Let The Music Take You On A Journey Within, Yegareyi Nee Rekkale From Anupama Parameswaran, Darshana Rajendran, Sangitha, Praveen Kandregula, Vijay Donkada, Ananda Media’s Paradha Is Out Now
అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత, ప్రవీణ్ కాండ్రేగుల, విజయ్ డొంకడ, ఆనంద మీడియా 'పరదా' నుంచి బ్యూటీఫుల్ జర్నీ సాంగ్ ఎగరేయ్ నీ రెక్కలే రిలీజ్
Director Praveen Kandregula of Cinema Bandi fame crafted a unique female centric rural drama Paradha, backed by Raj and DK, known for The Family Man series. Vijay Donkada bankroll the movie, alongside Sreenivasulu PV and Sridhar Makkuva on Ananda Media banner. Anupama Parameswaran plays the lead, alongside Darshana Rajendran, and Sangitha in other key roles. Rag Mayur also essays a pivotal role in the movie.
Today, the makers came up with the third song- Yegareyi Nee Rekkale. Composed by Gopi Sundar, this track perfectly complements the situation, with its beautiful composition. The song, penned by Vanamali, captures the protagonist’s feeling of liberation as she sheds the chains of tradition. After leaving the restrictive confines of her village, Anupama’s character embarks on a carefree road journey with friends played by Darshana Rajendran and Sangitha. Together, they experience the joy of freedom and friendship, which the song perfectly encapsulates.
Ritesh G Rao’s soulful voice brings the lyrics to life, imbuing the track with a raw emotional depth that mirrors the character's inner transformation. Yegareyi is a celebration of breaking free, of embracing life and joy after a long period of confinement.
Paradha promises to be a hard-hitting yet uplifting tale, with its roots deep in tradition and its message firmly grounded in empowerment. The first song, glimpse, and other promotional material sparked enthusiasm for the movie. The film has cinematography by Mridul Sujit Sen, while Dharmendra Kakarala is the editor.
The movie Paradha will be hitting the screens on August 22nd.
అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత, ప్రవీణ్ కాండ్రేగుల, విజయ్ డొంకడ, ఆనంద మీడియా 'పరదా' నుంచి బ్యూటీఫుల్ జర్నీ సాంగ్ ఎగరేయ్ నీ రెక్కలే రిలీజ్
సినిమా బండి ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల 'పరదా' అనే మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ తో వస్తున్నారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, దర్శన రాజేంద్రన్‌తో పాటు, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే రీలిజైన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు మేకర్స్ థర్డ్ సింగిల్ ఎగరేయ్ నీ రెక్కలే పాటని రిలీజ్ చేశారు.
ఎగరేయ్ నీ రెక్కలే బ్యూటీఫుల్ జర్నీ సాంగ్. స్టార్ కంపోజర్ గోపీ సుందర్ మనసు హత్తుకునేలా అద్భుతంగా కంపోజ్ చేశారు. వనమాలి రాసిన లిరిక్స్ మీనింగ్ ఫుల్ గా వున్నాయి. రితేష్ జి రావు తన వోకల్స్ తో మెస్మరైజ్ చేశారు.
అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత జర్నీ ఎమోషనల్ అండ్ హార్ట్ టచ్చింగ్ గా వుంది. అద్భుతమైన లోకేషన్స్ తో చిత్రీకరించిన ఈ సాంగ్ విజువల్ గా చాలా గ్రాండ్ గా వుంది. ఈ సాంగ్ ఇన్స్టంట్ గా హిట్ అయ్యింది.
ఈ చిత్రంలో రాగ్ మయూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ సినిమాకి మృదుల్ సుజిత్ సేన్ సినిమాటోగ్రాఫర్‌గా, ధర్మేంద్ర కాకరాల ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
'పరదా' ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తారాగణం: అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: ఆనంద మీడియా
దర్శకత్వం: ప్రవీణ్ కాండ్రేగుల
నిర్మాతలు: విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రోహిత్ కొప్పు
సంగీతం: గోపీ సుందర్
సాహిత్యం: వనమాలి
రచయితలు: పూజిత శ్రీకాంతి, ప్రహాస్ బొప్పూడి
స్క్రిప్ట్ డాక్టర్: కృష్ణ ప్రత్యూష
డీవోపీ: మృదుల్ సుజిత్ సేన్
ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల
సౌండ్ డిజైన్: వరుణ్ వేణుగోపాల్
ఆర్ట్ డైరెక్టర్: శ్రీనివాస్ కళింగ
కాస్ట్యూమ్ డిజైనర్: పూజిత తాడికొండ