‌తో ఈటీవీ విన్‌ ఓటీటీలో దూసుకపోతున్న వరుణ్‌సందేశ్‌ 'నింద'

You are at idlebrain.com > news today >

7 September 2024
Hyderabad

Movies that created a buzz in theaters often wait to be streamed on OTT platforms. One such film eagerly awaited on OTT is Varun Sandesh’s latest movie 'Nindha.' Directed and produced by Rajesh Jagannadham under the banner of The Fervent Indie Productions, 'Nindha' features Varun Sandesh in a standout performance.

The film, which was released in theaters and performed well at the box office, has been streaming on the popular OTT platform ETV Win since the 6th of this month. The film is receiving an overwhelming response on OTT as well. In just one day, the movie 'Nindha' garnered 1.4 million streaming minutes, making it the talk of the OTT world. Observers suggest that 'Nindha' is likely to accelerate its success even more on the platform.

Based on real events and a unique concept, 'Nindha' showcases a new dimension to Varun Sandesh's acting. The producer expressed confidence that this different concept film will receive even more praise on OTT.

The movie stars Anni, Shreya, Tanikella Bharani, Bhadram, Surya Kumar, Chhatrapati Shekhar, Mime Madhu, Siddharth Gollapudi, Arun Dalai, and others in important roles. Rameez Naveeth handled the cinematography, while Santu Onkar provided the music. The film was edited by Anil Kumar.

ఒక్క రోజులోనే 1.4 మిలియన్‌ స్ట్రీమింగ్‌ మినిట్స్‌తో ఈటీవీ విన్‌ ఓటీటీలో దూసుకపోతున్న వరుణ్‌సందేశ్‌ 'నింద'

థియేటర్‌లో సందడి చేసిన సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్‌ ఎప్పుడా అని ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. అలా ఎదురుచూసే సినిమాల్లో ఒకటి వరుణ్‌ సందేశ్‌ తాజా చిత్రం 'నింద'. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం 'నింద'. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్‌ నటన హైలైట్‌గా నిలిచింది. థియేటర్‌లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కూడా మంచి విజయాన్నే సాధించిన ఈ చిత్రం ఈ నెల 6నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఓటీటీలో కూడా ఈ చిత్రానికి మంచి అనూహ్య స్పందన వస్తోంది. కేవలం ఒక్క రోజులోనే 1.4 మిలియన్‌ స్ట్రీమింగ్‌ మినిట్స్‌తో నింద చిత్రం టాక్‌ ఆఫ్‌ ద ఓటీటీగా మారింది. ఈ క్రమంలో చూస్తుంటే నింద ఓటీటీలో మరింత వేగంగా దూసుకెళ్లే అవకాశం వుందని కూడా అంటున్నారు అందరూ. ఇక వాస్తవ సంఘటనల ఆధారంగా ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో వచ్చిన నింద చిత్రం వరుణ్ సందేశ్‌ నటనలోని కొత్తకోణాన్ని ఆవిష్కరించింది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వుండే ఈ చిత్రం ఓటీటీలో మరింత మంది ప్రశంసలు అందుకుంటుందనే నమ్మకం వుందని నిర్మాత తెలిపారు.

అన్నీ, శ్రేయ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై ఇతర ముఖ్య తారాగణంగా నటించిన ఈ చిత్రానికి రమీజ్ నవీత్ కెమెరా, సంతు ఓంకార్ సంగీతం అందించారు. అనిల్ కుమార్ ఎడిటింగ్ చేశారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved