pizza

OG Tremor at the Box Office – ₹154 Crore Gross on Day 1 Alone!
బాక్సాఫీస్ దగ్గర 'OG' ప్రకంపనం ... మొదటి రోజు వసూళ్లే 154 కోట్ల గ్రాస్

You are at idlebrain.com > news today >

26 September 2025
Hyderabad

OG is creating a storm at the box office, racing ahead with sensational numbers. Right from the premieres, the film has received overwhelmingly positive talk from all sections of the audience, resulting in sky-high collections on Day 1.

With this, OG has officially joined the list of highest Day 1 grossers in Telugu cinema history.

The film’s production house released an official statement today, declaring that OG has grossed a whopping ₹154 crore worldwide on its opening day.

Pawan Kalyan fans are celebrating this feat in a grand way across social media.

The film is also wreaking havoc in overseas markets. In North America alone, it has collected $3.7 million, showcasing the massive scale of success OG is achieving globally.

బాక్సాఫీస్ దగ్గర 'OG' ప్రకంపనం ... మొదటి రోజు వసూళ్లే 154 కోట్ల గ్రాస్

'OG' బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తూ దూసుకుపోతుంది. ప్రీమియర్ల నుండే అన్నివర్గాల నుండి పాజిటివ్ టాక్ రావడంతో మొదటి రోజు ఆకాశాన్ని తాకే కలెక్షన్లను సాధించింది. దీంతో మొదటి రోజు అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు సినిమాల జాబితాలో 'OG' కూడా చేరిపోయింది. ఈ చిత్రం మొదటిరోజే ప్రపంచ వ్యాప్తంగా 154 కోట్ల గ్రాస్ సాధించినట్టు 'OG' చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ఈరోజు ప్రకటన విడుదలచేసింది. ఈ ప్రకటన విడుదల చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. విదేశాల్లో సైతం 'OG' దుమ్మురేపుతోంది. కేవలం నార్త్ అమెరికాలోనే 3.7 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టగలిగిందంటే ఈ సినిమా ఏ స్థాయిలో భారీ విజయాన్ని సాధించగలిగిందో చెప్పుకోవచ్చు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved