pizza

Man of Masses NTR, Blockbuster director Prashanth Neel, Mythri Movie Makers and NTR Arts next "NTRNeel," an action epic shoot begins in August 2024
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌, బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కాంబినేష‌న్‌లో భారీ యాక్ష‌న్ మూవీ ‘ఎన్టీఆర్ నీల్‌’ ... ఆగ‌స్ట్ నుంచి షూటింగ్ ప్రారంభం

You are at idlebrain.com > news today >

20 May 2024
Hyderabad

Man of Masses NTR, who enjoys massive popularity around the globe, will be working with Prasanth Neel, the phenomenal director behind blockbusters like the KGF series and Salaar. The film, tentatively titled NTRNeel, was announced long ago and has been highly anticipated by fans.

In a delightful turn of events, and to amplify NTR's birthday celebrations, the makers announced a crucial shoot update today. The film's production is set to commence in August 2024. This surprise update from the makers has thrilled fans everywhere. Director Prasanth Neel is currently busy putting the final touches on the script, ensuring it lives up to the monumental expectations.

Prasanth Neel, renowned for his blockbuster hits, is expected to bring his unique mass vision to this project, elevating NTR's on-screen persona to new heights. Fans are already buzzing with excitement, eagerly anticipating the dynamic collaboration between NTR and Neel, which is sure to set new benchmarks in the industry.

This film will be produced by the prestigious production houses Mythri Movie Makers and NTR Arts, promising a cinematic spectacle. The team plans to mount the film on a scale comparable to the KGF films, aiming to deliver a truly epic experience. The anticipation surrounding NTRNeel is palpable, with fans and industry insiders alike eager to see how this collaboration will unfold. With NTR's star power and Prasanth Neel's visionary direction, this project is poised to be a game-changer, redefining the landscape of Indian cinema. As August 2024 approaches, all eyes will be on this film, waiting to witness the magic that NTR and Prasanth Neel are set to create.

NTR is currently busy with his commitments to Devara and War 2. He will join the sets of this high-budget film after completing his work on these projects.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌, బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కాంబినేష‌న్‌లో భారీ యాక్ష‌న్ మూవీ ‘ఎన్టీఆర్ నీల్‌’ ... ఆగ‌స్ట్ నుంచి షూటింగ్ ప్రారంభం

ప్ర‌పంచ వ్యాప్తంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌కు ఉండే క్రేజ్, ఫ్యాన్ బేస్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అంచ‌నాల‌కు అనుగుణంగానే తార‌క్ భారీ, క్రేజీ సినిమాల‌ను లైన‌ప్ చేస్తున్నారు. అందులో భాగంగా కె.జి.య‌ఫ్‌, స‌లార్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన‌ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నారు. ‘ఎన్టీఆర్ నీల్’ అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ఎప్పుడో వ‌చ్చేసింది. దీనిపై ఫ్యాన్స్ స‌హా అంద‌రిలోనూ భారీ అంచ‌నాలున్నాయి.

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మేక‌ర్స్ ఎన్టీఆర్ నీల్ మూవీ షూటింగ్‌ను ఆగ‌స్ట్ 2024 నుంచి ప్రారంభించనున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తార‌క్ బ‌ర్త్ డే రోజున ఫ్యాన్స్‌కి స‌ర్‌ప్రైజ్‌నిస్తూ మేక‌ర్స్ ఇచ్చిన ఈ అప్‌డేట్ అంద‌రికీ థ్రిల్లింగ్‌గా అనిపించింది. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ను ఫైన‌ల్ చేస్తున్నారు. అభిమానులు, సినీ ప్రేమికులు అంచ‌నాల‌ను మించేలా సినిమాను రూపొందించ‌నున్నారు.

ఎన్టీఆర్‌కున్న మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆన్ స్క్రీన్‌పై ప్రెజంట్ చేస్తూ యూనిక్ మాస్ క్రేజ్ క్రియేట్ చేసి దాన్ని మ‌రో రేంజ్‌కు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రాబోతున్న ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ సినీ ఇండ‌స్ట్రీలో స‌రికొత్త బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేస్తుంద‌ని అభిమానులు, ప్రేక్ష‌కులు భావిస్తున్నారు. దీంతో సినిమాపై అంచ‌నాలు ఆకాశాన్నంటుతున్నాయి.

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ ప‌తాకాల‌పై ఈ సినిమా రూపొంద‌నుంది. కె.జి.య‌ఫ్ సినిమాకు ధీటుగా భారీ స్కేల్‌తో అద్భుత‌మైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చేలా సినిమాను తెర‌కెక్కించ‌టానికి ప్లానింగ్ జ‌రుగుతోంది. ఎన్టీఆర్ స్టార్ ప‌వ‌ర్‌, ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ విజ‌న‌రీతో రూపొంద‌నున్న ఎన్టీఆర్‌నీల్ మూవీ ఇండియ‌న్ సినిమాలోనే స‌రికొత్త మైల్ స్టోన్‌ను క్రియేట్ చేస్తుంద‌న‌టంలో సందేహం లేదు. ఆగ‌స్ట్ నెల‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. అంటే స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోంది. దీంతో సినిమా ఎలా ఉండ‌బోతుందో చూడాల‌నే కుతూహ‌లం అభిమానులతో పాటు అంద‌రిలోనూ పెరిగిపోతుంది.

ఎన్టీఆర్ ప్ర‌స్తుతం దేవ‌ర‌, వార్ 2 సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్టుల‌ను పూర్తి చేసుకున్న త‌ర్వాత ఆయ‌న ప్ర‌శాంత్ నీల్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved