pizza

Sujeeth Clarifies Omi’s Presence in Two Cities at the Same Time in OG
'OG' లో ఒకేసారి ఓమీ పాత్ర రెండు వేరు వేరు నగరాల్లో కనిపించడం గురించి సుజీత్ వివరణ..

You are at idlebrain.com > news today >

28 September 2025
Hyderabad

Director Sujeeth responded to a question by Idlebrain Jeevi regarding the confusion around the character Omi appearing in two different cities simultaneously in OG.

He acknowledged that some viewers were indeed confused about Omi being seen in both the hospital and Bombay at the same time. However, he clarified that the scene only shows Omi getting off a helicopter, and it is never shown where he goes immediately afterward.

According to the film's internal story timeline, Omi lands in Nashik via helicopter, then travels to the hospital, and only later heads to Bombay. His arrival at the hospital happens after Prakash Raj’s character leaves, but the film did not clearly communicate this timeline, which led to some confusion among the audience.

'OG' లో ఒకేసారి ఓమీ పాత్ర రెండు వేరు వేరు నగరాల్లో కనిపించడం గురించి సుజీత్ వివరణ..

'OG' లో 'ఓమీ' పాత్ర ఒకేసారి వేరు వేరు ప్రాంతాల్లో కనిపించడంపై 'ఐడిల్ బ్రెయిన్' జీవీ అడిగిన ప్రశ్నకు వివరణ ఇచ్చారు దర్శకుడు సుజీత్. ఒకేసారి హాస్పిటల్ మరియు బొంబాయ్ నగరంలో ఓమీ కనిపించడం విషయంలో కొందరికి అపోహలు కలిగిన మాట వాస్తవమే అన్నారు. వాస్తవానికి అక్కడ సన్నివేశంలో కూడా ఓమీ పాత్ర హెలికాప్టర్ దిగడం మాత్రమే చూపించామని, తరువాత ఎక్కడకు వెళ్ళాడో అన్న విషయాన్ని చూపించలేదన్నారు. తమ కథలో భాగంగా ఓమీ పాత్ర నాశిక్ లో హెలికాప్టర్ నుండి దిగి, అక్కడ నుండి హాస్పిటల్ కు వచ్చి బొంబాయ్ వెళ్లాల్సి ఉంటుందని, ప్రకాష్ రాజ్ పాత్ర హాస్పిటల్ నుండి బయటకు వెళ్లిన తరువాత ఓమీ అక్కడకు రావడం జరుగుతుందన్నారు. కానీ టైమ్ లైన్ విషయాన్ని సరిగ్గా చెప్పకపోవడం వలన ఆడియన్స్ కు కాస్త సందేహం కలిగిందన్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved