pizza

Tharun Bhascker, Eesha Rebba,A R Sajeev, S Originals, Movie Verse Studios’ Film Titled Om Shanti Shanti Shantihi, Concept Video Looks Pleasant, Releasing In Theatres Worldwide On August 1st
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, ఎ ఆర్ సజీవ్, ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ మూవీ టైటిల్ 'ఓం శాంతి శాంతి శాంతిః'- ప్లెజెంట్ కాన్సెప్ట్ వీడియో రిలీజ్- ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్

You are at idlebrain.com > news today >

05 July 2025
Hyderabad

Tharun Bhascker, who has already impressed with his performances in multiple films, is playing the lead role in another intriguing project, with Eesha Rebba playing the female lead. Touted to be a rib-tickling rural entertainer, the film is being helmed by debutant A R Sajeev . Produced by Srujan Yarabolu, Aditya Pittie, Vivek Krishnani, Anup Chandrasekaran, Sadhik Shaik, Naveen Sanivarapu, with Kishore Jaladi and Bala Sowmitri as co-producers. This is the joint production venture of S Originals and Movie Verse Studios.

With the shoot already wrapped up, the makers have kickstarted promotions by unveiling a striking title poster along with a concept video presented in a vibrant 2D animation style. Set in a rustic backdrop, the poster captures only the hands of the lead pair locked in conflict, hinting at marital discord without revealing their faces. The title itself, Om Shanti Shanti Shantihi, offers a humorous contrast to the chaos teased in the visuals.

The concept video introduces Eesha as Kondaveeti Prashanti, a typical village belle, and Tharun as Ambati Omkar Naidu, a van owner. The story takes a turn after their marriage, with their post-wedding clashes symbolically represented through cockfights.

Jay Krish’s lively, folk-tinged score enhances the rural charm. Deepak Yeragara handles the cinematography. The film promises a blend of humor, culture, and relatable relationship drama, with an offbeat presentation.

As announced by the makers, the movie will release worldwide on August 1st.

Cast: Tharun Bhascker, Esha Rebba, Bramhanandham, Brahmaji , Surabhi Prabhavathi, Goparaju Vijay, Sivannarayana(Amrutham Appaji), Bindu Chandramouli, Dheeraj Aathreya, Anshvi.

Technical Crew:
Writer, Director - A R Sajeev
Producers - Srujan Yarabolu, Aditya Pittie, Vivek Krishnani, Anup Chandrasekharan, Sadhik Shaik, Naveen Sanivarapu.
Banner- S Originals & MovieVerse Studios
Co-Producers: Kishore Jaladi and Bala Sowmitri

Music - Jay Krish
Director of Photography - Deepak Yeragara
Dialogues - Nanda Kishore Emani
Excutive producer : Bhuvan Salaru
Line producer - Srinivasa rao Irla

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, ఎ ఆర్ సజీవ్, ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ మూవీ టైటిల్ 'ఓం శాంతి శాంతి శాంతిః'- ప్లెజెంట్ కాన్సెప్ట్ వీడియో రిలీజ్- ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్

ఇప్పటికే పలు సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న తరుణ్ భాస్కర్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ లో లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తోంది. రూరల్ ఎంటర్ టైనర్ గా రాబోతునన్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు ఎ ఆర్ సజీవ్ దర్శకత్వం వహిస్తున్నారు. సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు నిర్మిస్తున్నారు. కిషోర్ జలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇది ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ జాయింట్ ప్రొడక్షన్.

షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. 2D యానిమేషన్ స్టయిల్ లో ప్రజెంట్ చేసిన కాన్సెప్ట్ వీడియోతో పాటు ఆకట్టుకునే టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేయడంతో మేకర్స్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ పోస్టర్ గొడవ పడుతున్న జంట చేతులను చూపించడం ఆసక్తికరంగా వుంది. 'ఓం శాంతి శాంతి శాంతిః 'అనే టైటిల్ విజువల్స్‌లో చూపించిన గొడవకు ఫన్ యాడ్ చేసింది.

కాన్సెప్ట్ వీడియోలో ఈషాను కొండవీటి ప్రశాంతి అనే పల్లెటూరి అమ్మాయిగా, తరుణ్‌ను వ్యాన్ యజమాని అంబటి ఓంకార్ నాయుడుగా పరిచయం చేశారు. వారి పెళ్లి తర్వాత కథ మలుపు తిరుగుతుంది. ఇద్దరి మధ్య వాగ్వాదాలు, గొడవలు పందెంకోళ్ల తలపించేట్టుగా చూపించారు.

జై క్రిష్ మ్యూజిక్ రూరల్ చార్మ్ ని మరింతగా ఎలివేట్ చేసింది. దీపక్ యెరగర సినిమాటోగ్రఫర్. ఈ చిత్రం హ్యుమర్, కల్చర్, రిలేషన్షిప్ డ్రామాతో అందరినీ అలరించబోతోంది.

ఈ చిత్రం ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు.

తారాగణం: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సురభి ప్రభావతి, గోపరాజు విజయ్, శివన్నారాయణ(అమృతం అప్పాజీ), బిందు చంద్రమౌళి, ధీరజ్ ఆత్రేయ, అన్ష్వీ.
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం - ఎ ఆర్ సజీవ్
నిర్మాతలు - సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు.
బ్యానర్- S ఒరిజినల్స్ & మూవీవెర్స్ స్టూడియోస్
సహ నిర్మాతలు: కిషోర్ జాలాది, బాల సౌమిత్రి
సంగీతం - జై క్రిష్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ - దీపక్ యెరగరా
డైలాగ్స్ - నంద కిషోర్ ఈమాని
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: భువన్ సాలారు
లైన్ ప్రొడ్యూసర్ - శ్రీనివాసరావు ఈర్ల


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved