Ram Abbaraju about Nari Nari Naduma Murari
నారి నారి నడుమ మురారి కొత్త కాన్ఫ్లిక్ట్ తో అలరించే పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. కంటెంట్ చాలా ఫన్ ఫుల్ గా ఉంటుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు: డైరెక్టర్ రామ్ అబ్బరాజు
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి'. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. జనవరి 14న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ రామ్ అబ్బరాజు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే.. సంక్రాంతి వైబ్ కనిపిస్తుంది.. సంక్రాంతి కోసమే తీసిన సినిమానా ఇది?
-ఇది పండగ లాంటి సినిమానే. కాకపోతే శర్వా గారి బైకర్ సినిమా విడుదల కావాల్సింది. అయితే కొన్ని కారణాలవల్ల అది వాయిదా పడింది. దీంతో మాకు సంక్రాంతికి వచ్చే మంచి అవకాశం దొరికింది.
మంచి యూత్ ఫుల్ ఫన్ ఉన్న ఎంటర్టైన్మెంట్ ఇది. చిన్నప్పటి నుంచి సంక్రాంతికి ఎన్నో సినిమాలు చూస్తూ పెరిగా. ఇప్పుడు డైరెక్టర్ గా ఫస్ట్ టైం సంక్రాంతికి నా సినిమా రావడం అనేది నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది.
క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో అందరి ఆడియన్స్ ని అలరించడం ఇష్టం. నేను తీసిన వివాహ భోజనంబు, సామజవరగమన, ఇప్పుడు ఈ సినిమా కూడా చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరూ కలిసి హాయిగా చూసి ఎంజాయ్ చేసేలా వుంటుంది. నాకు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వున్న సినిమాలు చేయడమే చాలా ఇష్టం.
ఇద్దరమ్మాయిలతో చాలా కథలు వచ్చాయి కదా.. ఈ ప్రేమ కథ ఎలా ఉండబోతుంది
-ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని ఫీలింగు వస్తుంది. కానీ ఇందులో చాలా కొత్త పాయింట్ ఉంది. సామజవరగమన ట్రైలర్ లో చూస్తే అసలు కాన్ఫ్లిక్ట్ మేము రివిల్ చేయలేదు. ఇంటర్వెల్ దగ్గర అసలు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అది ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చింది. ఈ సినిమాలో కూడా ఒక కొత్త కాన్సెప్ట్ ఉంది. మేము ఇప్పుడే రివిల్ చేయడం లేదు. బిగ్ స్క్రీన్ పై చూడాల్సిందే.
శర్వా గారు ఇందులో చాలా యంగ్ అండ్ స్లీక్ లుక్ లో కనిపిస్తున్నారు కదా?
-శర్వా గారు బైకర్ సినిమా చేశారు. ఆ సినిమా కోసం చాలా కొత్తగా మేకోవర్ అయ్యారు. అది మాకు కలిసి వచ్చింది. మేము ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్,తర్వాత ప్రెసెంట్ సీన్స్ చేశాం. ఆ రెండిటికీ పర్ఫెక్ట్ గా లుక్ సెట్ అయింది.
శర్వా గారు ఎంటర్టైన్మెంట్ సినిమాలు అదరగొట్టేస్తారు. రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా, మహానుభావుడు.. తర్వాత ఆయన చేసిన ఎంటర్టైనర్ ఇది. చాలా ఫ్రెష్ గా కనిపిస్తారు.
శర్వా గారితో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. సినిమా అంతా చాలా హ్యాపీగా జరిగింది.
నరేష్ గారు మీకు లక్కీనా ?
నరేష్ గారు అద్భుతమైన యాక్టర్. ఆయన అన్ని రకాల పాత్రలు చేస్తూ అలరిస్తున్నారు. నా సినిమాల్లో ఫాదర్ క్యారెక్టర్స్ కి అయిన పర్ఫెక్ట్ గా షూట్ అయ్యారు. ఈ సినిమాలు కూడా చాలా అద్భుతంగా ఆయన పాత్ర ఉండబోతుంది.
కామెడీ చేయడం కష్టం కదా?
-కామెడీ చేయడం కత్తి మీద సాము. సిచువేషన్ తో ఉండే కామెడీ వస్తే ఆటోమేటిక్గా ఆర్గానిక్ గా నవ్వులు వస్తాయి. ఈ సినిమాలో కామెడీ కూడా చాలా ఆర్గానిక్ గా ఉంటుంది.
-ఇందులో సెకండ్ హాఫ్ క్లైమాక్స్ దగ్గర చాలా మంచి ఎమోషన్ వర్కౌట్ అయింది. సత్య, సుదర్శన్, వెన్నెల కిషోర్ గారి పాత్రలు చాలా హిలేరియస్ గా ఉంటాయి.
సంక్రాంతి సీజన్ మీకు కలిసి వస్తుందని భావిస్తున్నారా?
-సంక్రాంతి అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ సినిమా బాగుందని బయటికి వెళ్తే దానితో వచ్చే మౌత్ టాకు సినిమాని బలంగా నిలబెడుతుంది. సామజవరగమన అలానే విజయవంతమైయింది.
మీరు కథలు తయారు చేసుకునే విధానం ఎలా ఉంటుంది?
నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత భాను పరిచయమయ్యారు. అక్కడి నుంచి మా జర్నీ కొనసాగుతుంది. నా ప్రతి సినిమాకి భాను, నందు రైటర్స్ గా ఉన్నారు. మా కొలాబరేషన్ ఇలానే కొనసాగుతుంది.
ఈ రోజుల్లో రైటర్స్ కొరత ఉంది అంటున్నారు.. వాస్తవమేనా ?
అవునండి. ప్రతి ఒక్కరూ డైరెక్టర్ అవ్వాలని వస్తారు. కాకపోతే కొంతమంది రైటర్ గా కొన్నాళ్ళు నిలబడి తర్వాత డైరెక్టర్ అవ్వాలని అనుకుంటారు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గానే వచ్చాను. గుణశేఖర్ గారి నిప్పు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను. తర్వాత అనుభవాన్ని పెంచుకుని డైరెక్టర్ అయ్యాను.
మీరు ఇప్పటివరకు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేయడానికి కారణం ?
సహజంగానే నేను చాలా సరదాగా వుంటాను. అంతే సరదాగా నా సినిమా కూడా ఉండాలని భావిస్తాను. ఒక థియేటర్లో కూర్చుని అందరితో కలిసి నవ్వడం అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్. అందరూ నవ్వుతుంటే మనకు కూడా ఒక ఆనందం కలుగుతుంది.
హీరోయిన్స్ గురించి?
సంయుక్త, వైద్య ఇద్దరికీ కూడా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు వున్నాయి. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు
బాలకృష్ణ గారి క్లాసిక్ టైటిల్ ని వాడుకున్నారు కదా.. ఆ సినిమాకి ఈ సినిమాకి ఏదైనా పోలిక ఉందా?
టైటిల్ తప్పా మరో పోలిక లేదు. టైటిల్ కూడా బాలకృష్ణ గారి చేతుల మీద గానే లాంచ్ చేసాం.
శ్రీవిష్ణు గారు ఇందులో కామియో రోల్ చేస్తున్నారా?
-ఈ సినిమాలో ఒక మంచి కామియో రోల్ వుంది. శ్రీవిష్ణు గారితో నాకు మంచి స్నేహం వుంది. ఆయన అడిగినవెంటనే నచ్చి చేశారు. నా నెక్స్ట్ సినిమా శ్రీ విష్ణు గారితో చేస్తున్నాను. అది క్రైమ్ కామెడీ జోనర్.