pizza

Megastar Chiranjeevi Launched Intense Teaser Of Nara Rohith, Murthy Devagupthapu, Vanara Entertainments, Rana Arts’ Prathinidhi 2
మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన నారా రోహిత్, మూర్తి దేవగుప్తపు, వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ 'ప్రతినిధి 2' ఇంటెన్స్ టీజర్‌

You are at idlebrain.com > news today >

29 March 2024
Hyderabad

Hero Nara Rohith’’s comeback film Prathinidhi 2 with popular journalist Murthy Devagupthapu on his directorial debut is getting ready for release. KumarRaza Bathula, Anjaneyulu Sri Thota, and Surendranath Bollineni are producing the movie under the banners of Vanara Entertainments and Rana Arts. Prathinidhi 2, the second franchise from the Prathinidhi series, had its teaser launched today. Megastar Chiranjeevi did the honors of unveiling the teaser.

The protagonist is an honest news reporter working on a TV channel. In his interview with a top politician, he enquires about the debts of the state, to which the latter replies, 5 lakh crores. The politician suggests the debts will be cleared if development is done in the state. Then, the protagonist quizzes are there really development works happening in the state. The last episode shows the protagonist cautioning people to cast their votes or else leave the country. The teaser also introduced other prominent characters such as Sachin Khedekar, Raghu Babu, Jisshu Sengupta, Udaya Bhanu, Ajay Gosh, Shree, etc.

This intense teaser makes a lasting impression. Nara Rohith looked apt in the role of a news reporter and he brought intensity with his strong portrayal of the character. Murthy Devagupthapu impresses with his writing and taking. The interview episode and the last sequence about voter rights and responsibilities are bang on.

Nani Chamidishetty’s camera work is neat, whereas young sensation Mahati Swara Sagar strengthened the narrative with his superb score. Raviteja Girijala is the editor and Kiran Kumar Manne is the art director. The production design looked grand.

As announced by the makers, Prathinidhi 2 will grace the cinemas in April, this year.

Cast: Nara Rohithh, Siree Lella, Dinesh Tej, Sapthagiri, Jisshu Sengupta, Sachin Khedekar, Thanikella Bharani, Indraja, Udaya Bhanu, Ajay Gosh, Ajay, Praveen, Prudhvi Raj, Raghu Babu, Raghu Karumanchi

Technical Crew:
Director: Murthy Devagupthapu
Producers: KumarRaza Bathula, Anjaneyulu Sri Thota, Surendranath Bollineni
Banners: Vanara Entertainments, Rana Arts
Music: Mahati Swara Sagar
Editor: Raviteja Girijala
DOP: Nani Chamidisetty
Art: Kiran Kumar Manne
Stunts: Siva Raju & Prudhvi
Executive Producer: Karthik Puppala
Publicity Designs: Anil&Bhanu
Digital: Praveen & Housefull Digital

మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన నారా రోహిత్, మూర్తి దేవగుప్తపు, వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ 'ప్రతినిధి 2' ఇంటెన్స్ టీజర్‌

హీరో నారా రోహిత్ కమ్ బ్యాక్ చిత్రం ప్రతినిధి 2. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తాపు దర్శకత్వం రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్‌లపై కుమార్‌రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రతినిధి సిరీస్ నుండి రెండవ ఫ్రాంచైజీ అయిన 'ప్రతినిధి 2' టీజర్ మెగాస్టార్ చిరంజీవి ఈరోజులాంచ్ చేశారు.

హీరో ఒక టీవీ ఛానెల్‌లో పనిచేసే నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్. ఒక అగ్ర రాజకీయ నాయకుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో, అతను రాష్ట్రం యొక్క అప్పుల గురించి ఆరా తీయగా, 5 లక్షల కోట్లు సమాధానం ఇస్తాడు నాయకుడు. రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే అప్పులు తీరుతాయని రాజకీయ నాయకుడు చెప్పగా.. అప్పుడు హీరో.. రాష్ట్రంలో నిజంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయా? అని ప్రశ్నిస్తాడు. చివరి ఎపిసోడ్‌లో హీరో ప్రజలను ఓట్లు వేయమని, లేకుంటే దేశం విడిచి వెళ్లమని హెచ్చరించడం ఆలోచన రేకెత్తిస్తుంది. టీజర్ లో సచిన్ ఖేడేకర్, రఘు బాబు, జిషు సేన్‌గుప్తా, ఉదయ భాను, అజయ్ గోష్, శ్రీ ఇతర ప్రముఖ పాత్రలను కూడా పరిచయం చేశారు.

ఈ ఇంటెన్స్ టీజర్ అద్భుతంగా ఆకట్టుకుంది. నారా రోహిత్ న్యూస్ రిపోర్టర్ పాత్రలో ఒదిగిపోయారు. తన ఇంటెన్స్ నటనతో పాత్రకు బలాన్ని తీసుకొచ్చారు. మూర్తి దేవగుప్తపు తన రైటింగ్, టేకింగ్‌తో ఆకట్టుకున్నారు. ఇంటర్వ్యూ ఎపిసోడ్ ఓటరు హక్కులు , బాధ్యతల గురించిన చివరి సీక్వెన్స్ అద్భుతంగా వున్నాయి.

నాని చమిడిశెట్టి కెమెరా పనితనం నీట్ గా ఉంది, యువ సంచలనం మహతి స్వర సాగర్ తన అద్భుతమైన స్కోర్‌తో కథనానికి బలం చేకూర్చారు. రవితేజ గిరిజాల ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్. ప్రొడక్షన్ డిజైన్ గ్రాండ్ గా వుంది.

మేకర్స్ అనౌన్స్ చేసినట్లుగా, ప్రతినిధి 2 ఈ సంవత్సరం ఏప్రిల్‌లో థియేటర్స్ లో విడుదల కానుంది.

తారాగణం: నారా రోహిత్, సిరీ లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ గోష్, అజయ్, ప్రవీణ్, పృధ్వీ రాజ్, రఘుబాబు, రఘు కారుమంచి

సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: మూర్తి దేవగుప్తపు
నిర్మాతలు: కుమార్‌రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని
బ్యానర్లు: వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్
సంగీతం: మహతి స్వర సాగర్
ఎడిటర్: రవితేజ గిరిజాల
డీవోపీ: నాని చమిడిశెట్టి
ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె
స్టంట్స్: శివరాజు & పృధ్వి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కార్తీక్ పుప్పాల
పబ్లిసిటీ డిజైన్స్: అనిల్ & భాను
డిజిటల్: ప్రవీణ్ & హౌస్‌ఫుల్ డిజిటల్

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved