Peddi Box Office Champion Press Meet
పెద్ది రామ్ చరణ్ గారి కెరీర్ బెస్ట్. అద్భుతమైన స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు: ‘పెద్ది’ బాక్సాఫీస్ ఛాంపియన్ ప్రెస్ మీట్‌లో నిర్మాత వెంకట సతీష్ కిలారు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో సంచలన విజయాన్ని సాధించింది. అన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘బాక్సాఫీస్ ఛాంపియన్’ సక్సెస్ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది.
పెద్ది బాక్సాఫీస్ ఛాంపియన్ ప్రెస్ మీట్ లో నిర్మాత వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ‘పెద్ది’ చిత్రం అద్భుతంగా దూసుకుపోతోంది. తొలి రోజే ₹135 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రేక్షకుల నుంచి, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందన చాలా అద్భుతంగా ఉంది. సినిమా చూసిన వారందరూ ఇది చాలా మంచి సినిమా అని అభినందిస్తున్నారు. ఇది నిజంగా బ్రహ్మాండమైన సినిమా. అందరూ తమ పిల్లలను తీసుకుని థియేటర్లలో సినిమా చూడండి. ఇది రామ్ చరణ్ గారి కెరీర్‌లో బెస్ట్ సినిమా. ఆ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. టికెట్ రేట్ల విషయంలో మాకు సహకరించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు ప్రత్యేక ధన్యవాదాలు. భారీ స్థాయిలో, అత్యంత గ్రాండ్‌గా ఈ సినిమాను నిర్మించాం. ఆ కృషికి ప్రభుత్వాలు ఎంతో సానుకూలంగా స్పందించాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి కందుల దుర్గేష్ గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి మరోసారి కృతజ్ఞతలు. చాలా కీలక సమయంలో వారు మాకు అండగా నిలిచారు. ఈ సినిమాను ప్రేక్షకులు చాలా దూరం తీసుకెళ్లారు. అందరూ సినిమాను నమ్మి అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టారు. మీడియా కి ధన్యవాదాలు. ఒక మంచి సినిమాకు మీరందరూ అండగా నిలిచారు. సినిమా గురించి అందరూ చాలా బాగా రాశారు. ఒక్క నెగెటివ్ లేకుండా పాజిటివ్‌గా ఆదరించారు. రామ్ చరణ్ గారికి, బుచ్చిబాబు గారికి మరోసారి ధన్యవాదాలు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నేను చేసిన తొలి సినిమాకే ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్ ఇచ్చినందుకు వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. అందరికీ థాంక్యూ సో మచ్.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ఇన్నాళ్లు మనం ఎదురుచూసిన ‘పెద్ది’ వచ్చేసింది. మనం ఊహించినట్లుగానే ఇది ఒక సైక్లోన్ క్రియేట్ చేసింది. ప్రీమియర్స్ నుంచే అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రీమియర్స్, ఫస్ట్ డే కలిపి రామ్ చరణ్ గారి కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించింది. ప్రతి సెంటర్ నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అద్భుతమైన అదే ఊపు కనిపిస్తోంది. శనివారం, ఆదివారం కలెక్షన్లు మరింత భారీగా ఉంటాయని భావిస్తున్నాం. మేము సినిమాపై ఎంత నమ్మకం పెట్టుకున్నామో, అదే స్థాయిలో ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. సినిమాను ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఇది ఖచ్చితంగా థియేటర్లలో చూసి ఆస్వాదించాల్సిన సినిమా. వచ్చే వారం మేమే షాక్ అయ్యే నెంబర్లతో మీ ముందుకు వస్తాం. బుచ్చిబాబు రాసిన కథకు మా హీరో రామ్ చరణ్ గారు ఎక్స్‌ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆయన నటన గురించే మాట్లాడుకుంటున్నారు. చరణ్ గారి పెర్ఫార్మెన్స్ ‘నా భూతో న భవిష్యత్’. మిగతా ఆర్టిస్టులందరూ కూడా అద్భుతంగా నటించారు. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు చూడని విధంగా మల్టిపుల్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన సినిమా ఇది. ఇందులో గొప్ప ఇన్‌స్పిరేషన్ కూడా ఉంది. ముఖ్యంగా పిల్లలకు ఈ సినిమా ఎంతో ఉపయోగపడుతుంది. అందరూ కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని కోరుకుంటున్నాం. ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లతో చాలా ఆనందంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో మరింత గొప్ప విజయాన్ని అందుకుంటుందని నమ్ముతున్నాం.
డైరెక్టర్ బుచ్చిబాబు సానా మాట్లాడుతూ: ప్రేక్షకులందరికీ నమస్కారం. సినిమా విడుదలైనప్పటి నుంచి నా ఫోన్ రింగ్ అవడం ఆగలేదు. ‘ఉప్పెన’ సమయంలో కూడా ఇదే జరిగింది. అయితే ‘ఉప్పెన’ కంటే పది రెట్లు ఎక్కువ రెస్పాన్స్ ఇప్పుడు వస్తోంది. అందరూ ఫోన్ చేసి సినిమా పెద్ద హిట్ అయ్యిందని చెబుతున్నారు. సినిమా చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యామని అంటున్నారు. అందరికీ థాంక్యూ సో మచ్. ‘పెద్ది’ ఒక ఇన్‌స్పిరేషనల్ క్యారెక్టర్. చరణ్ సార్ పెర్ఫార్మెన్స్ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకోవడం చాలా ఆనందంగా ఉంది. కుటుంబాలు కలిసి సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. నేను నమ్మిన విషయాన్ని ప్రేక్షకులు నిజం చేశారు. చరణ్ గారు పడిన కష్టాన్ని అందరూ గుర్తించారు. చరణ్ గారు లేకపోతే ఈ సినిమా లేదు. ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఈ సినిమా మరింత అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాను.
మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీడియా ఈ సినిమాకు అద్భుతమైన రివ్యూలు ఇచ్చింది. ప్రతి రివ్యూ రైటర్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ అందరి వల్లే ఈ సినిమా జనాల్లోకి అద్భుతంగా వెళ్లగలిగింది. రామ్ చరణ్ గారు అహర్నిశలు కష్టపడి ఈ పాత్రను అద్భుతంగా పోషించారు. ఆయన కెరీర్‌లోనే ఫస్ట్ డే హయ్యెస్ట్ రికార్డ్ ఇది. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద రికార్డులు సృష్టిస్తుందని నమ్ముతున్నాను. ప్రీమియర్స్ నుంచే కుటుంబ ప్రేక్షకులు సినిమాకు రావడం ప్రారంభించారు. ఇది కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా. ఈ చిత్రానికి ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షక మహాశయులకు హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దిన బుచ్చిబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. రవి గారు మొదటి నుంచి ఇది బ్లాక్‌బస్టర్ అవుతుందని చెబుతూనే ఉన్నారు. ఆయన మాట నిజమైంది. నవీన్ గారు, రవి గారు నమ్మినది ఎప్పుడూ తప్పదు. రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డులు నెలకొల్పుతుందని నమ్ముతున్నాను. ఈ సందర్భంగా అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.