6 February 2024
Hyderabad
వరుణ్ తేజ్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ నుంచి గగనాల సాంగ్ గ్రాండ్ గా లాంచ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్' ఫస్ట్ సింగిల్ వందేమాతరం అన్ని వైపుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంది. మ్యూజికల్ జర్నీని ప్రారంభించడానికి ఇది సరైన పాటగా నిలిచింది. జాతీయ అంశాలు, ఇంటెన్స్ యాక్షన్‌తో పాటు, సినిమాలో మెస్మరైజింగ్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. సినిమా రొమాంటిక్ లేయర్‌ని చూపించడానికి, మేకర్స్ రెండవ సింగిల్-గగనాల ను గ్రాండ్ గా లాంచ్ చేశారు,
ఫస్ట్ సింగిల్ కంపోజిషన్‌తో అందరినీ ఆకట్టుకున్న మిక్కీ జె మేయర్, గగనాల పాట కోసం ఒక ఆకర్షణీయమైన రొమాంటిక్ మెలోడీని అందించాడు. లీడ్ పైర్ వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న లవ్ బర్డ్స్ గా మెస్మరైజింగ్ కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించగా, అర్మాన్ మాలిక్ ఆకట్టుకునేలా పాడారు. ఆకర్షణీయమైన విజువల్స్ ఉన్న పాటతో సంగీత ప్రియులు వెంటనే ప్రేమలో పడతారు.
సాంగ్ లాంచ్ ఈవెంట్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ఈ పాట మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఆనందంగా వుంది. పాట కంటే సినిమా మరో స్థాయిలో వుంటుంది. మనందరికీ ఫ్యామిలీస్, ఫ్రండ్స్ వుంటారు. ఒకరిని ఒకరం జాగ్రత్తగా చూసుకుంటాం. కానీ దేశాన్ని కాపాడే సైనికుడు 130కోట్ల మందిని తన కుటుంబంగా భావించి తన కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు. అలాంటి సైనికుల కోసం, వాళ్ళు చేసిన త్యాగాల కోసం, వాళ్ళ కథని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే గొప్ప ఉద్దేశంతో 'ఆపరేషన్ వాలెంటైన్' చేశాం. థియేటర్స్ లో మన దేశానికి రియల్ సూపర్ హీరోస్ అయిన వారి కథని చూసి ప్రేక్షకులంతా చాలా గర్వంగా ఫీలౌతారు. ఆపరేషన్ వాలెంటైన్ మార్చి 1న థియేటర్స్ లోకి వస్తుంది. తప్పకుండా చూడండి. మీ అందరికీ నచ్చుతుందని గర్వంగా చెబుతున్నాను. జై హింద్ '' అన్నారు.
హీరోయిన్ మానుషి చిల్లర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. వాలెంటైన్స్ డే సమయంలో ఈ పాట విడుదల చేయడం పర్ఫెక్ట్ లాంచ్. ఆపరేషన్ వాలెంటైన్ అందరూ గర్వపడే అద్భుతమైన చిత్రం. మార్చి 1న థియేటర్స్ లోకి వస్తుంది. అందరూ తప్పకుండా థియేటర్స్ లో చూడాలి' అని కోరారు.
ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఐఏఎఫ్ ఆఫీసర్‌గా నటిస్తుండగా, మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్‌గా కనిపించనుంది. 'ఆపరేషన్ వాలెంటైన్' దేశంలోని వైమానిక దళ వీరుల అలుపెరగని పోరాటాని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్ల అద్భుతంగా చూపించబోతుంది.
ఆపరేషన్ వాలెంటైన్’ కు శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించారు, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలు.
ఆపరేషన్ వాలెంటైన్ మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.