Om Shanti Shanti Shantihi pre release event
'ఓం శాంతి శాంతి శాంతిః' ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే సినిమా. తప్పకుండా థియేటర్స్ లో చూడండి. అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో తరుణ్ భాస్కర్
మల్టీ ట్యాలెంటెడ్ తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ లో నటిస్తున్న హిలేరియస్ విలేజ్ కామెడీ ఎంటర్ టైనర్ 'ఓం శాంతి శాంతి శాంతిః. ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తున్నారు. A R సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు ఈ వెంచర్‌ను నిర్మిస్తుండగా, కిషోర్ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఓం శాంతి శాంతి శాంతిః జనవరి 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ ఈషా రెబ్బా మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. 'ఈ నగరానికి' బాయ్స్ అందరు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. సృజన్ నాకు చాలా ఏళ్లుగా తెలుసు. తను ఎప్పుడు కూడా కొత్త కంటెంట్ ని ప్రోత్సహిస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి థాంక్స్. నన్ను ఈ క్యారెక్టర్ లో బిలీవ్ చేసినందుకు సజీవ్ కి థాంక్యూ. సజీవ్ ఈ సినిమాని డిజైన్ అద్భుతంగా చేశారు. నందు చాలా చక్కని డైలాగ్స్ రాశారు. ప్రతి క్యారెక్టర్ రిలేట్ అయ్యేలా ఉంటుంది. ఇందులో చాలా మీనింగ్ ఫుల్ మ్యూజిక్ మ్యూజిక్ వుంటుంది. తరుణ్ గారి డైరెక్షన్ లో వర్క్ చేయాలని ఉండేది. ఆయన యాక్టింగ్ కూడా చక్కగా చేస్తారని తెలుసు. కానీ ఆయనకి గోదావరి యాస రావడం చాలా చాలా కష్టం. దాని కోసం చాలా ప్రిపేర్ అయ్యారు. అంబటి ఓంకార్ నాయుడు పాత్రకి ప్రాణం పోశారు. ఆయనతో వర్క్ చేసినందుకు ఆనందంగా ఉంది. ఆయన డైరెక్షన్లో కూడా పని చేస్తాననే నమ్మకం ఉంది. ఇందులో నా క్యారెక్టర్ తో ప్రతి అమ్మాయి రిలేట్ అవుతుంది. ఫ్యామిలీ అందరికీ నచ్చే సినిమా ఇది. ఈ సినిమా పని చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. జనవరి 30న తప్పకుండా అందరూ థియేటర్స్ కి వెళ్లి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను.
హీరో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ. అందరికీ నమస్కారం. అందరికంటే చివర్లో హీరోనే మాట్లాడాలి. ఇందులో మా హీరో ఈషా. తనే చివర్లో మాట్లాడుతుంది (నవ్వుతూ) డైరెక్టర్ సజీవ్ చాలా మంచి మనిషి. తనకు కావాల్సింది వచ్చేంతవరకు హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాడు. ఇందులో గోదారి యాస చక్కగా పలికాను. దానికి కారణం తనే. రాత్రి నిద్రలో కూడా నాకు ఆ గోదారి యాస, ఆ ప్రాంతమే కలలోకి వచ్చేద( నవ్వుతూ) నందు చక్కని మాటలు రాశాడు. డైరెక్షన్ టీమ్ అందరికీ థాంక్యు. ఈ సినిమాకి చాలా మంది హీరోలు ఉన్నారు. ఈ సినిమా అందరూ రిమేక్ అంటున్నారు. కానీ ఈ కథని ఒరిజినల్ గా ప్రజెంట్ చేయడానికి నిదర్శనమే ఆ పాట. జై క్రిష్ వజ్రం లాంటి సాంగ్ ఇచ్చాడు. ధీరజ్ బ్రహ్మాజీ గారు అందరు కూడా పాత్రలో ఇమిడిపోయారు. ఈ నగరానికి ఏమైంది బాయ్స్ అందరికీ థాంక్ యూ. వాళ్ళకి షూటింగ్ అని చెప్పాను. అందుకే వచ్చారు (నవ్వుతూ) ఫ్యామిలీ అంతా కలిసి ఒక సినిమా చేసిన ఫీలింగ్ కలుగుతుంది. సృజన్ నా జూనియర్. తనని ఎప్పుడు చూసినా నాకు అదే ఫీలింగ్ ఉంటుంది. తనకి సినిమా అంటే చాలా పాషన్. ఈ రోజుల్లో సినిమాలు నిర్మించడం చాలా కష్టమైన పని. ఏ సినిమా ఎప్పుడు ఆడుతుందో తెలీదు. ఇలాంటి సమయంలో ప్రొడ్యూసరే హీరో. ఈ సినిమా నిర్మాతలు అందరికీ హాట్సాఫ్. ఇంతమంది హీరోల మధ్యలో నేను చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ నే. ఈషా అంటే నాకు చాలా ఇష్టం. నెట్ ఫ్లిక్స్ లో రాములు చేసినప్పుడు కూడా తనని సంప్రదించాను. అప్పుడు తను వేరే ప్రాజెక్టులో భాగమై ఉన్నారు. శాంతి క్యారెక్టర్ కు తన ప్రాణం పోశారు. తను రియల్ లైఫ్ లో కూడా ఎన్ని ఎలాంటి పరిస్థితులు కూడా చాలా శాంతిగా ఉంటారు. ఈ సినిమాకి హీరో ఈషా. ఈ సినిమా తప్పకుండా మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తుందని నమ్మకం ఉంది అందరూ థియేటర్స్ లో వెళ్లి సినిమా చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు
డైరెక్టర్ సజీవ్ మాట్లాడుతూ.. అందరికీ థాంక్యూ సో మచ్. సృజన్ గారు కథలు ఎంపిక చాలా నిజాయితీగా ఉంటుంది. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన ఆయనకి థాంక్యూ. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ప్రొడక్షన్ డిజైన్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాం. సినిమా చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది. జై క్రిష్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్లారు ఈ సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోతుంది. ఈ సినిమాకి సూపర్ స్టార్ ఈషా గారు. శాంతి పాత్ర జీవితాంతం గుర్తుండిపోతుంది. తరుణ్ భాస్కర్ గారు నా లైఫ్ లో హీరో. ఆయన సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయితే చాలు అనుకునేవాడిని. ఆయన్ని డైరెక్ట్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులో తరుణ్ భాస్కర్ ఓంకార్ నాయుడు పాత్రలో గుర్తుండిపోతారు. చాలా నిజాయితీగా తీసిన సినిమా ఇది. కచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ ఒక కొత్తదనం ఇస్తుంది. తప్పకుండా ఈ సినిమాని థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను.
బివిఎస్ రవి మాట్లాడుతూ.. తరుణ్ నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. తను సైన్మా అనే షార్ట్ ఫిలిం తీసినప్పుడు నుంచి తనని ఫాలో అవుతున్నాను. తెలుగు సినిమాకి ఒక రెవల్యూషన్ తీసుకొచ్చిన డైరెక్టర్ తను. తన నటన కూడా చాలా విలక్షణంగా ఉంటుంది. ఇప్పటివరకు తను చేసిన పాత్రలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. ఈశా లాంటి అద్భుతమైన నటి. తను బతికున్నంత కాలం తెలుగు సినిమా పరిశ్రమలో ఉంటుంది. సృజన్ మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేసే నిర్మాత. చాలా మంచి టీం తోస్తున్న సినిమా ఇది. తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుంది.
హీరో విశ్వక్సేన్ మాట్లాడుతూ.. అందరికీ గుడ్ ఈవెనింగ్. గత ఏడాదిగా పబ్లిక్ అపీరియన్స్ డిటాక్స్ అని అండర్ గ్రౌండ్ లో తిరుగుతుండే(నవ్వుతూ) కానీ ఇది ఫ్యామిలీ ఫంక్షన్. డిటాక్స్ కుదరదు. ఫలక్ నామదాస్ లో సైదులు క్యారెక్టర్ ని తరుణ్ తో చేయించడానికి చాలా కష్టపడ్డాను. ఏదో రకంగా ఒప్పించి చేయించాను. అయితే తర్వాత చాలా బాధపడ్డాను. ఎందుకంటే తన యాక్టర్ గా చాలా బిజీ అయిపోయాడు. ఈ నగరానికి ఏమైంది 2 స్టార్ట్ చేస్తారా లేదా అనే టెన్షన్ వచ్చింది. అజయ్ భూపతి సినిమాలో తను ఐటెం సాంగ్ చేసినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. నేను పరిచయం లేని రోజుల్లో నా కోసమైనా బలంగా నిలుచున్నాడు. మోస్ట్ హానెస్ట్ పర్సన్ తను. నా బ్లడ్ బ్రదర్. ఇది నాకు హోం ఫంక్షన్. సినిమా ఈ కథ తెలుసు. ఈషా క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. సృజన్ కి మంచిగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. అందరు ఈ సినిమాని థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను.
హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. తరుణ్ ని యాక్టర్ గా చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. తన ఒక నదిలా ఫ్లోలో ఉంటాడు. ఈ సినిమా ధైర్యంగా ముందుకు తీసుకెళుతున్న సృజన్ గారికి అభినందనలు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత మనందరికీ గుర్తుండిపోయే పేరు ఈషా. తనని ఇలాంటి క్యారెక్టర్ లో చూడడం చాలా కొత్తగా ఉంది. తప్పకుండా ఈ సినిమాని అందరూ జనవరి 30న థియేటర్స్ కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. అందరూ థియేటర్స్ లో కలిసి ఈ సినిమాని ఆస్వాదిస్తుంటే దాని ద్వారా వచ్చే ఎనర్జీ చాలా పాజిటివ్ గా ఉంటుంది.
అభినవ్ మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్ టీజర్ సాంగ్స్ అందరికీ రీచ్ అయ్యాయి. నటుడిగా డైరెక్టర్గా తరుణ్ చాలా ఇష్టం. నాకు ఈ సినిమా టీజర్ ట్రైలర్ మ్యూజిక్ చాలా నచ్చాయి. గోదావరి చాలా ఫ్రెష్ గా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ నచ్చే సినిమా ఇది. తప్పకుండా ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను.
శ్రీనాథ్ మాగంటి మాట్లాడుతూ... తరుణ్ గారితో వర్క్ చేస్తున్నప్పుడు పని చేస్తున్నామా పార్టీ చేసుకుంటున్నామా అర్థం కాదు. చాలా మంచి టీం తో చేసిన సినిమా ఇది. తప్పకుండా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. ట్రైలర్ చూసి చాలా ఎంజాయ్ చేశాను. అందరూ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను
వెంకటేష్ మాట్లాడుతూ.. ఈ సినిమా నేను చూశాను. చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా థియేటర్స్ లో పడి పడి నవ్వుతారు. తరుణ్ గారికి ఇషా గారికి అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. తప్పకుండా ఈ సినిమా అందరూ థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను.
ప్రొడ్యూసర్ సృజన్ మాట్లాడుతూ.. ఒక బ్యాక్ గ్రౌండ్ లేని ప్రొడ్యూసర్ కి సినిమా చేసే ఒత్తిడి కంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ ని పిలవడంలో చాలా ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఒక్క ఫోన్ కాల్ తో మా ఈ నగరానికి ఏమైంది టీమ్ అందరు కూడా ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఒక ఫోన్ కాల్ తో దర్శి రావడం కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇది రీమేక్ అని మేమే చెప్పాము. రీమేక్ అంటే మనం చూసిన కథని ఇంకొక లాగా చెప్పడం. రామాయణం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా కథ అదే. కానీ ఒక్కొక్క కోణంలో ఒక్కోలా కనిపిస్తుంది. ఈ సినిమా కూడా ఇంటింటా రామాయణం. ఎన్నిసార్లు చూడాలనుకున్నా మళ్లీ చూడొచ్చని నమ్మి చేసిన సినిమా. జనవరి 30న మీరు థియేటర్స్ కి వెళితే కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాం.మమ్మల్ని నమ్మి అందరూ థియేటర్స్ కి రావాలని కోరుకుంటున్నాం.
ప్రొడ్యూసర్ అనూప్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో భాగమవడం చాలా ఆనందంగా ఉంది. తరుణ్ భాస్కర్ చాలా ప్రతిభ ఉన్న దర్శకుడు నటుడు. మంచి హ్యూమన్ బీయింగ్. చాలా నిజాయితీగా ఉంటాడు. తనతో మాట్లాడుతున్నప్పుడు ఒక బ్రదర్ తో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. తప్పకుండా తనని తమిళ్లో కూడా తీసుకువెళ్లాలని ఉంది. తను నెక్స్ట్ సూపర్ స్టార్. చాలా ప్రేమతో ఈ మాట చెప్తున్నాను. అందరూ కష్టపడి పని చేశారు తప్పకుండా ఈ సినిమా మీ అందరిని అలరిస్తుంది.
ప్రొడ్యూసర్ వివేక్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. ఈవెంట్ కి వచ్చిన అందరికీ స్వాగతం. సృజన్ తో కలిసి ఈ సినిమాని నిర్మించాం . తెలుగు సినిమా ఒక ఎమోషన్. రాజమండ్రిలో షూట్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఓం శాంతి అందరికీ కనెక్ట్ అయ్యే కథ. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్. జనవరి 30న అందరు ఈ సినిమా వెళ్లి థియేటర్స్ కి వెళ్లి చూడాలని కోరుకుంటున్నాన. నచ్చితే మీ ఫ్యామిలీ గ్రూప్స్ లో ఒక మెసేజ్ పెట్టండి. అది మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ ప్రేమ, మీ సినిమా, మీ ఫుడ్.. ఆల్ బ్లాక్ బస్టర్' . ఈ వేడుకలో మూవీ టీం అందరూ పాల్గొన్నారు.
మీరంటే నాకు చాలా ఇష్టం, ఈషా.
నెట్‌ఫ్లిక్స్‌లో ‘రాముల’ చేసేటప్పుడు కూడా ఈషానే పెట్టుకుందాం అనుకున్నాం.