pizza

Ram Pothineni, P Mahesh Babu, Mythri Movie Makers' RAPO22 Launched With Pooja Ceremony
పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన రామ్ పోతినేని - మహేష్ బాబు పి - మైత్రీ మూవీ మేకర్స్ సినిమా

You are at idlebrain.com > news today >

19 November 2024
Hyderabad

Ustaad Ram Pothineni had already announced RAPO22 on the auspicious occasion of Dasara and now we have another interesting development pertaining to the project. This film is formally launched with a pooja ceremony today in the presence of several guests.

The launch ceremony was graced by directors Hanu Raghavapudi, Venky Kudumula and Gopichand Malineni. The principle lead of the film, Ram Pothineni and Bhagyashri Borse also partook in the launch event.

It was Hanu Raghavapudi who sounded the first clap, followed by Gopichand switching on the camera, and lastly, Venky Kudumula directing the first shot featuring Ram and Bhagyashri. The event was a starry affair and it had a super pleasant vibe.

Along with the mentioned guest, Mythri Movie Makers CEO Cherry, and Director Shiva Nirvana partook in the event.

The script was handed over to director Mahesh Babu P by Naveen Yerneni, Y Ravi Shankar, Mythri CEO Cherry, directors Hanu Raghavapudi, Gopichand Malineni, Venky Kudumula, Shiva Nirvana and Pavan Sadineni.

Director Mahesh Babu has brought together the aesthetic looking pair of Ram and Bhagyashri for the film as he promises another fun and sensible film after Miss Shetty Mr Polishetty. He is evidently cooking up something super interesting with Ram this around, much to the delight of fans.

The highly promising film is directed by Mahesh Babu P and produced by Mythri Movie Makers. Naveen Yerneni and Y Ravi Shankar are producing the film on a lavish scale. More details about the cast and crew will be out soon.

Cast: Ram Pothineni, Bhagyashri Borse
Director: Mahesh Babu P
Producers: Naveen Yerneni, Y Ravi Shankar
Banner: Mythri Movie Makers

పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన రామ్ పోతినేని - మహేష్ బాబు పి - మైత్రీ మూవీ మేకర్స్ సినిమా

ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ రోజు ఉదయం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. హీరోగా రామ్ 22వ చిత్రమిది. #RAPO22లో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు.

హీరో రామ్ పోతినేని, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు గోపీచంద్ మలినేని కెమెరా స్విచ్ఛాన్ చేయగా, దర్శకుడు హను రాఘవపూడి క్లాప్ ఇచ్చారు. తొలి సన్నివేశానికి దర్శకుడు వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించారు. చిత్ర దర్శకుడు మహేష్ బాబుకు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలితో పాటు ఆ సంస్థ సీఈవో చెర్రీ, దర్శకులు గోపీచంద్ మలినేని, హను రాఘవపూడి, వెంకీ కుడుముల, శివ నిర్వాణ, పవన్ సాధినేని స్క్రిప్ట్ అందజేశారు.

ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్‌టైనర్‌గా #RAPO22 రూపొందుతోంది. ఈ సినిమా కోసం రామ్ స్పెషల్‌గా మేకోవర్ అవుతున్నారు. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' విజయం తర్వాత దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కిస్తున్న చిత్రమిది. యువతను ఆకట్టుకునే అంశాలతో పాటు చక్కటి కథ, కథనంతో సినిమా రూపొందుతోందని దర్శక నిర్మాతలు తెలిపారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని వివరించారు.

ఈ ప్రారంభోత్సవ వేడుకలో దర్శకులు గోపీచంద్ మలినేని, హను రాఘవపూడి, వెంకీ కుడుముల, శివ నిర్వాణ, పవన్ సాధినేనితో పాటు చిత్ర బృందం పాల్గొంది.

రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించనున్న ఈ సినిమాకు నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, కథ, కథనం, దర్శకత్వం: మహేష్ బాబు పి.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved