pizza

“Pawan Kalyan arrived even before 5 AM and waited for the scene” – DOP Ravi K Chandran
ఆ సీన్ కోసం పవన్ ఉదయం అయిదు గంటల లోపే వచ్చి ఎదురుచూసారు -DOP రవి చంద్రన్

You are at idlebrain.com > news today >

24 September 2025
Hyderabad

It’s evident from watching OG that the team has put in a tremendous amount of hard work. Director Sujeeth has crafted each scene with great detail. Along with the actors, the cinematographer’s contribution is also crucial in making a scene look stunning on screen. In that process, cinematographers often go through a lot of challenges.

For OG, DOP K. Ravi K Chandran and Manoj Paramahamsa worked extremely hard. Sharing his experience on Twitter, Ravi K Chandran said that everything was prepared by 5 AM for filming a key scene in OG. “For the scene where the character ‘Gambheera’ returns to Bombay, director Sujeeth and I requested Pawan Kalyan to be on set by 5 AM. But he arrived even before the requested time and waited patiently. He was very enthusiastic about that scene, and now the audience is loving it just as much,”expressed Ravi K Chandran with joy on Twitter.

ఆ సీన్ కోసం పవన్ ఉదయం అయిదు గంటల లోపే వచ్చి ఎదురుచూసారు -DOP రవి చంద్రన్

'OG' కోసం ఆ చిత్ర యూనిట్ చాలా శ్రమను ఒడ్డిందని విషయం ఆ సినిమా చూస్తుంటేనే అర్థమవుతుంది. ప్రతి సన్నివేశాన్నీ పొందికగా చెక్కినట్టే చిత్రీకరించాడు దర్శకుడు. తెరపై సన్నివేశం అద్భుతంగా పండటంలో నటులతో పాటూ డీఓపీ పనితీరే కీలకం. ఆ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు సినిమాటోగ్రాఫర్లు.

'OG' కోసం కూడా అంతే స్థాయిలో కష్టపడ్డారు డీఓపీ కే రవిచంద్రన్ మరియు మనోజ్ పరమహంస. 'OG' లో ఓ కీలక సన్నివేశాన్ని చిత్రీకరించడం కోసం ఉదయం 5 గంటలకే అంతా సిద్ధం చేసుకున్నామని ట్విట్టర్ వేదికగా తెలిపారు రవిచంద్రన్. "సినిమాలో గంభీర బొంబాయ్ తిరిగి వచ్చే సన్నివేశం కోసం ఉదయం 5 గంటలకే రమ్మని పవన్ కళ్యాణ్ ను దర్శకుడు సుజీత్ మరియు నేను కోరడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ అడిగిన సమయం కంటే ముందుగానే వచ్చి ఎదురుచూసారు. ఆయన ఎంతో ఇష్టపడి చేసిన ఆ సీన్ ను ప్రేక్షకులు కూడా ఇప్పుడు అంతే ఇష్టంగా చూస్తున్నారు" అంటూ ట్వీట్ వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు కే రవిచంద్రన్.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved