Rebel Star Prabhas comes forward to support the 'Anti-Drug Awareness Program' initiated by the Telangana government
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 'యాంటీ డ్రగ్ అవేర్ నెస్ ప్రోగ్రామ్' కు సపోర్ట్ గా ముందుకొచ్చిన రెబెల్ స్టార్ ప్రభాస్
Pan India Rebel Star Prabhas has always been eager to support initiatives aimed at the welfare of society. He has now announced his support for the anti-drug awareness program launched by the Telangana government. In a video, Prabhas shares his message against drug use.
Prabhas says, "Life offers us plenty of ways to enjoy and be entertained. We have people who love us and loved ones for whom we live. So, why do we need drugs, Darlings? Let’s quit drugs today. If you know anyone struggling with addiction, call the toll-free number 8712671111. The Telangana government is committed to taking all necessary steps to ensure their full recovery.
The video is going viral on social media, making it reach everyone. Darling Prabhas initiative winning hearts on social media.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 'యాంటీ డ్రగ్ అవేర్ నెస్ ప్రోగ్రామ్' కు సపోర్ట్ గా ముందుకొచ్చిన రెబెల్ స్టార్ ప్రభాస్
సమాజ హితం కోరే ఏ కార్యక్రమానికైనా తన వంతు సపోర్ట్ అందించేందుకు ఎప్పుడూ ముందుంటారు రెబెల్ స్టార్ ప్రభాస్. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన యాంటీ డ్రగ్ అవేర్ నెస్ కార్యక్రమానికి తన మద్ధతు ప్రకటించారు ప్రభాస్. ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తూ డ్రగ్స్ వద్దు అనే సందేశాన్ని అందించారు ప్రభాస్. తన మెసేజ్ తో కూడిన వీడియోను ఆయన రిలీజ్ చేశారు. ఈ వీడియోలో
ప్రభాస్ స్పందిస్తూ - లైఫ్ లో మనకు బోలెడన్ని ఎంజాయ్ మెంట్స్ ఉన్నాయి. కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనషులు, మన కోసం బతికే మన వాళ్లు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్. డ్రగ్స్ ను ఈ రోజు నుంచే వదిలేయండి. మీకు తెలిసిన ఎవరైనా డ్రగ్స్ కు బానిసలు అయితే టోల్ ఫ్రీ నెంబర్ 8712671111 కు కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అని చెప్పారు.
Rebel Star #Prabhas message supporting the anti-drug awareness initiative.