Nari Nari Naduma Murari Release Press Meet
'నారీ నారీ నడుమ మురారి'తో ఇది శర్వా సంక్రాంతి అవుతుంది. టికెట్లు ఎంఆర్‌పీ ధరలకే అందరికీ అందుబాటులో వుంటాయి. ఇది ఫ్యామిలీతో కలసి ఎంజాయ్ చేసే పర్ఫెక్ట్ ఫెస్టివల్ సినిమా: ప్రెస్ మీట్ లో నిర్మాత అనిల్ సుంకర
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారీ నారీ నడుమ మురారి'. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. జనవరి 14న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
గ్రాండ్ రిలీజ్ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. నిర్మాతగా ఇది 16వ సంవత్సరం. జనవరి 14, 2010 నమో వెంకటేశా విడుదలైయింది. యాదృచ్ఛికంగా జనవరి 14న నారీనారీ నడుమ మురారి రిలీజ్ అవుతుంది. సామజవరగమన ఒక మిరాకిల్. కోవిడ్ సమయంలో అసలు సినిమాలు జరుగాతయా లేదా ఆనుకున్న సమయంలో శ్రీవిష్ణు గారు ఒక్క కాల్ తో సినిమా చేశారు. ఈ సినిమాలో కూడా శ్రీ విష్ణు గారికి ఒక మంచి క్యామియో రోల్ ఉంది. ఆయన ఉన్నంత సేపు మీరు నవ్వుతూనే ఉంటారు. శ్రీ విష్ణు గారు డబ్బింగ్ లో ఇంప్రవైజ్ చేసిన డైలాగులు చాలా బాగున్నాయి. సామజ.. కథ చెప్పిన తర్వాత ఆ క్యారెక్టర్ లో నరేష్ గారిని తప్పితే మరొకరిని ఊహించలేను. ఆయన కోసం రెండు నెలలు ఆగాను. ఆయన ఓకే చేసిన తర్వాత ఆ రోజే సినిమా హిట్ అనుకున్నాం. ఈ సినిమా చూసిన తర్వాత డబల్ హిట్ అంటారు. డైరెక్టర్ రామ్ అద్భుతంగా తీర్చిదిద్దారు. కామెడీ ఎంటర్టైన్మెంట్ ఎమోషన్ డ్రామా అన్ని అద్భుతంగా ఉంటాయి. సాక్షి, సంయుక్త ఇద్దరు కూడా చాలా చక్కగా పెర్ఫార్మ్ చేశారు. సంయుక్త చాలా సపోర్ట్ చేసింది. సాక్షి మా హీరోయిన్. తనకి హిట్ ఇవ్వలేకపోయానే ఒక చిన్న వెలితి ఉండేది. ఈ సినిమాతో తనకి కచ్చితంగా హిట్ పడుతుంది. ఇది తనకి బిగ్గెస్ట్ సక్సెస్ అవుతుంది. రామ్ మోస్ట్ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్. కంటెంట్ బాగుంటే గ్యారెంటీగా ఆడేస్తుందనే సీజన్ సంక్రాంతి. అది నా ఫస్ట్ సినిమా నుంచి తెలిసింది. నమో వెంకటేశా జనవరి 7వ తేదీకి షూటింగ్ పూర్తి అయింది. జనవరి 14 లో సినిమా రిలీజ్ చేశాం. హౌస్ ఫుల్ గా రన్ అయ్యింది. అప్పుడే సంక్రాంతి మ్యాజిక్ తెలిసింది. ఈ సినిమా విషయంలో కూడా చాలామందికి కొన్ని అనుమానాలు ఉండొచ్చు. అయితే సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మా కాన్ఫిడెన్స్ ఏంటో అందరికీ అర్థమైపోయింది. జనవరి 14 మీరు థియేటర్ కి రావడమే ఆలస్యం నవ్వులు మొదలైపోతాయి. సినిమా కోసం అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. మీడియా అందరు కూడా నామీద ఎంతో ప్రేమ చూపించారు. మీరందరూ చూపించిన ప్రేమకి బాధ్యతగా చెప్పే సమాధానమే ఈ సినిమా . ఇప్పటివరకు ఈ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా నవ్వుతూ హ్యాపీగా బయటికి వచ్చారు. చిరంజీవి గారి సినిమా బాగుంది చిరంజీవి గారికి అనిల్ గారికి నిర్మాతలకి కంగ్రాజులేషన్స్. జనవరి 14 శర్వా సంక్రాంతి. ఇది శర్వా మూడో సంక్రాంతి అవుతుంది. శతమానం భవతి, ఎక్స్ప్రెస్ రాజా.. ఇప్పుడు నారీ నారీ నడుమ మురారి. బాలయ్య బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మేము చెప్పగానే టైటిల్ ని కూడా ఆయనే లాంచ్ చేశారు. చాలా బావుందని చెప్పారు. ఈ సినిమా టికెట్లు ఎంఆర్‌పీ ధరలకే వుంటాయి. ఈ సినిమాని అందరూ ఫ్యామిలీతో కలిసి చూడండి. అందరూ జనవరి 14 ఈవినింగ్ 5 గంటల 49 నిమిషాలకి థియేటర్స్ కి రండి. మీ అందరిని ఈ సినిమా గొప్పగా అలరిస్తుంది.
డాక్టర్ నరేష్ వికె మాట్లాడుతూ.. అనిల్ శంకర్ గారు అజాతశత్రువు.సామజవరగమన మా అందరినీ ఒకటి చేసింది. ఈసారి సంక్రాంతికి శర్వా కలిసి వస్తున్నాము. ఈ ప్రొడక్షన్ హౌస్ కి కచ్చితంగా ఈ సినిమా మరో హిట్ అవుతుంది. ఈ సినిమాలో ఒక కొత్త టైమింగ్ కొత్త యాంగిల్ లో శర్వాని చూస్తారు. ఫ్యామిలీస్ ని మళ్లీ సినిమాస్ కి తీసుకొచ్చిన సినిమా సామజ. ఈ సంక్రాంతికి మొదలెట్టి నెక్స్ట్ సంక్రాంతి వరకు మాట్లాడే సినిమా నారి నారి నడుమ మురారి. ఇది 100% నమ్మకంతో చెబుతున్నాను. సినిమాకి అద్భుతమైన బజ్ వుంది. సామజ లో నరేష్ 2.O చూశారు. ఇందులో నరేష్ 3.O చూశారు.ఇప్పటివరకు నేను చేసిన ది బెస్ట్ రోల్ ఇది .సంక్రాంతికి ఈ సినిమా గన్ షాట్ హిట్. నుంచి ఫస్ట్ నుంచి రోలింగ్ టైటిల్ వరకు నవ్వుతూనే ఉంటారు.
హీరోయిన్ సంయుక్త మాట్లాడుతూ..అందరికి నమస్కారం. ముందుగా పెద్ద బ్లాక్ బస్టర్ ని అందుకున్న మన శంకర వరప్రసాద్ గారి టీం కి కంగ్రాట్యులేషన్స్. ఈ సంక్రాంతికి చాలా సినిమాలు వస్తున్నాయి. అన్ని సినిమాలు కూడా అద్భుతంగా ఆడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మొత్తం బజ్ మారిపోయింది. ఆడియన్స్ కి చాలా బాగా కనెక్ట్ అయ్యింది. చాలా మంచి ఎంటర్టైనర్ ఇది. మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. అందరూ ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను
డైరెక్టర్ రామ్ అబ్బరాజు మాట్లాడుతూ.. అందరికీ హ్యాపీ సంక్రాంతి. మా రైటర్స్ భాను నందు సామజకి పని చేశారు.
అది ఎలా ఎంటర్టైన్ చేసిందో ఈ సినిమా కూడా మిమ్మల్ని అలానే అలరిస్తుంది. క్లీన్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్. పండక్కి ఫ్యామిలీ అందరూ హ్యాపీగా వెళ్లి చూసే సినిమా ఇది. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నన్ను బిలీవ్ చేసిన అనిల్ గారికి థాంక్యూ. నరేష్ గారితో మా కొలాబరేషన్ ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. శర్వా గారితో వర్క్ చేయడం చాలా హిలేరియస్ గా ఉండింది. ఇది చాలా ఎంటర్టైనింగ్ ఫిల్మ్. షూటింగ్ కూడా చాలా సరదాగా జరిగింది. అసలైన పండుగ ఆఫర్ ఎమ్మార్పీ ధరలకే ఈ టికెట్లు ఉంటాయి. అందరు ఎంజాయ్ చేయాలనీ కోరుకుంటున్నాను
హీరోయిన్ సాక్షి వైద్య మాట్లాడుతూ... ఇది నా ఫస్ట్ సంక్రాంతి రిలీజ్. నాకు ఇంత అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ సాయి గారికి థాంక్యూ. ఈ క్యారెక్టర్ నాకు ఎప్పుడు గుర్తుండిపోతుంది. చాలా ఎంజాయ్ చేశాను. శర్వా గారి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అనిల్ గారితో ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడే మరో సినిమా చేస్తానని కలిసి చేస్తామని చెప్పారు. చెప్పినట్లే ఈ సినిమా ఇచ్చారు. క్లీన్ ఫ్యామిలీ ఫిలిం ఇది. అందరూ ఎంజాయ్ చేస్తారు.