Ram Charan, Buchi Babu, Vriddhi Cinemas' Peddi goes Pan-India for promotions; Massive Trailer Launch in Mumbai and Mega Song Live Performance by ARR In Bhopal
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు, వృద్ధి సినిమాస్ ‘పెద్ది’ గ్రాండ్ పాన్ ఇండియా ప్రమోషన్స్- ముంబైలో మ్యాసీవ్ ట్రైలర్ లాంచ్, భోపాల్‌లో ఏఆర్ రెహమాన్ లైవ్‌లో మెగా సాంగ్ పెర్ఫార్మెన్స్
Mega Powerstar Ram Charan is setting the stage for a massive box office storm as his highly anticipated rustic sports drama, Peddi, kicks off its pan-India promotional campaign. Showcasing his immense crowd-pulling stamina and a never-before-seen raw Akhara look, Ram Charan is ready to deliver an absolute cinematic masterpiece.
Director Buchi Babu Sana has crafted a masterpiece with producer Venkata Satish Kilaru under Vriddhi Cinemas, making it a never-seen-before cinematic spectacle for Indian Cinema. Now, elevating the Pan-India promotional campaign, the makers have planned two massive events in Mumbai and Bhopal cities.
The highly awaited theatrical trailer will be launched in a spectacular event in Mumbai on May 18th, introducing the film's intense canvas to the national media and audiences worldwide. Following this Mumbai blitzkrieg, the team will honor the film's earthy roots by traveling to the heart of India, Bhopal, for a monumental Special Song Launch on May 23rd.
The event will further be special with Oscar winning composer AR Rahman performing live the songs of Peddi. He will unleash the Sound of Peddi as well. The earthly roots of the story will be celebrated in classical manner by the maestro and many stalwart singers performing on stage live.
These massive promotions are set to significantly amplify the anticipation surrounding the film. Chikiri Chikiri, Raa Rei Raa Rei songs have already created global storm. Adding to the excitement, Ram Charan's glimpses from the film have created such an adrenaline rush that audiences are eager to watch the film on big screens.
As an example of the storm Peddi is set to create, the movie has already clocked US$225K in pre-sales in North America just with premieres. Janhvi Kapoor is playing leading lady in the film with seasoned actors like Shiva Rajkumar, Jagapathi Babu, and Divyenndu Sharma in prominent roles.
Produced by Venkata Satish Kilaru, the movie is proudly presented by Mythri Movie Makers and Sukumar Writings. The visual poetry on cinema is being handled by cinematography R. Rathnavelu, and Avinash Kolla is handling Production Design. The makers are confident that the breathtaking, world-class production values will leave audiences spellbound across the globe.
National Award winning editor Navin Nooli is handling the edit of this spectacular movie and already makers locked full edit. With post production works going on at a rapid pace, the spectacular sports drama is gearing up for release on 4th June 2026, with premieres on 3rd June.
Crew:
Written & Directed by Buchi Babu Sana
Production Design by Avinash Kolla
Music by AR Rahman
Editing by Navin Nooli
Cinematography by R Rathnavelu
Produced by Venkata Satish Kilaru
Production company: Vriddhi Cinemas
Presented by Mythri Movie Makers, Sukumar Writings
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు, వృద్ధి సినిమాస్ ‘పెద్ది’ గ్రాండ్ పాన్ ఇండియా ప్రమోషన్స్- ముంబైలో మ్యాసీవ్ ట్రైలర్ లాంచ్, భోపాల్‌లో ఏఆర్ రెహమాన్ లైవ్‌లో మెగా సాంగ్ పెర్ఫార్మెన్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మచ్ అవైటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’తో బాక్సాఫీస్ తుఫాన్ సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్సెస్‌లో చరణ్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. ఇప్పుడు ఈ చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో మ్యాసీవ్ ప్రమోషన్స్ ప్రారంభమవుతున్నాయి.
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో నిర్మాత వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ‘పెద్ది’ని భారతీయ సినిమాకు కొత్త అనుభూతిని ఇచ్చే విజువల్ స్పెక్టకిల్‌గా రూపొందించారు. ఇప్పుడు ఆ ఎక్సయిట్మెంట్ మరింత పెంచుతూ ముంబై, భోపాల్ నగరాల్లో రెండు భారీ ఈవెంట్స్ ప్లాన్ చేశారు.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్‌ను మే 18న ముంబైలో గ్రాండ్ ఈవెంట్‌లో విడుదల చేయనున్నారు. ఈ ఈవెంట్ ద్వారా సినిమా భారీ కాన్వాస్‌ను జాతీయ మీడియా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు.
ముంబై ట్రైలర్ లాంచ్ తర్వాత, చిత్ర బృందం ఈ కథ మూలాలను సెలబ్రేట్ చేయడానికి హార్ట్ అఫ్ ఇండియా గా పిలిచే భోపాల్‌కు వెళ్లనుంది. మే 23న అక్కడ స్పెషల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
ఈ ఈవెంట్‌ను మరింత ప్రత్యేకంగా మార్చేలా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వయంగా ‘పెద్ది’ పాటలను లైవ్‌లో పెర్ఫార్మ్ చేయనున్నారు. అలాగే “సౌండ్ ఆఫ్ పెద్ది”ను లాంచ్ చేయనున్నారు. రెహమాన్‌తో పాటు పలువురు ప్రముఖ గాయకులు వేదికపై లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు.
ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’, ‘రైరై రారా’ పాటలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అలాగే రామ్ చరణ్ గ్లింప్సెస్ ప్రేక్షకుల్లో అడ్రినలిన్ రష్‌ను కలిగించాయి. దీంతో సినిమాను బిగ్ స్క్రీన్ చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘పెద్ది’ ఓవర్సీస్ మార్కెట్‌లో ఇప్పటికే రికార్డులు సృష్టిస్తోంది. కేవలం ప్రీమియర్స్‌కే నార్త్ అమెరికాలో US$225K ప్రీ-సేల్స్ నమోదు చేసింది.
ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రపంచ స్థాయి ప్రొడక్షన్ వాల్యూస్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయబోతున్నాయి.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఎడిటింగ్ నిర్వహిస్తున్న ఈ భారీ చిత్రానికి ఇప్పటికే ఫుల్ ఎడిట్ లాక్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ‘పెద్ది’ జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, జూన్ 3న ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి.
తారాగణం: రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు
సిబ్బంది:
రచన & దర్శకత్వం: బుచ్చి బాబు సానా
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
సంగీతం: ఎఆర్ రెహమాన్
ఎడిటింగ్ : నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
నిర్మాణ సంస్థ: వృద్ధి సినిమాస్
సమర్పణ: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్