pizza

Purushaha will appeal to everyone. Audiences will be thoroughly entertained: Hero Pavan Kalyan at the pre-release event
‘పురుష:’ మూవీ ప్రతీ ఒక్కరికీ నచ్చుతుంది. అందరూ ఫుల్‌గా ఎంటర్టైన్ అవుతారు - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో పవన్ కళ్యాణ్

You are at idlebrain.com > news today >

19 May 2026
Hyderabad

Battula Saraswathi is presenting, while Battula Koteshwar Rao is producing the wholesome family entertainer Purushaha under the Kalyan Productions banner. The film marks the debut of Pavan Kalyan Battula as a lead actor, with direction by Veeru Vulavala. The cast includes Pavan Kalyan, Saptagiri, Kasireddy Rajkumar, Raayancha Kokkura, Vishika, and Hasini Sudheer in key roles. The film is set for release on May 22. As part of the promotions, a grand pre-release event was held on Monday.

While speaking at the event, Pavan Kalyan Battula said: “Thanks to producer Koteshwar Rao garu and Saraswathi garu for bringing Purushaha to this stage. Our director Veeru garu took great care of me throughout this journey and supported me immensely. Satish garu made all of us look fantastic on screen. He helped me overcome my camera fear. Shravan garu gave us wonderful songs. Ravi garu created excellent sets.

Saptagiri anna and Kasireddy anna treated me like their own younger brother. They helped me shed my shyness, fear, and hesitation. Working with Vennela Kishore garu, Rajeev Kanakala garu, and VTV Ganesh garu taught me a lot. Raayancha, Hasini, and Vishika supported me throughout. A big thanks to Teju garu for coming for us. My heartfelt thanks to everyone who worked on this film. And above all, thanks to my father, who shaped me into who I am today. I grew up watching his struggles. My sister too works very hard for me.

Let’s meet in theatres on May 22. Purushaha will definitely impress everyone. Since everyone stays indoors during this summer, this will be a perfect family film to enjoy together in theatres. I’m sure you will all be fully entertained.”

Saptagiri said: “When Veeru garu narrated the story, I tried giving some inputs, but he stuck to his own path and made the film exactly as he envisioned. Koteswara Rao garu spoke so highly about our film industry and produced the movie wonderfully. Satish Muthyala garu gave us beautiful visuals. Shravan’s songs are winning everyone’s hearts and the BGM is fantastic.

Vishika, Hasini, and Raayancha bring so much fun to the sets. I hope all our heroines get great opportunities. I enjoyed working with Kasireddy. I don’t know what good deeds Pavan Kalyan did in his previous life, but he is blessed with a father like Koteswara Rao garu and a sister like Saraswathi garu. I request everyone to watch our film on May 22 and make it a success.”

Director Veeru Vulavala said: “It is only because of Saraswathi Battula garu that Purushaha has reached this stage. She supported us at every step of this journey. After listening to the story and seeing the storyboard, Koteswara Rao garu immediately approved it. He never hesitated when it came to spending on the film.

Thanks to Satish Muthyala garu for introducing me to Koteswara Rao garu and Saraswathi garu. I will always remain grateful to him for giving me this opportunity. Shravan gave us superb music. Saptagiri garu was very excited the moment he heard the story. He will have everyone laughing like a precious gem of comedy. Raj Kumar garu’s timing is excellent- every dialogue from him will entertain the audience. Pavan Kalyan performed brilliantly; not once will you feel he’s a debut hero. All the heroines acted wonderfully. Our film is releasing on May 22. I request everyone to watch it and support us.”

Producer Battula Koteswara Rao said: “I had no connection with the film industry, but I love cinema deeply. After my mother, cinema has been my greatest teacher. It has taught me so much. That’s why I wanted to contribute something meaningful to this industry. Thanks to my son Pavan Kalyan for fulfilling my dream. He overcame his shyness and hesitation and acted with complete dedication. For my son, his world is just me, his mother, and his sister. I wanted to introduce him to the world of cinema and help him grow beyond his limitations, so I made him the hero of this film.

The artists and technicians supported me immensely in this journey. Our film releases on May 22- please watch and support us.”

Producer Saraswathi Battula said: “I came this far only because of my father and brother. I never imagined I would reach this stage. In my college days, I used to write stories and dream of becoming a director, but I never expressed those thoughts openly.

I made this film because I wanted to support my younger brother like an elder sibling. He means everything to me. I thank everyone who supported us on this journey. Our film releases on May 22. We will definitely entertain you- please watch and make it a success.”

Actress Tejaswi Rao (of Raju Weds Rambai fame) said: “Thanks to everyone who invited me to the Purushaha event. I feel the film is going to be a big success. My best wishes to Rayancha, Hasini, Sapthagiri garu, Raj Kumar garu, and Pavan Kalyan. Vishika is my best friend- I hope she gets great success.

Purushaha releases on May 22. Do watch it and make it a big hit.”

‘పురుష:’ మూవీ ప్రతీ ఒక్కరికీ నచ్చుతుంది. అందరూ ఫుల్‌గా ఎంటర్టైన్ అవుతారు - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో పవన్ కళ్యాణ్

బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ‘పురుష:’ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ మూవీకి వీరు వులవల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాను మే 22న రిలీజ్ చేయబోతోన్నారు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

బత్తుల పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ .. ‘‘పురుష:’ సినిమాని ఈ స్థాయికి తీసుకు వచ్చిన నిర్మాత కోటేశ్వరరావు గారికి, సరస్వతి గారికి థాంక్స్. మా దర్శకుడు వీరు గారు నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. నాకు ఈ జర్నీలో ఆయన ఎంతో సపోర్ట్ చేశారు. సతీష్ గారు మా అందరినీ ఎంతో అద్భుతంగా చూపించారు. నా కెమెరా ఫియర్‌ను ఆయనే తొలగించారు. శ్రవణ్ గారు మాకు మంచి పాటల్ని ఇచ్చారు. రవి గారు మాకు మంచి సెట్స్ వేసిచ్చారు. సప్తగిరి అన్న, కసిరెడ్డి అన్న నన్ను సొంత తమ్ముడిలా చూసుకున్నారు. వారే నా సిగ్గు, భయాన్ని, బిడియాన్ని పోగొట్టారు. వెన్నెల కిషోర్ గారితో, రాజీవ్ కనకాల గారితో, వీటీవీ గణేష్ గారితో వర్క్ చేయడం వల్ల ఎంతో నేర్చుకున్నాను. రాయంచ, హాసిన, విషిక నాకెంతో సపోర్ట్ చేశారు. మా కోసం వచ్చిన తేజు గారికి థాంక్స్. ఈ మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన మా నాన్నకి థాంక్స్. మా నాన్న కష్టం చూస్తూ నేను పెరిగాను. నా కోసం మా అక్క ఎక్కువగా కష్టపడుతుంటారు. మే 22న థియేటర్లో కలుద్దాం. ‘పురుష:’ మూవీ ప్రతీ ఒక్కరికీ నచ్చుతుంది. అసలే ఈ సమ్మర్‌లో అందరూ ఇంట్లోనే ఉంటారు. ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్‌కు వెళ్లి హాయిగా చూసేలా మా సినిమా ఉంటుంది. అందరూ ఫుల్‌గా ఎంటర్టైన్ అవుతారు’ అని అన్నారు.

సప్తగిరి మాట్లాడుతూ .. ‘వీరు గారు కథ చెప్పినప్పుడు నా ఇన్ పుట్స్ ఇచ్చే ప్రయత్నం చేశాను. కానీ వీరు గారు మాత్రం తన దారిలోనే వెళ్లారు. అతను అనుకున్నట్టుగానే సినిమాని తీశారు. బత్తుల కోటేశ్వరరావు గారు మన సినిమా ఇండస్ట్రీ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఈ మూవీని ఎంతో అద్భుతంగా నిర్మించారు. సతీష్ ముత్యాల గారు మాకు మంచి విజువల్స్ ఇచ్చారు. శ్రవణ్ గారి పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. బీజీఎం కూడా అదిరిపోతుంది. విషిక, హాసిని, రాయంచ సెట్‌లో ఎంతో సరదాగా ఉంటారు. మా హీరోయిన్లందరికీ మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. కసిరెడ్డితో పని చేయడం సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాడో గానీ కోటేశ్వరరావు గారి లాంటి తండ్రి, సరస్వతి గారి లాంటి అక్క దొరికి ఉంటారు. మే 22న మా సినిమాని చూసి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

దర్శకుడు వీరు వులవల మాట్లాడుతూ .. ‘సరస్వతి బత్తుల గారి వల్లే ‘పురుష:’ ఇక్కడి వరకు వచ్చింది. ఈ జర్నీలోని ప్రతీ దశలో ఆమె మాకు సపోర్ట్‌గా నిలిచారు. కథ విన్నాక, స్టోరీ బోర్డ్ చూశాక కోటేశ్వరరావు గారు ఓకే చెప్పారు. నిర్మాత గారు ఖర్చుకి ఎక్కడా వెనుకడుగు వేయలేదు. నాకు కోటేశ్వరరావు గారు, సరస్వతి గారిని పరిచయం చేసిన సతీష్ ముత్యాల గారికి థాంక్స్. నాకు ఈ అవకాశం ఇప్పించిన సతీష్ ముత్యాల గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. శ్రవణ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. కథ చెప్పిన వెంటనే సప్తగిరి గారు చాలా ఎగ్జైట్ అయ్యారు. మగజాతి ఆణిముత్యంలా అందరినీ నవ్విస్తారు. రాజ్ కుమార్ గారి కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఆయన్నుంచి వచ్చే ప్రతీ డైలాగ్ ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించాడు. ఎక్కడా కూడా కొత్త హీరోలా అనిపించడు. హీరోయిన్లంతా అద్భుతంగా నటించారు. మే 22న మా సినిమా రాబోతోంది. అందరూ మా సినిమా చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నిర్మాత బత్తుల కోటేశ్వరరావు మాట్లాడుతూ .. ‘నాకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు. అయితే నాకు సినిమాలంటే చాలా ఇష్టం. మా అమ్మ తరువాత సినిమానే నాకు గురువు. సినిమా నాకెంతో నేర్పింది. అందుకే నా వంతుగా ఈ సినిమా పరిశ్రమకు వచ్చి మంచి చిత్రాన్ని తీశాను. నా కోరికను నెరవేర్చుతున్న నా కొడుకు పవన్ కళ్యాణ్‌కి థాంక్స్. ఉన్న సిగ్గు, బిడియాన్ని వదిలేసి నటించాడు. నా కొడుక్కి నేను, తల్లి, అక్క.. ఈ ముగ్గురే ప్రపంచం. నా కొడుక్కి ఈ సినిమా లోకాన్ని పరిచయం చేయాలని, అతనికి ఉన్న సిగ్గు, బిడియాన్ని పోగొట్టాలని హీరోగా చేశాను. నాకు ఈ ప్రయాణంలో ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. మా సినిమా మే 22న రిలీజ్ కాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

నిర్మాత సరస్వతి బత్తుల మాట్లాడుతూ .. ‘మా నాన్న, తమ్ముడి వల్లే ఇక్కడి వరకు రాగలిగాను. అసలు ఇక్కడి వరకు వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కాలేజీ టైంలో స్టోరీలు రాసుకునేదాన్ని, డైరెక్టర్ అవ్వాలని అనుకునే దాన్ని. కానీ ఎప్పుడూ నా ఆలోచనల్ని బయట పెట్టలేదు. నా తమ్ముడిని నేను అన్నలా చూసుకోవాలని ఈ మూవీని తీశాను. నాకు నా తమ్ముడే సర్వస్వం. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మే 22న మా సినిమా రాబోతోంది. కచ్చితంగా అందరినీ ఎంటర్టైన్ చేస్తాం. అందరూ వచ్చి చూసి మా మూవీని సక్సెస్ చేయండి’ అని అన్నారు.

‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరోయిన్ తేజస్వీ రావ్ మాట్లాడుతూ .. ‘‘పురుష:’ కార్యక్రమానికి నన్ను పిలిచిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ‘పురుష:’ మంచి విజయం సాధించబోతోన్నట్టుగా అనిపిస్తుంది. రాయంచ, హాసిని, సప్తగిరి గారు, రాజ్ కుమార్ గారు, పవన్ కళ్యాణ్‌కి ఆల్ ది బెస్ట్. విషిక నా బెస్ట్ ఫ్రెండ్. విషికకి మంచి విజయాలు దక్కాలి. మే 22న ఈ సినిమా రాబోతోంది. అందరూ తప్పకుండా చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

రాయంచ కొక్కుర మాట్లాడుతూ .. ‘‘పురుష:’ సినిమాలో నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత కోటేశ్వరరావు గారికి థాంక్స్. వీరు సర్‌ని ఒప్పించి మరీ నన్ను హీరోయిన్‌గా ఆయన తీసుకున్నారు. వీరు గారు చాలా మంచి వ్యక్తి. సెట్‌లో ఎప్పుడూ కూల్‌గా ఉంటారు. సతీష్ గారు మా అందరినీ అద్భుతంగా చూపించారు. శ్రవణ్ గారు ఇచ్చిన మ్యూజిక్, ఆర్ఆర్ సినిమాకి హైలెట్ అవుతుంది. పవన్ కళ్యాణ్‌తో పని చేయడం ఆనందంగా ఉంది. ఎక్కడా కూడా కొత్త హీరోలా కనిపించడు. ఈ సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా చిత్రం మే 22న రాబోతోంది. అందరూ మా సినిమాని చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

విషిక మాట్లాడుతూ .. ‘వీరు గారు ప్రతీ ఒక్క సీన్‌కి స్టోరీ బోర్డ్ చేస్తుంటారు. నాకు గీత అనే మంచి పాత్రను ఇచ్చిన ఆయనకు థాంక్స్. నిర్మాత కోటేశ్వరరావు గారు మా అందరినీ నిజంగానే ఫ్యామిలీ మెంబర్స్ లా చూసుకున్నారు. సతీష్ గారు, రవి గారు, శ్రవణ్ గారు అందరూ మా సినిమా కోసం చాలా కష్టపడ్డారు. రాయంచ, హాసినిలతో పని చేయడం ఆనందంగా ఉంది. సప్తగిరి గారు సెట్‌లో ఎంతో సరదాగా ఉంటారు. రాజ్ కుమార్ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్‌కి ఇదే తొలి చిత్రం. ఆయనకు ఆల్ ది బెస్ట్. నా కోసం వచ్చిన తేజుకి థాంక్స్. మా సినిమా మే 22న రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

హాసిని సుధీర్ మాట్లాడుతూ .. ‘‘పురుష:’లో నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. నన్ను సొంత ఫ్యామిలీ మెంబర్‌లా చూసుకున్నారు. సతీష్ గారు మా అందరినీ ఎంతో అందంగా చూపించారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి. సప్తగిరి గారు చాలా మంచి వ్యక్తి. నా గురించి ప్రతీ చోటా మంచిగా చెబుతుంటారు. పవన్ కళ్యాణ్ గారికి మొహమాటం ఎక్కువ. ఆయన చాలా మంచి వ్యక్తి. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా సినిమా 22న రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.

కెమెరామెన్ సతీష్ ముత్యాల మాట్లాడుతూ .. ‘వీరు గారు నాకు కథ చెప్పిన వెంటనే నిర్మాత కోటేశ్వరరావు గారికి చెప్పాను. పవన్ కళ్యాణ్‌కి ఈ మూవీ కరెక్ట్ డెబ్యూ అని ఫీల్ అయ్యాను. ‘మళ్లీరావా’ నుంచి వీరుతో నాకు మంచి పరిచయం ఉంది. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ మంచి పేరు సంపాదిస్తారు. ఈ సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ భరద్వాజ్ మాట్లాడుతూ .. ‘వీరు గారితో నాకు చాలా ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. మమ్మల్ని నమ్మి అవకాశం ఇచ్చిన కోటేశ్వరరావు గారికి థాంక్స్. ఈ చిత్రం సూపర్ ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని సినిమాలో చూస్తే తొలి చిత్రం అన్నట్టుగా ఉండదు. సప్తగిరి గారు, కసిరెడ్డి గారు అందరూ అద్భుతంగా నవ్విస్తారు. మే 22న ఈ సినిమా రాబోతోంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.

ఆర్ట్ డైరెక్టర్ రవి మాట్లాడుతూ .. ‘‘పురుష:’ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ జర్నీలో సపోర్ట్ చేస్తున్న సతీష్ ముత్యాల గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఆర్ట్ డైరెక్టర్‌గా కాకుండా ఓ ఫ్యామిలీ మెంబర్‌‌‌లా చూసుకున్నారు. ఈ జర్నీలో నాకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

ఎడిటర్ కోటి మాట్లాడుతూ .. ‘‘పురుష:’ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ మూవీ మే 22న రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved