“I Was Nervous About Showing Pawan Kalyan as a Gangster in OG Since He’s Actively in Politics” – Sujeeth
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండడంతో 'OG' లో ఆయనను గ్యాంగ్ స్టర్ గా చూపించడంలో టెన్షన్ పడ్డా - సుజీత్
Following the grand success of OG, director Sujeeth is receiving wide acclaim from all quarters. Fans of Pawan Kalyan are praising him for portraying their favorite star exactly the way they had hoped—if not better. As part of OG promotions, Sujeeth gave an exclusive interview to Idlebrain Jeevi, where he shared insights about the film’s journey and his thought process.
Sujeeth revealed that when he first narrated the story to Pawan Kalyan, it wasn’t pitched as a full-fledged mafia film. “Since he’s active in politics, I was initially nervous about portraying him as a gangster,” he admitted.
The Origin of the Title ‘OG’
Sujeeth said the idea for the title OG struck him as early as 2008, during the early days of YouTube. He had created a rap song titled ‘OG’ and uploaded it, but after receiving negative comments, he took it down. However, the title stuck with him ever since.
When it came time to name the movie, he initially struggled.
“One night, I simply released a poster with Pawan Kalyan’s back-facing photo and a Japanese-style caption: They Call Him OG. I went to sleep, and by the next morning, everyone was talking about the title. It caught on so quickly, I felt like fans would beat me up if I didn’t stick with it,” he said jokingly.
Narrative & Visual Choices
Sujeeth shared that when he got a call to pitch a film for Pawan Kalyan, he happened to be standing at Nariman Point in Bombay, which later became a key backdrop. The film is set against the old Bombay underworld, loosely inspired by the Bombay blasts, though most audiences didn’t catch that layer.
Compared to his other films, Pawan Kalyan’s role in OG is more raw and brutal. Sujeeth also shared a behind-the-scenes moment where Pawan Kalyan practiced Japanese dialogues for two full days. “Initially, people thought I was crazy for suggesting a Japanese line. But when Pawan Kalyan delivered it on set, the entire crew burst into applause. Even the Japanese dialect coach said his services weren’t needed anymore.”
Clarification on Omi’s Timeline Confusion
Sujeeth addressed the confusion surrounding the character Omi appearing in both the hospital and Bombay at the same time. He explained: “We only showed Omi getting off a helicopter. We didn’t show where he went immediately after. According to the story, he lands in Nashik, goes to the hospital, and later arrives in Bombay—after Prakash Raj’s character leaves the hospital. But we failed to clearly convey that timeline, which led to confusion.”
Why Some Scenes Were Shot in Tamil & Japanese
Sujeeth initially wanted the story to begin in Rameswaram, and planned a search for the hero spanning from Kashmir to Kanyakumari. When they decided to place a sequence in Madurai, they filmed it in Tamil for authenticity. While some objected, Pawan Kalyan supported Sujeeth’s vision to retain Tamil. For the Japanese portions, the team brought in well-known actors like Kitamura and Byron Bishop, and felt it would be inauthentic to shoot those scenes in Telugu—so they were shot entirely in Japanese.
Comparison with ‘Good Bad Ugly’
Responding to comparisons with Good Bad Ugly, Sujeeth clarified that OG’s teaser was released before the other film’s script was even written. Scenes featuring Arjun Das were completed for OG well before he was signed as the villain for Good Bad Ugly. “Some people just can’t digest others’ success. The director of Good Bad Ugly is actually a fan of mine and messaged me after watching Saaho.”
Action Design & Sujeeth’s Planning
Sujeeth revealed that each action sequence in OG was meticulously pre-planned, and each was handled by a different stunt choreographer. “That allowed each team to give their best. Every sequence came out brilliantly,” he said.
On OG 2 and Pawan’s Feedback
“Pawan Kalyan gave me a perfect score—100 out of 100—for OG,” Sujeeth proudly shared. While he already has ideas for OG Part 2, Sujeeth emphasized that the decision lies entirely in Pawan Kalyan’s hands.
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండడంతో 'OG' లో ఆయనను గ్యాంగ్ స్టర్ గా చూపించడంలో టెన్షన్ పడ్డా - సుజీత్
'OG' భారీ విజయంతో అందరి నోటా దర్శకుడు సుజీత్ పేరే మార్మోగుతోంది. తమ అభిమాన హీరోని ఎలా తెరపై చూడాలని కోరుకున్నామో దానికి రెట్టింపులో సుజీత్ చూపించాడంటూ సుజీత్ పై ప్రశంశలు కురిపిస్తున్నారు పవన్ అభిమానులు. 'OG' ప్రమోషన్లో భాగంగా 'ఐడిల్ బ్రెయిన్' జీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు సుజీత్. 'OG' కోసం తనతో పాటూ తమ బృందం పడ్డ శ్రమను అంతటినీ వివరించారు సుజీత్. 'OG' కథను మొదటిగా పవన్ కళ్యాణ్ కు చెప్పినప్పుడు అసలు ఇంత మాఫియా కథగానే చెప్పలేదని, ఆయన రాజకీయాల్లో ఉండటంతో గ్యాంగ్ స్టర్ పాత్రలో ఆయనను చూపించే విషయంలో మొదట్లో టెన్షన్ పడేవాడినన్నారు.
'OG' టైటిల్ ఆలోచన తనకు యూట్యూబ్ వచ్చే కొత్తలో 2008 లోనే వచ్చిందని, 'OG' పేరుతో ఒక ర్యాప్ సాంగ్ చేసి యూట్యూబ్ లో పెట్టడం జరిగిందని, కానీ యూట్యూబ్ లో అందరూ నెగెటివ్ కామెంట్లు పెట్టడంతో ఆ వీడియోను డిలీట్ చేసేసానన్నారు. కానీ అప్పటి నుండి 'OG' అనే టైటిల్ తన మనసులో ఉండిపోయిందన్నారు. 'OG' సినిమా టైటిల్ విషయంలో కూడా మొదట్లో ఏ టైటిల్ పెట్టాలో తనకు తట్టకపోవడంతో పవన్ కళ్యాణ్ వెనక్కు తిరిగి ఉన్న ఫోటోతో జపనీస్ శైలిలో 'They Call Him OG' అనే క్యాప్షన్ పెట్టి ఒక పోస్టర్ విడుదల చేసేసి ఆరోజు రాత్రి నిద్రపోయానన్నారు. కానీ మరుసటి రోజు ఉదయం చూసేసరికి అందరూ 'OG' టైటిల్ గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారని, 'OG' టైటిల్ పెట్టకపోతే తనను కొడతారేమో (నవ్వుకుంటూ) అన్నంతలా అభిమానుల్లోకి దూసుకొని వెళ్ళిపోయిందన్నారు.
'OG' గురించి ఇంకా చెబుతూ.. "పవన్ కళ్యాణ్ తో సినిమా గురించి ఏదైనా కథ ఉంటే తీసుకురమ్మని నాకు చెప్పడానికి నాకు కాల్ వచ్చినప్పుడు నేను అదే బొంబాయ్ లో అదే నారీమన్ పాయింట్ దగ్గరే నేనున్నా. ఎలాగైనా ఓల్డ్ బొంబాయ్ నేపథ్యంలోనే మాఫియా వరల్డ్ ను చూపిస్తూ సినిమాను తీద్దామనుకున్నాను. కథను నేను బొంబాయ్ బ్లాస్ట్ నేపథ్యంలో తీసినా, ప్రేక్షకులు ఆ విషయాన్ని గమనించలేదు. పవన్ కళ్యాణ్ ఇతర సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో కొంచెం బ్రూటల్ గానే వెళ్ళారు. ఈ సినిమాలో జపనీస్ డైలాగ్ కోసం పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటూ ప్రాక్టీస్ చేసారు. ఆ డైలాగ్ విషయంలో మొదట్లో అందరూ నాకేమైనా పిచ్చా అనుకునేవారు. కానీ పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పిన తరువాత అందరూ షూటింగ్ దగ్గరే చప్పట్లు కొట్టారు.
పవన్ కళ్యాణ్ జపనీస్ కూడా చాలా క్రేజీగా మాట్లాడేవారు. ఓ సందర్భంలో జపనీస్ డిక్టేటర్ నా దగ్గరకు వచ్చి పవన్ కళ్యాణ్ జపనీస్ డబ్బింగ్ కు తన అవసరమే లేదన్నారు" అంటూ చెప్పుకొచ్చారు సుజీత్. సినిమాలో ఒకేసారి హాస్పిటల్ మరియు బొంబాయ్ నగరంలో ఓమీ కనిపించడం విషయంలో కొందరికి అపోహలు కలిగిన మాట వాస్తవమే అన్నారు. వాస్తవానికి అక్కడ సన్నివేశంలో కూడా ఓమీ పాత్ర హెలికాప్టర్ దిగడం మాత్రమే చూపించామని, తరువాత ఎక్కడకు వెళ్ళాడో అన్న విషయాన్ని చూపించలేదన్నారు. తమ కథలో భాగంగా ఓమీ పాత్ర హెలికాప్టర్ నుండి దిగి, అక్కడ నుండి హాస్పిటల్ కు వచ్చి తిరిగి మళ్లీ బొంబాయ్ వెళ్లాల్సి ఉంటుందని, ప్రకాష్ రాజ్ పాత్ర హాస్పిటల్ నుండి బయటకు వెళ్లిన తరువాత ఓమీ అక్కడకు రావడం జరుగుతుందన్నారు. కానీ టైమ్ లైన్ విషయాన్ని సరిగ్గా చెప్పకపోవడం వలన ఆడియన్స్ కు కాస్త సందేహం కలిగిందన్నారు.
'OG' కథలో హీరో పాత్రను మొదట రామేశ్వరం నుండే ఆరంభించాలనుకున్నామన్నారు. హీరోను వెతికే క్రమంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకూ వెతికేలా తీయాలన్నదే తన మొదటి ఆలోచన అన్నారు. అలా అనుకున్న సమయంలో మధురైలో చూపించాలన్న ఆలోచన కలగడంతో అక్కడి సన్నివేశాల్లో సహజత్వం కోసం తమిళంలోనే చిత్రీకరణ చేశామన్నారు. చర్చల్లో కొందరు తన ఆలోచనను వ్యతిరేకించినా పవన్ కళ్యాణ్ మాత్రం తనను సమర్థించి తమిళ భాషలోనే తీయమని తనకు చెప్పారన్నారు. జపాన్ నేపథ్యంలో నడిచే కథలో, జపాన్ నుండి కిటామురా మరియు బైరాన్ బిషప్ లాంటి ప్రముఖ నటులను సినిమా కోసం తీసుకొని కూడా ఆ సన్నివేశాలను తెలుగులో తీస్తే బాగుండదన్న ఆలోచన రావడంతో జపనీస్ భాషలోనే చిత్రీకరణ చేశామన్నారు.
'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలతో పోల్చడంపై కూడా స్పదించారు సుజీత్. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' కథకు ఆ చిత్ర దర్శకుడు పేపర్ పై పెన్ను పెట్టకముందే 'OG' టీజర్ రిలీజయిందన్నారు సుజీత్. 'OG' లో కటానాతో ఎప్పుడో షూటింగ్ పూర్తయిపోయిందని, అదే సమయంలో అనుకోకుండా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' బృందం కూడా 'OG సంభవం' అనే పాటను కూడా విడుదల చేయడంతో ముందుగా వాళ్ల మెటీరియల్ బయటకు రావడంతో అదే ముందనుకొని కొందరు పొరబడుతున్నారన్నారు. ఎదుటివాళ్ల ఎదుగుదలను జీర్ణించుకోలేని కొంతమంది ఇలాంటి విమర్శలు చేస్తూ ఉంటారన్నారు. నటుడు అర్జున్ దాస్ తో 'OG' లో సన్నివేశాలు చిత్రీకరణ అయిన తరువాతనే 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలో విలన్ పాత్రకు తను వెళ్లడం జరిగిందన్నారు. ఆ చిత్ర దర్శకుడికి కూడా తనంటే చాలా అభిమానమని, 'సాహో' చూసి తనను అభినందిస్తూ మెసేజ్ కూడా పెట్టారన్నారు.
OG' లో ప్రతీ యాక్షన్ సన్నివేశాన్నీ ముందుగా ఒక ప్రణాళిక వేసుకొనే చిత్రీకరించామన్నారు. ఒక్కొక్క యాక్షన్ సీన్ ఒక్కో స్టంట్ మాస్టర్ తో చేయడం వలన అందరూ తమకున్న సర్వ శక్తులూ ఒడ్డి అద్భుతంగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారన్నారు. 'OG' సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ నుండి తనకు వందకు వంద మార్కులు పడిపోయాయన్నారు. 'OG పార్ట్ 2' ఆలోచన తన దగ్గరున్నా ఆ సినిమా నిర్ణయం పవన్ చేతుల్లోనే ఉందన్నారు.