21 August 2018
Hyderabad
ప్రమోద్ ఫిలింస్, ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకాలపై ప్రభుదేవా, ఐశ్వర్య రాజేశ్, బేబి దిత్య, సల్మాన్ యూసఫ్ ఖాన్, కొవై సరళ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'లక్ష్మి`. ఆగస్ట్ 24న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా ప్రభుదేవా మీడియాతో మాట్లాడారు.
కథ చెప్పలేదు...
- డైరెక్టర్ విజయ్ ముందు నాకు కథ చెప్పలేదు. 'డాన్స్ ఫిలిం చేయాలనుంది సార్!' అన్నారు. 'చేస్తే ఓ లెవల్ ఉండాలి.. లేకుంటే చేయకూడదు' అన్నాను. 'ఏబీసీడీ సినిమా చేశాం కదా! ఇంకా కొత్తగా ఏం చేస్తారు' అన్నాను. ఇండియా లెవల్‌లో టాలెంట్‌ను తేద్దాం సార్ అని విజయ్ అన్నారు. అన్నట్లుగానే లక్ష్మి కోసం ఇండియా అంతా వెతికి ఎక్కడెక్కడ నుండో పది మంది బెస్ట్ డాన్సర్స్‌ను పట్టుకొచ్చారు.
కథ గురించి..
- లక్ష్మి సినిమాలో డాన్స్‌తో పాటు ఎమోషన్ ఉంది. గురుశిష్యుల మధ్య నడిచే కథ. సినిమా చూశాను. ఇందులో చేసిన పిల్లలు ఏడిపించేశారు. విజయ్ బెస్ట్ మూవీ ఇదే. పిల్లలతో పాటు రెండు బిట్స్‌లో డాన్స్ చేశాను. ఇందులో డైలాగ్స్‌కే డాన్స్ చేసే బిట్ చేశాను. ఇలా డైలాగ్స్‌కు డాన్స్ చేయడం ఇండియాలోనే ఫస్ట్.
నేను చేయలేదు...
- నేను ఈ సినిమాకు నేను కొరియోగ్రఫీ చేయలేదు. పరేశ్, రూయల్ అనే ఇద్దరూ కొరియోగ్రఫీ చేశారు. నేను యాక్టర్‌గా నాకు తెలిసిన సలహాలు మాత్రమే ఇచ్చాను.
డైరెక్టర్ విజయ్ గురించి...
- టైటిల్ లక్ష్మి అని పెట్టమని నేనే చెప్పాను. అభినేత్రి 2 కూడా విజయ్‌తో చేయబోతున్నాను. తనతో చేయడం కంఫర్ట్‌గా అనిపిస్తుంది. అయితే వ్యక్తిత్వం పరంగా ఇద్దరం వేర్వేరుగా ఉంటాం. ఈ సినిమా పాపకు సంబంధించిన కథ. ఇందులో నాది కీలక పాత్ర మాత్రమే.
తెలుగు సినిమాలు చూస్తుంటా...
-నాకు ఎనర్జి కావాలంటే తెలుగు సాంగ్సే చూస్తాను. తెలుగు సినిమా ప్రాసెస్ నచ్చడమే అందుకు కారణం.
డైరెక్షన్ గురించి..
- జనవరి నుండి డైరెక్ట్ చేస్తాను.
కొరియోగ్రఫీ గురించి...
- ఇంత బిజీ సమయంలో కూడా వీలున్నప్పుడు ఎవరైనా అడిగితే డాన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నాను.
తదుపరి చిత్రాలు...
- డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాను. మెర్క్యురీలో డైలాగ్సే ఉండవు. ఇప్పుడు లక్ష్మిలో నా పాత్ర ఒకలా ఉంటుంది. తర్వాత పోలీస్ పాత్ర చేస్తున్నాను. 1984 కుంగ్‌ఫూ బేస్‌డ్ మూవీ చేస్తున్నాను. అలాగే సీరియల్ కిల్లర్‌లా ఓ సినిమా చేస్తున్నాను. ఇక దబాంగ్ 3లో ఎలాంటి మార్పు ఉండదు. రెండు పార్టులకు అనుగుణంగానే మూడో పార్ట్ ఉంటుంది.