Mega Power Star Ram Charan and Team Peddi Light Up A.R. Rahman’s Concert - “Chikiri” Song Tops Charts in 13 Countries Worldwide!
ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ లో సందడి చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, 'పెద్ది' టీం- ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల్లో టాప్ ట్రెండింగ్ లో చికిరి సాంగ్
Mega Power Star Ram Charan made a sparkling appearance at the grand A.R. Rahman Live Concert held in Ramoji Film City. The event, graced by Ram Charan, Janhvi Kapoor, and Buchi Babu Sana, turned into a celebration as the trio’s presence electrified the audience. The live performance of “Chikiri Chikiri” from Peddi received a thunderous response from the crowd, and videos from the event have since gone viral across social media.
Speaking at the event, Ram Charan said, “It has always been my childhood dream to be part of A.R. Rahman sir’s music. I’m truly happy that it’s being fulfilled with my film Peddi.”
Janhvi Kapoor added, “I feel blessed to be part of Peddi. I’m confident our first single will be loved by everyone. We’re working really hard to offer audiences a different and unique experience with this film.”
The song “Chikiri Chikiri” has taken the world by storm — trending #1 across 13 countries globally. Since its release, it has shattered records on all digital platforms. Composed by A.R. Rahman, the track stands out as an audio-visual feast, blending emotion with mass appeal.
With Balaji’s captivating lyrics and Mohit Chauhan’s magical vocals, the song has instantly connected with audiences across India. Ram Charan’s powerful screen presence has turned Chikiri into a viral storm. The mix of rural beats, energetic music, stunning visuals, and mass appeal makes “Chikiri Chikiri” an absolute winner.
Within just 24 hours, the song became a YouTube sensation, topping charts across India. It garnered over 53 million views in four languages combined — including a record-breaking 32 million views in just 13 hours, setting a new South Indian record, along with nearly a million likes from fans.
From Instagram reels, dance challenges, to fan edits, the “Chikiri Chikiri” fever is everywhere! The combination of Ram Charan’s mass magnetism and A.R. Rahman’s musical magic has transcended language and regional boundaries, turning it into a true musical phenomenon.
Director Buchi Babu Sana has showcased his remarkable sense of music and visuals in every frame. Produced on a grand scale by Venkat Satish Kilaru under the Vruddhi Cinema banner, Peddi is set for a worldwide theatrical release on March 27, 2026.
ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ లో సందడి చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, 'పెద్ది' టీం- ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల్లో టాప్ ట్రెండింగ్ లో చికిరి సాంగ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ లో సందడి చేశారు. రెహమాన్ కాన్సర్ట్ రామోజీ ఫిల్మ్ సిటీలో అట్టహాసంగా జరిగింది. అతిథులుగా హాజరైన రామ్‌చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబు సానా ఆడియన్స్ లో మరింత జోష్ నింపారు. ‘పెద్ది’ సినిమాలోని చికిరి చికిరి లైవ్ పెర్ఫామెన్స్ ని ఆడియన్స్ నుంచి అద్భుతమై రెస్పాన్స్ వచ్చింది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. రెహమాన్ గారి సంగీతంలో భాగమవ్వాలనేది నా చైల్డ్‌హుడ్ డ్రీం. అది నా ప్రాజెక్ట్ ‘పెద్ది’ తో నెరవేరినందుకు చాలా ఆనందంగా వుంది.
జాన్వి కపూర్ మాట్లాడుతూ.. పెద్ది సినిమాలో భాగమయ్యే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. మా ఫస్ట్ సింగిల్ మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ సినిమాతో మీకు ఒక డిఫరెంట్, యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం.
చికిరి పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మొత్తం 13 దేశాల్లో టాప్ ట్రెండింగ్ లో వుంది
పాట విడుదలైనప్పటి నుండి అన్ని ప్లాట్‌ఫామ్‌లలో కొత్త రికార్డ్స్ నెలకొల్పుతోంది. రెహమాన్ స్వరపరిచిన చికిరి చికిరి ఎమోషన్స్, మాస్ అప్పీల్ తో చేసే ఆడియో-విజువల్ ఫీస్ట్ గా నిలిచింది. బాలాజీ అద్భుతమైన సాహిత్యం, మోహిత్ చౌహాన్ మ్యాజికల్ వోకల్స్ తో సాంగ్ దేశంలోని ప్రతి మూల నుండి ప్రేక్షకులకు ఇన్స్టంట్ గా కనెక్ట్ అయ్యింది. రామ్ చరణ్ పవర్ ఫుల్ స్క్రీన్ ప్రజెన్స్ తో చికిరి వైరల్ తుఫాను గా మారింది. రూరల్ బీట్స్, ఎనర్జిటిక్ మ్యూజిక్, అద్భుతమైన విజువల్స్, రామ్ చరణ్ మాస్ ఇమేజ్ తో “చికిరి చికిరి” పాట అదిరిపోయింది.
మొదటి 24 గంటల్లోనే “చికిరి చికిరి” యూట్యూబ్‌లో సెన్సేషన్‌గా మారింది. దేశవ్యాప్తంగా టాప్ చార్ట్స్‌లో నెంబర్ 1 స్థానం దక్కించుకుంది. నాలుగు భాషల్లో కలిపి 53 మిలియన్ ప్లస్ వ్యూస్ సాధించింది. అంతకుముందు 13 గంటల్లోనే 32 మిలియన్ వ్యూస్ సాధించి సౌత్ ఇండియా రికార్డు క్రియేట్ చేసింది. దాదాపు మిలియన్ లైక్స్‌తో అభిమానుల ప్రేమని అందుకుంది.
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, డాన్స్ చాలెంజ్‌లు, ఫ్యాన్ ఎడిట్స్.. ఎక్కడ చూసినా “చికిరి చికిరి” మ్యూజిక్ ఫీవర్‌నే కనిపిస్తోంది. రామ్ చరణ్ మాస్ మాగ్నటిజం, ఏఆర్.రహ్మాన్ మ్యూజిక్ మ్యాజిక్ కలసి భాషా, ప్రాంతీయ హద్దులు దాటి ఓ మ్యూజికల్ ఫెనామెనాన్‌గా మారాయి.
డైరెక్టర్ బుచ్చి బాబు సాన తన మ్యూజిక్ సెన్సిబిలిటీస్, విజువల్ సెన్స్‌ను ప్రతి ఫ్రేమ్‌లో అద్భుతంగా చూపించారు. వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమా బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పెద్ది 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.