08 May 2022
Hyderabad
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. డబుల్ బ్లాక్బస్టర్ 'F2' ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'F3' ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైమౌతున్న ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో నటించిన ప్రగతి మీడియాతో ముచ్చటించారు.
ఎఫ్ 3 ఎలా ఉండబోతుంది?
ఎఫ్2 లో వినోదం 50 శాతం అయితే 100% ఎఫ్3 లో వినోదం ఉంటుంది.
ఎఫ్ 2 కి కంటిన్యూగా మీ పాత్ర ఉంటుందా ?
కంటిన్యూగా కొనసాగింపుగానే ఉంటుంది నా పాత్ర అయితే అదే. కథ మారింది కాబట్టి కొన్ని మార్పులు కూడా ఉంటాయి.
అంటే మీ పాత్ర నిడివి ఎక్కువ ఉంటుందా?
కథ ప్రకారం ఎంత ఉండాలో దర్శకుడు చక్కగా డిజైన్ చేశారు. పాత్ర కొచెం ఎక్కువగానే చూపించారు.
డైరెక్టర్ గారు మీకు ఈ పాత్ర గురించి కథ చెప్పినప్పుడు ఎట్లా అనిపించింది?
నాకు అంత సీన్ లేదు. కథ చెప్పరు. నా పాత్ర వరకే చెప్పారు. ఇందులో నా పాత్ర చాలా గ్రేట్ అని నేను భావిస్తున్నాను.
ఎ ఫ్ 2 నటనకు 3లో మీ పాత్ర నటనకు ఏవైనా వేరియేషన్ చూపించారా?
అది పాత్ర మేరకు దర్శకుడు చెప్పింది చేశాను అది తెరపై చూస్తేనే ప్రేక్షకులకూ అర్థమవుతుంది.
వెంకటేష్ వరుణ్ తేజ్ నుంచి మీ పరిశీలనలో ఏం గ్రహించారు?
వరుణ్ తేజ్ క్విక్ లెర్నర్. ఏదైనా చూడగానే, వినగానే పసిగట్టారు వెంకటేష్‌గారి గురించి చెప్పాల్సిన పని లేదు ఆయన సెట్‌కి రావడంతోనే యాక్షన్ మూడులోకి వెళ్ళిపోతారు.
మీ కాంబినేషన్ సీన్స్లో ఎవరెవరు వున్నారు?
ఎఫ్2 లో ఉన్నటువంటి ఆ సహ నటి నటులే నా కాంబినేషన్లో ఉంటారు.
దర్శకుడు అనిల్ రావిపూడి గారు పని విధానం ఎలా అనిపించింది?
ఆయన చాలా పాజిటివ్గా రియాలిటీ కి చాలా దగ్గరగా, లాల్జర్ దేన్ లైఫ్ ఆలోచన వుంటారు. అమాయకత్వం తో కూడిన పాత్రలతో ఆయన కథలు ఉంటాయి.
నిర్మాత దిల్ రాజు గారి బేనర్‌లో నటించడం ఎలా అనిపిస్తుంది?
దిల్ రాజు గారు అంటేనే కుటుంబ కథా చిత్రాలకు మంచి విలువైన చిత్రాలకు పెట్టింది పేరు. ఆయన బేనర్‌లో నటించడం ఆనందంగా ఉంది.
పాత్ర చేసేటప్పుడు ఏవిధంగా మీ మైండ్ సెట్ వుంటుంది?
పాత్ర బాగా చేయాలని సెట్‌కి వస్తాను. చుట్టూ వున్న పాత్రలు వారి హావభావాలు చూశాక మరింత బాగా నటించాలని అనుకుంటాం. ఒక్కోసారి చేసేశాక ఇంటికి వెళ్ళినా కూడా ఇంకాస్త బాగా చేస్తే బాగుంటుందనిపిస్తుంది. అంటే క్యారెక్టర్ పరంగా నటిగా ఎప్పటికప్పుడు కొత్తదనం చూపాలనే ప్రయత్నం చేస్తుంటాను.
ఎఫ్ 2లోలేని సునీల్, అలీ వున్నారు. వారి కాంబినేషన్ ఎలా అనిపించింది?
ఎఫ్2లోలేని సునీల్, ఆలీ ఇందులో చేయడంవల్ల డబుల్ డోస్ వినోదం ఇందులో కనిపిస్తుంది.
సినిమా కరోనా వల్ల వాయిదా పడుతూ ఇప్పుడు రిలీజవుతోంది. మీ ఫీలింగ్ ఎలా వుంది?
కరోనావల్ల భారీ కాస్టింగ్ డేట్స్, లొకేషన్స్ వల్ల షూటింగ్ ఆలస్యమైంది. అయితే ఇప్పుడు రిలీజ్ కావడం చాలా ఎగ్జైటింగ్ గా ఉంది.
తమన్నా, మెహ్రిన్, అన్నపూర్ణమ్మ వీళ్లంతా మళ్లీ కాంబినేషన్‌తో ఎలా అనిపిస్తుంది?
తమన్నా, మెహ్రిన్ నా పిల్లలులాంటివారు. వారి నటన ఒక్కోరిది ఒక్కో శైలి. చాలా బాగా నటించారు. అన్నపూర్ణమ్మగారు వెంటే సందడే. చాలా వినోదంగా ఆహ్లాదకరంగా ఉండే సినిమా అవుతుంది.
అసలు ఎఫ్ 3 సినిమా ప్రేక్షకులు ఎందుకు చూడాలంటారా?
ఎఫ్ 2 చూసిన వారంతా చాలా వినోదాన్ని ఆస్వాదించారు. అంతకుమించి డబుల్ ధమాకా ఈ సినిమాలో వుంటుంది. పెట్టిన పైసాకు సాటిఫై అవుతారు ప్రేక్షకులు. అని అన్నారు.