pizza

NTR Trust Euphoria Musical Night press meet

You are at idlebrain.com > news today >

05 February 2025
Hyderabad

-ఈ నెల 15 న తలసేమియా భాదితులకు సహయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్
-ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో జరగనున్న మ్యూజికల్ నైట్
-ఈ కార్యక్రమ వివరాలు మీడియా కి వివరించిన నారా భువనేశ్వరి, తమన్
-ఈ నెల 15 న విజయవాడలో జరగనున్న మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి అతిథులుగా హాజరుకానున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

'తలసేమియా భాదితుల కోసం ఈ నెల 15 న మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేసాము. ప్రతి టికెట్ పై వచ్చే రూపాయి తలసేమియా భాదితులకు అందిస్తాం. అడియన్స్ ఖర్చు చేసిన ప్రతి ఒక్క రూపాయి తిరిగి సమాజ సేవకే ఉపయోగపడుతుంది' అన్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు. ఎన్టీఆర్ ట్రస్ట్ అద్వర్యంలో ఫిబ్రవరి15న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ షో జరగనుంది.

ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు మాట్లాడుతూ.. మా ఆహ్వానం అంగీకరించి ఇక్కడికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే స్ఫూర్తితో ఎన్టీఆర్ ట్రస్ట్ నడుస్తుంది. జెనిటిక్ డిసార్డర్ తలసేమియా తో చాలా మంది పిల్లలు, పెద్దలు బాధపడుతున్నారు. ఈ వ్యాధి వున్న వారు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. ఇది తీవ్రంగా వచ్చినప్పుడు రక్త మార్పిడి వెంటనే జరగాలి. దీనికి చాలా రక్తం అవసరం. బ్లడ్ డొనేట్ చేస్తే చాలా మంది జీవితాలు నిలబడతాయి. తలసేమియా భాదితుల కోసం ఈ నెల 15 న మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేసాము. ప్రతి టికెట్ పై వచ్చే రూపాయి తలసేమియా భాదితులకు అందిస్తాం. తమన్ కూడా ఒక్క నిమిషం ఆలోచించకుండా వెంటనే మ్యూజికల్ నైట్ కి వస్తా అన్నారు. తమన్ ఈ షో ఫ్రీ గా చేస్తా అని గొప్ప హృదయంతో చెప్పారు. ఆయనకి ఎప్పుడు దేవుని ఆశీస్సులు వుంటాయి. ప్రతి ఒక్కరు తెలుగు తల్లికి రుణం తీర్చుకోవాలి. సమాజ సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేయాలి. మనం వెళ్ళేటప్పుడు మన వెంట డబ్బు రాదు...ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే అందరికి గుర్తు ఉంటుంది. ప్రతి ఒక్కరు కొనే టికెట్ సమాజ సేవ కె ఉపయోగపడుతుంది, బుక్ మై షో లో టికెట్స్ అవైల్ బుల్ గా వుంటాయి. ప్రతి ఒక్కరూ టికెట్ కొనుక్కొని కుటుంబ సమేతంగా వచ్చి ఈ కారక్య్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఆడియన్స్ ఖర్చు చేసిన ప్రతి ఒక్క రూపాయి తిరిగి సమాజ సేవకే ఉపయోగపడుతుంది' అన్నారు

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. చాలా మంచి ఆలోచనతో మొదలైన కార్యక్రమం ఇది. ఈ షో నేను చేయడం చాలా సంతోషంగా ఉంది. నారా భువనేశ్వరి గారి ఆలోచన చాలా గొప్పది. తలసేమియా భాదితులకు సహాయం కోసం అని చెప్పగానే నేను వెంటనే ఈ కార్యక్రమంకి వస్తా అని చెప్పాను. భువనేశ్వరి గారు నాపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద కార్యక్రమం నా చేతిలో పెట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు గారు రాష్ట్రం కోసం పగలు రాత్రి పని చేస్తున్నారు. టికెట్ పై పెట్టె ప్రతి రూపాయి తలసేమియా భాదితులకు వెళ్తుంది. ఈ షో చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఈ షోని సూపర్ సక్సెస్ చేసే బాధ్యత మన అందరిపై వుంది. ఇది బిగ్గెస్ట్ షో కాబోతోంది' అన్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved