`
pizza

Dil Raju launched the trailer of O Kala... Movie to release on Disney Hotstar on April 13
దిల్ రాజు చేతుల మీదుగా ‘ఓ కల’ ట్రైలర్ విడుదల.. ఏప్రిల్ 13న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

05 April 2022
Hyderabad

‘‘ఓ కల ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. టీమ్ మొత్తానికి ఆల్ ద బెస్ట్. ఏప్రిల్ 13 నుంచి ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో విడుదల కాబోతోంది. తప్పకుండా అందరూ చూసి టీమ్‌ని ఆశీర్వదించండి’’ అని అన్నారు సక్సెస్‌ఫుల్ నిర్మాత దిల్ రాజు. ఎటిర్నిటి ఎంటర్‪టైన్‪మెంట్, అహం అస్మి ఫిల్మ్స్ బ్యానర్లపై గౌరీశ్ యేలేటి, రోషిణి, ప్రాచీ ఠక్కర్ హీరోహీరోయిన్లుగా దీపక్ కొలిపాక దర్శకత్వంలో లక్ష్మీ నవ్య మోటూరు, రంజిత్ కుమార్ కొడాలి, అదిత్య రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఓ కల’. ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు దీపక్ కొలిపాక మాట్లాడుతూ.. ‘‘తెలుగు సినిమాకి ప్రపంచ స్థాయి గుర్తింపుని తీసుకువచ్చిన దర్శకధీరుడు రాజమౌళిగారి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదల చేశాం. ఆయన ఆశీస్సులు మాకు ఎంతో బలాన్నిచ్చాయి. ఇప్పుడు సక్సెస్‌ఫుల్ నిర్మాత దిల్ రాజుగారు ట్రైలర్ విడుదల చేసి.. సినిమా విజయవంతం కావాలని ఆశీర్వదించారు. మా టీమ్ తరపున ఆయనకు ధన్యవాదాలు. సినిమా విషయానికి వస్తే.. ఒక మంచి కథని తెలుగు ప్రేక్షకులకు చెప్పే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు నా ధన్యవాదాలు. వారిచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. హీరో హీరోయిన్లు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఎంతగానో సహకరించారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‪తో.. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‪టైనర్‪గా ఈ సినిమాని తెరకెక్కించాం. ఏప్రిల్ 13 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. తప్పకుండా అందరూ చూసి విజయవంతం చేస్తారని భావిస్తున్నాను’’ అని తెలిపారు.

గౌరీశ్ యేలేటి, రోషిణి, ప్రాచీ ఠక్కర్, అలీ, వైవా రాఘవ్, దేవి ప్రసాద్, శక్తి, రవితేజ(కమెడియన్) తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ: అఖిల్ వల్లూరి
సంగీతం: నీలేష్ మందలపు
ఎడిటర్: సత్య గిడుటూరి
ఆర్ట్: ప్రేమ్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మహేష్ మోటూరు
పీఆర్వో: బి. వీరబాబు
నిర్మాతలు: లక్ష్మీ నవ్య మోటూరు, రంజిత్ కుమార్ కొడాలి, అదిత్య రెడ్డి
దర్శకత్వం: దీపక్ కొలిపాక

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved