30 July 2016
Hyderabad
ఎనర్జిటిక్ స్టార్ రామ్, టాలెంటెడ్ డైరెక్టర్ సంతోష్ శ్రీన్‌వాస్ కాంబినేషన్‌లో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర ప్రొడక్షన్ నెం.8గా నిర్మిస్తున్న చిత్రానికి 'హైపర్'(ప్రతి ఇంట్లో ఒకడుంటాడు) అనే టైటిల్‌ని కన్‌ఫర్మ్ చేశారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 30న విజయదశమి కానుకగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఆగస్ట్ 3న 'హైపర్' ఫస్ట్ లుక్
ఈ సందర్భంగా దర్శకుడు సంతోష్ శ్రీన్‌వాస్ మాట్లాడుతూ - ''ఈ చిత్రంలో రామ్ క్యారెక్టర్ హైపర్‌గా వుంటుంది. అతని క్యారెక్టరైజేషన్‌కి, ఎనర్జిటిక్ పెర్‌ఫార్మెన్స్‌కి తగ్గట్టుగా ఈ చిత్రానికి 'హైపర్'(ప్రతి ఇంట్లో ఒకడుంటాడు) టైటిల్‌ని కన్‌ఫర్మ్ చేశాం. జనరల్‌గా ప్రతి ఇంట్లో హైపర్‌గా వుండేవారు ఒకరుంటారు. అలా ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా 'హైపర్' రూపొందుతోంది. రామ్ కెరీర్‌లో 'హైపర్' ఒక డిఫరెంట్ టైఫ్ ఆఫ్ మూవీ. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని ఆగస్ట్ 3న విడుదల చేస్తున్నాం. అలాగే చిత్రాన్ని సెప్టెంబర్ 30న విజయదశమి కానుకగా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చెయ్యడానికి మా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు'' అన్నారు.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, ఆర్ట్: అవినాష్, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, సమర్పణ: వెంకట్ బోయనపల్లి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్ శ్రీన్‌వాస్.