'OG' భారీ విజయం పవన్ అభిమానుల్లోనే కాదు. పవన్ కళ్యాణ్ కుటుంబంలో కూడా సంబరాలు నింపింది. చిరంజీవి అయితే తమ్ముడి విజయానికి పొంగిపోయారు కూడా. పవన్ కళ్యాణ్ పిల్లలు అకిరానందన్ మరియు ఆద్యలు అయితే ఈ సినిమాను పబ్లిక్ థియేటర్లకు వెళ్లి మరీ ఆనందిస్తున్నారు.
తాజాగా రేణు దేశాయ్ కూడా ఇన్స్టాగ్రామ్ లో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఎప్పటికప్పుడు పిల్లల విషయాలను పోస్ట్ చేస్తూ తల్లిగా పొంగిపోతూ ఉంటారామె. "నా కూతురు ఆద్య పెరిగిపోయింది. తన అన్నయ్య అకిరానందన్ తో పబ్లిక్ థియేటర్లకు వెళ్ళడం ఆనందాన్ని ఇచ్చింది. ఆమె నిన్న రాత్రి 'OG' చూసింది, ఈరోజు మధ్యాహ్నం మరియు రేపు కూడా తమ తండ్రి సినిమాను చూసి ఆనందించాలనుకుంటుంది" అంటూ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి 'OG' హూడీ ధరించిన ఆద్య ఫోటోను జత చేశారు.
Actress Renu Desai shared on Instagram that her daughter Aadhya has been on an #OG movie-watching spree, catching one show per day for the past four days! 🎬💥 pic.twitter.com/JB5mk9qKOq