Malayalam star hero Tovino Thomas’s prestigious film “Pallichattambi” trailer has been released; set for a grand worldwide theatrical release on April 10th
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ ప్రెస్టీజియస్ మూవీ "పళ్లిచట్టంబి" ట్రైలర్ రిలీజ్, ఈ నెల 10న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న సినిమా
“Pallichattambi” is a big-budget film starring Malayalam star Tovino Thomas. The movie is being produced by Noufal, Brijeesh, and Chanukya, Chaitanya, Charan under the banners of Worldwide Films and C Cube Bros Entertainments. Directed by Dijo Jose Antony, the film features Kayadu Lohar as the female lead. The movie has already created huge expectations on a pan-India level. This prestigious project is set to release grandly in five languages, Hindi, Tamil, Telugu, Malayalam, and Kannada on April 10th
The trailer of “Pallichattambi” was released today. From what the trailer shows, a group of selfish people set their sights on the lands of the poor in Kunnumpuram. They use a corrupt police officer to suppress those who resist. The villagers wait for a savior who can protect them and their land. At that crucial moment, a heroic figure steps into Kunnumpuram, inspires the people, and turns the very soil of the village into a weapon to fight back against powerful attacks. The trailer builds curiosity about whether his courageous struggle alongside the villagers succeeds, and whether the land ultimately returns to its rightful owners.
The trailer also hints that this intense action entertainer includes a beautiful love story. Tovino Thomas’s performance, his action sequences, Kayadu Lohar’s makeover, and her screen presence stand out as major highlights. Director Dijo Jose Antony has presented the story, set in the 1950s and 60s, in a very natural and engaging manner.
Technical Team:
Costumes: Manjusha Radhakrishnan
Makeup: Rasheed Ahmed
Production Design: Dileep Nath
Editing: Sreejith Sarang
Cinematography: Tijo Tomy
Music: Jakes Bejoy
Script: S. Suresh Babu
Associate Producers: Meghashyam, Tanzeer
Producers: Noufal, Brijeesh, Chanukya Chaitanya Charan
Director: Dijo Jose Antony
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ ప్రెస్టీజియస్ మూవీ "పళ్లిచట్టంబి" ట్రైలర్ రిలీజ్, ఈ నెల 10న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న సినిమా
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. "పళ్లి చట్టంబి" సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ ప్రెస్టీజియస్ మూవీ ఈ నెల 10న హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
ఈ రోజు "పళ్లిచట్టంబి" సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే - కున్నుంపురంలో పేదల భూములపై కొందరు స్వార్థపరులు కన్నేస్తారు. ఎదురు తిరిగిన ప్రజలను హింసించేందుకు అవినీతిపరుడైన ఓ పోలీస్ ఆఫీసర్ ను ఉపయోగించుకుంటారు. ఈ భూమిని, తమను కాపాడే ఓ వ్యక్తి కోసం అక్కడి ప్రజలంతా వేచి చూస్తుంటారు. ఆ సమయంలో వీరుడు లాంటి వ్యక్తి కున్నుంపురంలో అడుగుపెడతాడు. అక్కడి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాడు. ఆ ఊరి మట్టినే ఆయుధంగా మలచి, పెను తుఫాన్ లాంటి దాడులను ఎదుర్కొంటాడు. ప్రజలతో కలిసి ఎంతో ధైర్య సాహసాలతో ఈ వ్యక్తి చేసిన పోరాటం ఫలించిందా ?, ఆ భూమి ఊరి ప్రజలకే దక్కిందా ? లేదా ? అనేది ట్రైలర్ ఆసక్తిని కలిగించింది. ఈ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా ఉన్నట్లు ట్రైలర్ తో తెలుస్తోంది. టొవినో థామస్ పర్ ఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్సులు చేసిన విధానం, కయదు లోహర్ మేకోవర్, స్క్రీన్ ప్రెజెన్స్ ట్రైలర్ కు హైలైట్స్ గా నిలుస్తున్నాయి. 50, 60 దశకాల నేపథ్య కథను దర్శకుడు డిజో జోస్ ఆంటోనీ ఎంతో సహజంగా తెరకెక్కించారు.