pizza

Patang success meet
పతంగ్‌ సినిమా బ్యూటిఫుల్‌గా ఉంది. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా: కల్ట్‌ ప్రొడ్యూసర్‌ ఎస్‌కేఎన్‌

You are at idlebrain.com > news today >

28 December 2025
Hyderabad

ప్రముఖ నిర్మాత డి.సురేష్‌ బాబు సమర్పణలో రూపొందిన చిత్రం 'పతంగ్‌' ఈ చిత్రం సినిమాటిక్ ఎలిమెంట్స్ , రిష‌న్ సినిమాస్, మాన్‌సూన్‌ టేల్స్‌ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. ఈ స్పోర్ట్స్‌ డ్రామా ఈ చిత్రానికి విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్ మకా , సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మాతలు. ప్రణీత్‌ పత్తిపాటి దర్శకుడు. పాపులర్‌ దర్శకుడు నటుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌, ప్ర‌ముఖ సింగ‌ర్, న‌టుడు ఎస్‌పీ చ‌ర‌ణ్ ఈ చిత్రంలో కీల‌క‌మైన పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. క్రిస్‌మస్‌ కానుకగా విడుదలైన ఈ చిత్రం యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకుంది. కాగా ఈ చిత్రం సక్సెస్‌ మీట్‌ శనివారం హైదరాబాద్‌లో జరిగాయి. ఈ టీమ్‌ను అభినందించడానికి కల్ట్‌ ప్రొడ్యూసర్‌ ఎస్‌కేఎన్‌, హీరో సందీప్‌కిషన్‌లు ఈ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు.

ఎస్‌కేఎన్‌ మాట్లాడుతూ '' సినిమా చూశాను. చూడగానే ఈ మధ్య కాలంలో వన్‌ఆఫ్‌ ద బ్యూటిఫుల్‌ ఫిలిం. బ్యూటిఫుల్‌ ఎమోషన్స్‌. సినిమా చాలా జెన్యూన్‌గా అనిపించింది. ఈ సినిమాను నిర్మాతలు డబ్బుతో కాకుండా ఎంతో ప్రేమతో మనసుపెట్టి తీశారని అనిపించింది. ఈ సినిమాలో అందరి పాషన్‌ అనిపించింది. అందుకే నేను ఎంతో బిజీగా ఉన్న ఈ టీమ్‌ను ఎంకరైజ్‌ చేద్దామని ఇక్కడికి వచ్చాను. ఈ మంచి సినిమాను మీడియా మరింత ప్రమోట్‌ చేయాలని కోరుతున్నాను. మీడియా ఈ సినిమాకు సపోర్ట్‌ అవసరం. నిజాయితీగా ఓ మంచి సినిమా తీసిన పతంగ్‌ టీమ్‌ను ఎంకరైజ్‌ చేయండి. ఈ సినిమాలో లవ్‌బుల్‌ ఎమోషన్స్‌ ఉన్నాయి. కైట్స్‌ పోటీ చూస్తే నాకు సంక్రాంతి గుర్తొచ్చింది. కైట్‌ కాంపిటీషన్‌ సీన్స్‌ చాలా బాగున్నాయి. ఈ సినిమా చూసే ఆడియన్స్‌కు మీ టైమ్‌ వేస్ట్‌ అవ్వదు. మిమ్ములను ఈ సినిమా తప్పకుండా ఎంటర్‌టైన్‌ చేస్తుంది. త్వరలోనే ఓ మల్టీప్లెక్స్‌లో నేను ఓ స్క్రీన్‌ను తీసుకుని నా ఫ్రెండ్స్‌కు, నా సోషల్ మీడియా ఫాలోవర్స్‌కు ఈ సినిమా ఉచితంగా చూపించబోతున్నాను. ఎందుకంటే ఓ మంచి సినిమాను ప్రోత్సాహించడమే నా ఉద్దేశం. ఓ టాలెంట్‌ టీమ్‌ ప్రతిభ ఎవరూ గుర్తించకుండా వృథా పోకూడదు అనేది నా ఫీలింగ్‌. పతంగ్‌ ఈజ్‌ మోస్ట్‌ లవబుల్‌ ఎంటర్‌టైనర్‌. అందరూ ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్నాను అన్నారు.

సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ ''పతంగ్‌ సినిమాను నేను గమనిస్తున్నాను.ప్రతి ప్రమోషనల్‌ కంటెంట్‌ బాగుంది. ఇలాంటి కొత్త సినిమాకు ఏమైనా చేయాలని అనిపించింది. బాగున్నా సినిమాలకు నేనే వాలంటీర్‌గా ఫోన్‌చేసి వాళ్ల ప్రమోషనల్‌ ఈవెంట్స్‌కు వెళుతుంటాను. ట్రైలర్‌ నాకు చాలా బాగా నచ్చింది. నిజాయితీతో చేసిన ఈ ప్రయత్నాన్ని ఈ రోజు అందరూ అభినందిస్తున్నారు. త్వరలోన ఈ సినిమామంచి మౌత్‌టాక్‌ థియేటర్లు పెరుగుతాయని అనుకున్నాను.ఈ కిస్మస్‌ సినిమాల్లో పతంగ్‌ పాయసంలా తియ్యగా ఉంది. నేను ఈ సినిమాకు 500 టిక్కెట్లు ఇవ్వబోతున్నాను. ఈ సినిమాను అందరూ థియేటర్స్‌లో చూడండి అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ'' మంచి సినిమాను అందరూ సపోర్ట్‌ చేయాలని కోరుకుంటున్నాను. కంటెంట్‌ చూసి చాలా మంది ప్రముఖులుసపోర్ట్‌ చేస్తున్నారు' అన్నారు.
అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌ రమ్య మాట్లాడుతూ '' ఈ సినిమాకు చాలా మంచి రివ్యూస్‌ ఇచ్చారు. ఈసినిమా పతాక సన్నివేశాలు అందరి హృదయాలకు హత్తుకుంటున్నాయి. ఓ బ్యూటిఫుల్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ సినిమాను ఆదరించాలి కోరుకున్నాను అన్నారు. ఈ సినిమాను జనవరి 1న ఓవర్‌సీస్‌లో విడుదల చేస్తున్నాం' అన్నారు.

దర్శకుడు ప్రణీత్‌ మాట్లాడుతూ '' సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌ బాగుంది. థియేటర్స్‌ దొరకలేదు. కానీ మీకు దగ్గర్లో ఉన్న థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తే మీరు డిజప్పాయింట్‌ అవ్వరు అన్నారు.
ప్రణవ్‌ మాట్లాడుతూ ' మా ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉంది. చిన్న సినిమాను ఇంకా ఆదరించాల్సిన బాధ్యత ప్రేక్షకులపై ఉంది అన్నారు. ఇండియా మొత్తంలో ఇప్పటి వరకు పతంగుల కాంపీటిషన్‌లో సినిమా రాలేదు. ఎంతో క్వాలిటీగా తీసిన సినిమా ఇది. సినిమాపై పాషన్‌ ఉన్న బ్యాచ్‌ మాది. చాలా కష్టపడి ఈ సినిమా చేశాం. అందరికి థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే సినిమా ఇది. ఈ సినిమా చాలా బాగుందని చెప్పారు' అన్నారు.
ఈ సమావేశంలో రమ్య , సంపత్‌, విజయ్‌శేఖర్‌, నాని బండ్రెడ్డి, ప్రణవ్‌ కౌశిక్‌,సురేష్‌, వంశీ పూజిత్‌, ప్రీతి పగడాల, ప్రణీత్‌ పత్తిపాటి పాల్గొన్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved