pizza

Naga Shaurya-Malvika Nair’s feel-good romance Phalana Abbayi Phalana Ammayi first look launched
ఆకట్టుకుంటున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' ఫస్ట్ లుక్

You are at idlebrain.com > news today >
Follow Us

2 January 2023
Hyderabad

People Media Factory and Dasari Productions are joining forces to produce Phalana Abbayi Phalana Ammayi, a feel-good romance, written and directed by Srinivas Avasarala. Naga Shaurya and Malvika Nair, the hit pair that created magic on-screen with their chemistry in Kalyana Vaibhogame, play the leads in the project. People Media Factory has backed two big commercial successes in 2022, namely Dhamaka and Karthikeya 2, with their filmography comprising several hits like Goodachari, Oh Baby as well.

The combo of actor Naga Shaurya and director Srinivas Avasarala has given us two memorable films in the past, Oohalu Gusagusalade and Jyo Achyutananda. Both the films are best examples that they bring the best out of each other. The films have aged so beautifully over the years, enjoying great reception in theatres, television and OTT alike. With Phalana Abbayi Phalana Abbayi, they look set to score another hit with their hattrick project.

An attractive first look of the film was launched today. Both the leads Naga Shaurya and Malvika Nair are seen listening to music while donning formal winterwear and leaning onto one another over a journey. The aesthetic costumes, the cute on-screen pairing and the floral borders in the poster indicate a sweeping romance made on a large canvas. The eye-catchy poster instantly piques your curiosity.

A humourous announcement video of the first look was launched yesterday where the lead actors get together on a call with Srinivas Avasarala, discussing the absence of any updates surrounding the film. When Shaurya even says, ‘Even RRR has released in theatres’, Srinivas Avasarala cheekily responds to him that RRR had three letters while Phalana Abbayi Phalana Ammayi has four (when read as PAPA) before confirming the launch date (January 2).

Phalana Abbayi Phalana Ammayi is a romance spanning a decade revolving around the highs and lows in the relationship of a couple. The film takes the viewers through their journey as they age from 18 year-olds to 28 year-olds. The romance element in the film is expected to be very realistic, mature and sensible and the director has claimed he would be presenting love in seven different hues, akin to a rainbow. Srinivas Avasarala’s conversational dialogues are a major USP of the film, the makers say.

Kalyani Malik, who scored the music for Naga Shaurya-Srinivas Avasarala’s earlier collaborations, is the composer for Phalana Abbayi Phalana Ammayi as well. The shoot of the film was wrapped up recently and more details surrounding the film’s release will be out shortly.

Movie Details:
Cast: Naga Shaurya, Malvika Nair, Srinivas Avasarala, Megha Chowdhury, Ashok Kumar, Abhishek Maharshi, Sri Vidya, Varanasi Soumya Chalamcharla, Harini Rao, Arjun Prasad
Producers – T G Vishwa Prasad and Padmaja Dasari
Director – Srinivas Avasarala
Co Producer – Vivek Kuchibhotla
Story – Screenplay – Dialogues – Srinivas Avasarala
Dop – Sunil Kumar Nama
Music – Kalyani Malik, Vivek Sagar(kafeefi song)
Editor – Kiran Ganti
Art Director – Azmat Ansari(UK), John Murphy(UK), Ramakrishna
Executive Producer – Sujith Kumar Kolli
Associate Producers – Sunil Shah, Raja Subramanian
Lyrics – Bhaskarabhatla, Lakshmi Bhupala, Kittu Vissapragada
Choreographers – Raghu, Yash, Riyaz, Chau, Gule
Co-Directors – Sri nivas D, H.Mansingh (H.Maheshhraj)
Make Up – Ashok Jatipati, Ayesha Rana
Costume Designer – Harsha Challapalli

ఆకట్టుకుంటున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' ఫస్ట్ లుక్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్నారు. 'కళ్యాణ వైభోగమే' చిత్రంతో వెండితెరపై మ్యాజిక్‌ చేసిన హిట్ పెయిర్ నాగశౌర్య, మాళవిక నాయర్ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. గూఢచారి, ఓ బేబీ వంటి అనేక విజయాలను కలిగి ఉన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 2022లో 'ధమాకా', 'కార్తికేయ 2' చిత్రాలతో మరో రెండు భారీ విజయాలను అందుకుంది.

నటుడు నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కలిసి గతంలో 'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' అనే రెండు గుర్తుండిపోయే చిత్రాలను అందించారు. ఈ రెండు చిత్రాలూ వారిలోని ఉత్తమ ప్రతిభను బయటకు తీసుకొచ్చాయి. థియేటర్లలో ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిత్రాలు.. టీవీ, ఓటీటీ లలో ఇప్పటికీ గొప్ప ఆదరణ పొందుతున్నాయి. ఇప్పుడు 'ఫలానా అబ్బాయి ఫలానా అబ్బాయి'తో నాగశౌర్య-శ్రీనివాస్ అవసరాల హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడానికి సిద్ధమవుతున్నారు.

ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను ఈరోజు విడుదల చేశారు. నాగ శౌర్య, మాళవిక నాయర్ ఇద్దరూ ఫార్మల్ వింటర్‌వేర్ ధరించి, ప్రయాణంలో ఒకరిపై ఒకరు వాలిపోయి సంగీతం వింటూ కనిపించారు. పోస్టర్ లో అందమైన వస్త్రధారణతో, అంతకంటే అందంగా ఉన్న ఆ జంటను చూస్తుంటే.. ఈ ఫీల్ గుడ్ ఫిల్మ్ ఎప్పుడెప్పుడా చూస్తామా అనే ఆసక్తి కలగక మానదు.

నిన్న విడుదల చేసిన ఫస్ట్ లుక్ అనౌన్స్‌మెంట్ వీడియోకి కూడా మంచి స్పందన లభించింది. ఆ వీడియోలో శ్రీనివాస్ అవసరాలతో కాల్ మాట్లాడిన హీరోహీరోయిన్లు సినిమా గురించి ఎటువంటి అప్‌డేట్‌లు లేకపోవడంపై చర్చించారు. "ఆర్ఆర్ఆర్ కూడా విడుదలైంది" అని శౌర్య అనగా.. "ఆర్ఆర్ఆర్ లో మూడే అక్షరాలు ఉన్నాయని, ఫలానా అబ్బాయి ఫలనా అమ్మాయి(PAPA)లో నాలుగు అక్షరాలు ఉన్నాయి" అంటూ శ్రీనివాస్ అవసరాల సరదాగా బదులిచ్చారు. ఆ తర్వాత ఫస్ట్ లుక్ జనవరి 2న రాబోతుందని తెలిపారు.

'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' అనేది ఒక దశాబ్దం పాటు ఓ జంట మధ్య సాగే ప్రేమ ప్రయాణం. హెచ్చు తగ్గులతో కూడిన ఆ ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ చిత్రం 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వయస్సు వరకు సాగే వారి ప్రయాణంలోకి ప్రేక్షకులను తీసుకువెళుతుంది. ఇందులో ప్రేమ సన్నివేశాలు చాలా సహజంగా హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. ఈ చిత్రంలో ప్రేమను ఇంద్రధనస్సు లాగా ఏడు విభిన్న రంగులలో ప్రదర్శించబోతున్నట్లు దర్శకుడు శ్రీనివాస్ అవసరాల తెలిపారు. శ్రీనివాస్ అవసరాల సంభాషణలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు.

గతంలో నాగశౌర్య-శ్రీనివాస్ అవసరాల కలయికలో వచ్చిన రెండు చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించిన కళ్యాణి మాలిక్, 'ఫలానా అబ్బాయి ఫలనా అమ్మాయి'కి సంగీతం అందిస్తుండటం విశేషం. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. విడుదల తేదీతో పాటు సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

ఇతర వివరాలు:
నటీనటులు - నాగ శౌర్య, మాళవిక నాయర్, శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య, వారణాసి సౌమ్య చలంచర్ల, హరిణి రావు, అర్జున్ ప్రసాద్
నిర్మాతలు - టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి
దర్శకుడు - శ్రీనివాస్ అవసరాల
సహా నిర్మాత - వివేక్ కూచిభొట్ల
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ - శ్రీనివాస్ అవసరాల
డీవోపీ - సునీల్ కుమార్ నామ
సంగీతం - కళ్యాణి మాలిక్, వివేక్ సాగర్(కాఫీఫై సాంగ్)
ఎడిటర్ - కిరణ్ గంటి
ఆర్ట్ డైరెక్టర్ - అజ్మత్ అన్సారీ(UK), జాన్ మర్ఫీ(UK), రామకృష్ణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - సుజిత్ కుమార్ కొల్లి
అసోసియేట్ ప్రొడ్యూసర్స్ - సునీల్ షా, రాజా సుబ్రమణియన్
లిరిక్స్ - భాస్కరభట్ల, లక్ష్మి భూపాల, కిట్టు విస్సాప్రగడ
కొరియోగ్రాఫర్స్ – రఘు, యశ్, రియాజ్, చౌ, గులే
కో-డైరెక్టర్స్ - శ్రీనివాస్ డి, హెచ్.మాన్సింగ్ (హెచ్.మహేష్ రాజ్)
మేకప్ - అశోక్, అయేషా రానా
కాస్ట్యూమ్ డిజైనర్ - హర్ష చల్లపల్లి

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved