pizza

Chiranjeevi - Third eye of Telugu Industry - Venkaiah Naidu
Venkaiah Naidu garu was our student leader- Cheeranjeevi
కలిసి మురిసిన పద్మాలు!
వెంకయ్యనాయుడు మా ఉద్యమనేత: చిరంజీవి
తెలుగు పరిశ్రమకు త్రినేత్రుడు: వెంకయ్యనాయుడు

You are at idlebrain.com > news today >

26 January 2024
Hyderabad

This Republic Day marked a truly memorable and significant occasion for the entire Telugu community, as the BJP-led NDA government, under the leadership of Prime Minister Narendra Modi, bestowed the prestigious Padma Vibhushan award upon former Vice President Venkaiah Naidu and the iconic Mega Star Chiranjeevi. The recognition was a tribute to their outstanding achievements in their respective fields and their substantial contributions to society. It is very rare for a community to get two high civilian honours at same year.

In celebration of this momentous honor, Padma Vibhushan awardees Venkaiah Naidu and Chiranjeevi came together to extend their congratulations and share in the joy of this prestigious recognition bestowed by the Union Government. Venkaiah Naidu, expressing his sentiments, remarked, "I have consistently emphasized on various occasions that NT Rama Rao and Akkineni Nageswara Rao are the two pillars of the Telugu film industry, while Chiranjeevi represents the third eye—Trineterudu. Chiranjeevi garu is truly deserving of the Padma Vibhushan award, possessing all the qualifications for this esteemed recognition. The Government of India has rightfully honored him at the opportune moment, and it fills me with immense pride to witness Chiranjeevi's well-deserved acknowledgment."

Chiranjeevi, reflecting on his meeting with Venkaiah Naidu, said- “I had the privilege of meeting the honorable former Vice President Venkaiah Naidu to convey my respects. I hold him in high regard and reverence. During my student days, we actively participated in the Jai Andhra movement under the guidance of Venkaiah Naidu. I have known him since our student years, drawing inspiration from him on numerous occasions. His journey in politics, especially his ability to adapt and evolve according to the changing circumstances, is truly commendable. Today, the Telugu community has achieved remarkable heights, and I am overjoyed that the Government of India has rightfully honored him with the Padma Vibhushan award. Moreover, sharing this esteemed recognition with him amplifies my happiness even further."

Chiranjeevi graciously shared snapshots of his meeting with Venkaiah Naidu and expressed, "Had the pleasure of sharing delightful and truly special moments with Shri. @MVenkaiahNaidu garu! Our shared recognition of the prestigious honor, the #PadmaVibhushan, added an extra layer of joy and made our congratulatory meeting even more memorable."

వెంకయ్యనాయుడు మా ఉద్యమనేత: చిరంజీవి
తెలుగు పరిశ్రమకు త్రినేత్రుడు: వెంకయ్యనాయుడు

ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరు ప్రముఖులకు పద్మవిభూషణ్‌ లభించటం చాలా అరుదు. వారిద్దరు స్నేహితులు కావటం.. సమాజాభివృద్ధి కోసం పనిచేసినవారు కావటం ఇంకా అరుదుు. అలాంటి సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పద్మవిభూషణ్‌ పురస్కార గ్రహీతలు మాజీ ఉపాధ్యక్షులు వెంకయ్యనాయుడు, మెగాస్టార్‌ చిరంజీవిలు శుక్రవారం సాయంత్రం కలుసుకున్నారు. ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. జైఆంధ్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో నేను కాలేజీలో చదువుతున్నా. ఆ సమయంలో వెంకయ్యనాయుడు గారు విద్యార్థి ఉద్యమనేత. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మేము కాలేజీలు బహిష్కరించి ఉద్యమంలో పాల్గొన్నాం. నాకు ఆయన ఆ రోజు నుంచి తెలుసు’’ అని చిరంజీవి తన కాలేజీ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత తాను సినిమాలలోకి వచ్చానని.. ఆయన రాజకీయాల్లో ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగారయని మెగాస్టార్‌ పేర్కాన్నారు. కొద్దికాలం తర్వాత మేమిద్దరం పార్లమెంట్‌లో కొలిగ్స్‌గా ఉన్నాం. అనేక విషయాలు ఆయనను అడిగి తెలుసుకొనేవాడిని. సమాచార విషయంలో ఆయన నాకు స్ఫూర్తి అని వెల్లడించారు. వెంకయ్యనాయుడు గారు స్వయంకృషితో ఎదిగిన వ్యక్తి అని ఆయనను చూసి అందరూ నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు. వెంకయ్యనాయుడు గారి తో పాటుగా తనకు కూడా పద్మవిభూషణ్‌ రావటంతో తన ఆనందం ద్విగిణికృతమయిందన్నారు. ఇద్దరు తెలుగువాళ్లం.. స్నేహితులం. మాకు ఒకేసారి ఒకే అవార్డు రావటం థ్రిల్లింగ్‌ అనిపించింది. మేమిద్దరం కలుసుకొని జ్ఞాపకాలు నెమరువేసుకున్నాం’’ అన్నారు.

మూడో కన్ను..
తెలుగు సినీ రంగానికి ఎన్టీఆర్‌, ఏఎన్నాఆర్‌ రెండు కళ్లు అయితే– చిరంజీవి మూడో కన్ను అని వెంకయ్యనాయుడు గారు అభివర్ణించారు. ఈ అవార్డు రావటానికి అన్ని అర్ఞతలు మీకు ఉన్నాయి. మీరు కష్టపడి ఒకో అడుగు వేసుకుంటూ– ఎవరూ ఊహించని ఎత్తుకు ఎదిగారు’’ అని వెంకయ్యనాయుడు గారు మెగాస్టార్‌ను ప్రశంసించారు. సరైన సమయంలో ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు. సో ప్రౌడ్‌ ఆఫ్‌ యూ అని మెగాస్టార్‌ను ప్రశంసించి సత్కరించారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved