Premante trailer promises a fun film
"పెళ్లంటేనే పప్పన్నం.. ఆ పప్పే మాడిపోతే పెళ్లేముంటుంది.."... భార్యాభర్తల మధ్య కీచులాటలతో సరదాగా సాగిపోతూ 'ప్రేమంటే' ట్రైలర్..
The trailer of ‘Premante’, starring Priyadarshi Pulikonda and Anandhi as the lead pair, has been released. Filled with lively conversations between Priyadarshi as Madhusudhan Rao and Anandhi as Ramya, the trailer offers nonstop laughter from start to finish. The story seems to revolve around the misunderstandings that arise between a couple after marriage, leading to their hilarious conflicts. The trailer flows with light-hearted banter, and Priyadarshi, as always, entertains with his trademark comedy.
“Marriage itself is like lentil porridge… and if that porridge gets burnt, what remains of the marriage?” — with this punchline, Suma makes a return to the screen after quite some time, playing the role of constable Asha Mary. Going by her dialogues in the trailer, her character is all set to guarantee laughs in the film.
Along with Priyadarshi, Anandhi, and Suma, Vennela Kishore also appears in another key role. Directed by Navaneeth Sriram, ‘Premante’ is produced jointly by Jahnvi Narang and Puskur Ram Mohan Rao, with Leon James composing the music. The film is set to hit theatres on 21st of this month.
"పెళ్లంటేనే పప్పన్నం.. ఆ పప్పే మాడిపోతే పెళ్లేముంటుంది.."... భార్యాభర్తల మధ్య కీచులాటలతో సరదాగా సాగిపోతూ 'ప్రేమంటే' ట్రైలర్..
ప్రియదర్శి పులికొండ మరియు ఆనంది హీరోహీరోయిన్లుగా నటించిన 'ప్రేమంటే' ట్రైలర్ విడుదలయింది. మధుసూదన్ రావు పాత్రలో ప్రియదర్శి, రమ్య పాత్రలో ఆనంది పలికిన సంభాషణలతో నిండిన ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయించేలా ఉంది. పెళ్లి తరువాత జంట మధ్య వచ్చిన అపార్ధాల కారణంగా వాళ్ల మధ్య కీచులాటలు జరిగితే ఎలా ఉంటుందో అనే పరిణామాల చుట్టూ కథ తిరుగుతున్నట్టుగా ఎంతో సరదా ముచ్చట్లతో ట్రైలర్ కొనసాగింది. ట్రైలర్ లో ప్రియదర్శి తన మార్క్ కామెడీతో అలరించారు.
"పెళ్లంటేనే పప్పన్నం అయ్యా.. ఆ పప్పు మాడిపోతే పెళ్లేముంటుంది చెప్పు" అంటూ చెప్తూ కానిస్టేబుల్ ఆశా మేరీ పాత్రలో సుమ చాలా రోజుల తరువాత మళ్లీ తెరపై కనిపించబోతున్నారు. ట్రైలర్ లో సుమ పలికిన సంభాషణలు చూస్తుంటే తెరపై ఆమె పాత్ర నవ్వులు పుట్టించడం ఖాయమన్నట్టే ఉంది. ఈ సినిమాలో ప్రియదర్శి, ఆనంది మరియు సుమ లతో పాటూ మరో కీలకపాత్రలో వెన్నెల కిషోర్ కూడా కనిపించబోతున్నారు. నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన 'ప్రేమంటే' సినిమాను నిర్మాతలు జాన్వీ నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మించగా, ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించడం జరిగింది. ఈ సినిమా ఈ నెల 21 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
The trailer of #Premante is entertaining, showcasing a newly married couple navigating their sweet moments and small insecurities. Enter Asha Mary, played by Suma Kanakala, a constable determined to make them divorce.