After a long time, September has been the month where audiences have actively rushed to theatres for multiple films. Movies like Kotha Lokam, Little Hearts, Mirai, and Kishkindhapuri have witnessed strong footfalls. Riding that momentum, another big release OG is all set to hit the screens on September 25.
Expectations are sky-high for OG, both within the industry and among Pawan Kalyan’s fans. Starring Pawan Kalyan in the lead role, the film features Priyanka Mohan as the heroine. Emraan Hashmi plays the antagonist, while Prakash Raj and Arjun Das appear in key roles. The film is directed by Sujeeth and produced by DVV Entertainment, with music by Thaman.
Over the past few days, the team has been strategically releasing one update after another. Today’s update, in particular, has thrilled Pawan fans. The previously released three songs have already taken the internet by storm, and it’s evident from the posters that Pawan Kalyan has taken a special interest in this project.
With the release date approaching fast, fans have been putting immense pressure on social media to know the trailer date. Responding to that, the makers finally announced today that the official trailer of OG will be released on September 21. The update has sent waves of excitement across social media, with fans celebrating and sharing their joy online.
ఈనెల 21 న 'OG' ట్రైలర్.. పవన్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన 'OG' యూనిట్..
చాలా రోజుల తరువాత ఒకే నెలలో వచ్చిన సినిమాల వైపు జనాలు కదలడం ఈ సెప్టెంబర్ నెలలోనే ఎక్కువ కనిపించింది. 'కొత్తలోక', 'లిటిల్ హార్ట్స్', 'మిరాయ్' మరియు 'కిష్కింధపురి' సినిమాల థియేటర్ల వైపు జనం బాగానే పరుగులు పెట్టారనే చెప్పుకోవచ్చు. అదే ఉత్సాహంతో ఈ నెల 25 న మరో పెద్ద సినిమా 'OG' రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై అటు పరిశ్రమలోనూ ఇటు పవన్ అభిమానుల్లోనూ చాలా అంచనాలు ఏర్పడ్డాయి. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన హీరోయిన్ గా ప్రియాంక మోహన్ కనిపించబోతున్నారు. ప్రతినాయకుడిగా ఎమ్రాన్ హష్మీ కనిపించగా, ప్రకాష్ రాజ్ మరియు అర్జున్ దాస్ కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. ప్రముఖ DVV ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించగా, థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ గత కొన్ని రోజులుగా ఒక్కొక్క అప్డేట్ విడుదల చేస్తూ వస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఇచ్చిన అప్డేట్ పవన్ అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. ఇప్పటికే విడుదలైన 3 పాటలకూ పవన్ అభిమానులు ఉర్రూతలు ఊగిపోయారన్న విషయం చూస్తున్నదే. దానికి తగ్గట్టే ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు ఆ సినిమా పోస్టర్లు చూస్తుంటేనే అర్థమవుతుంది. విడుదల దగ్గరపడుతుండటంతో అభిమానుల నుండి ట్రైలర్ విడుదల తేదీ కోసం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంది చిత్ర యూనిట్. దాంతో చిత్ర యూనిట్ ఈరోజు 'OG' ట్రైలర్ ఈ నెల 21 న రిలీజ్ కాబోతుందని ప్రకటించడంతో అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.