pizza

clean family entertainer "Purushothamudu" will impress audience - director Ram bheemana, Producer Dr. Ramesh Tejawat
"పురుషోత్తముడు" హోల్ సమ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అలరిస్తుంది - దర్శకుడు రామ్ భీమన, నిర్మాత డా.రమేష్ తేజావత్

You are at idlebrain.com > news today >

25 July 2024
Hyderabad

Hero Raj Tarun's new movie is "Purushothamudu". Dr. Ramesh Tejawat and Prakash Tejawat are ambitiously producing this film with a huge budget under the banner of Sri Sridevi Productions. Hasini Sudheer is introduced as the heroine with this film. Ram Bheemana, who is known as director with the films "Akatayi" and "Hum Tum", is making the film "Purushothamudu". This movie made with a star cast like Prakash Raj, Murali Sharma, Ramya Krishna, Brahmanandam and Mukesh Khanna. "Purushothamudu" is set for a worldwide grand theatrical release on 26th of this month. On this occasion

Director Ram bheemana said - I have directed two films in the past, Aakatayi and Hum Tum. Hum Tum movie brought profit to the producer. after a gap of six years, I made the film "Purushothamudu". I am happy to find good producers like Dr. Ramesh Tejawat and Prakash Tejawat. They thought a lot about the quality of the movie and produced the movie. I made a clean family entertainer "Purushothamudu". our producers casted big artists like Prakash Raj, Ramyakrishna, Mukesh Khanna, Murali Sharma in our movie. All of them brought strength to the story with their performance. After reading a news article, I prepared the story of this movie a few years ago. Why a millionaire came to a village and what he did there is the story of "Purushothamudu". It seems that movie like Mahesh Babu's Srimanthudu. If we think about the story line, many movies seem the same. But what is show in that story is important. In the movie "Purushothamudu" we have touched a point that has not been shown in any Indian film till now. Hero Raj Tarun has given his full support to the movie. Heroine Hasini Sudhir's character is very good. Hasini played her role perfectly. Our movie is coming to the theaters as a wholesome clean family entertainer. Hope you all will see and give your response.

Producer Dr. Ramesh Tejawat said - It has been a long time since I went to Mumbai from Andhra. I run a business there. Movies are my passion. Despite doing well in business, the desire to produce a good Telugu film was in mind. That desire was fulfilled with the movie "Purushothamudu". Making a movie does not mean spending money, but choosing the story, artists, good music, lyrics, technicians, all these things have been done with care and quality. We spent 6 months on post-production so you can understand the care we took for the quality of the film. As producers, we have made every effort not to compromise anywhere for the film. Famous artists like Prakash Raj, Ramya Krishna, Murali Sharma and Mukesh Khanna have been roped in for key roles. The music of Gopisunder, lyrics of Chandra Bose, Chaitanya Prasad, Ramajogaiah Shastri will be the attraction of our movie. Hero Raj Tarun provided his support. Heroine Hasini Sudheer acted like a Telugu girl. We thought she would be very good for this role. She was well paired with Raj Tarun. "Purushothamudu" is a movie that can be watched comfortably by all the audience as a family. There is no vulgarity or bad habits anywhere in this. We will announce our new movie within a few days after the release of "Purushothamudu". Our movie is being released by Mythri Movie Distributors in Nizam and Usha Pictures in AP. Our movie "Purushottamudu" is releasing in Tamil Nadu, Karnataka and Odisha as well. Hope you all will watch the movie on 26th of this month.

"పురుషోత్తముడు" హోల్ సమ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అలరిస్తుంది - దర్శకుడు రామ్ భీమన, నిర్మాత డా.రమేష్ తేజావత్

రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "పురుషోత్తముడు". ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో హాసిని సుధీర్ హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. "ఆకతాయి", "హమ్ తుమ్" చిత్రాలతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ భీమన "పురుషోత్తముడు" సినిమాను రూపొందిస్తున్నారు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా వంటి స్టార్ కాస్టింగ్ తో రూపొందిన ఈ సినిమా ఈ నెల 26వ తేదీన ప్రపంచవ్యాప్తం గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో "పురుషోత్తముడు" చిత్ర విశేషాలు తెలిపారు దర్శకుడు రామ్ భీమన, నిర్మాత డా.రమేష్ తేజావత్

దర్శకుడు రామ్ భీమన మాట్లాడుతూ - నేను గతంలో రెండు సినిమాలు ఆకతాయి, హమ్ తుమ్ రూపొందించాను. హమ్ తుమ్ సినిమా పెట్టిన పెట్టుబడికి నిర్మాతకు లాభాలు తీసుకొచ్చింది. ఆకతాయ్ సినిమాలో నిర్మాత అబ్బాయి హీరో వాళ్లు ఎక్కువ ఖర్చు పెట్టి చేశారు. అలా రెండు సినిమాలు చేశాక ఆరేళ్ల గ్యాప్ తర్వాత "పురుషోత్తముడు" మూవీ రూపొందించాను. డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ లాంటి మంచి ప్రొడ్యూసర్స్ నాకు దొరకడం సంతోషంగా ఉంది. వాళ్లు సినిమా క్వాలిటీ కోసం చాలా ఆలోచించి మూవీ నిర్మించారు. "పురుషోత్తముడు" సినిమాను క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందించాను. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, ముఖేష్ ఖన్నా, మురళీ శర్మ లాంటి పెద్ద ఆర్టిస్టులను అనుకుంటే వాళ్లంతా మా మూవీలోకి వచ్చేలా మా ప్రొడ్యూసర్స్ చేశారు. వీళ్లంతా తమ నటనతో కథకు బలాన్ని తీసుకొచ్చారు. ఒక న్యూస్ ఆర్టికల్ చదివి కొన్నేళ్ల కిందట ఈ సినిమా కథ రెడీ చేసుకున్నాను. ఒక కోటీశ్వరుడైన అబ్బాయి పల్లెటూరికి ఎందుకు వచ్చాడు అక్కడ ఏం చేశాడు అనేది "పురుషోత్తముడు" కథ. మహేశ్ బాబు శ్రీమంతుడు లాంటి సినిమాలు ఇలాంటి కథలతో వచ్చాయి కదా అనిపించవచ్చు. మన దగ్గర కథ లైన్ గా అనుకుంటే ఎన్నో సినిమాలు ఒకేలా అనిపిస్తాయి. కానీ ఆ కథలో ఏం చెప్పాం అనేది ముఖ్యం. "పురుషోత్తముడు" సినిమాలో ఇప్పటిదాకా మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాని పాయింట్ ను టచ్ చేశాం. హీరో రాజ్ తరుణ్ తన పూర్తి సపోర్ట్ మూవీకి అందించారు. హీరోయిన్ హాసినీ సుధీర్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఆ అమ్మాయి తన రోల్ పర్పెక్ట్ గా చేసింది. హోల్ సమ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మా మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. మీరంతా చూసి మీ రెస్పాన్స్ తెలియజేస్తారని ఆశిస్తున్నా - అన్నారు.

నిర్మాత డా.రమేష్ తేజావత్ మాట్లాడుతూ- నేను ఆంధ్రా నుంచి ముంబై వెళ్లి చాలాకాలమవుతోంది. అక్కడ బిజినెస్ నడుపుతుంటాను. నాకు సినిమాలంటే ప్యాషన్. బిజినెస్ లో బాగా రాణిస్తున్నా ఒక మంచి తెలుగు సినిమా నిర్మించాలనే కోరిక మనసులో ఉండేది. ఆ కోరిక "పురుషోత్తముడు" సినిమాతో తీరింది. సినిమా నిర్మించడం అంటే ఏదో డబ్బులు ఖర్చు పెట్టేయడం కాకుండా కథా కథనాలు, ఆర్టిస్టుల ఎంపిక, మంచి మ్యూజిక్, సాహిత్యం, టెక్నీషియన్స్ ను సెలెక్ట్ చేసుకోవడం ఇలాంటివన్నీ జాగ్రత్తగా, క్వాలిటీగా చేశాం. మేము పోస్ట్ ప్రొడక్షన్ కోసమే 6 నెలల సమయం వెచ్చించామంటే సినిమా క్వాలిటీ కోసం మేము తీసుకున్న జాగ్రత్త ఎంతో మీరు అర్థం చేసుకోవచ్చు. సినిమా కోసం నిర్మాతలుగా ఎక్కడా రాజీ పడకుండా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాం. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, మురళీ శర్మ, ముఖేష్ ఖన్నా లాంటి పేరున్న ఆర్టిస్టులను కీ రోల్స్ కోసం తీసుకున్నాం. గోపీసుందర్ మ్యూజిక్, చంద్రబోస్, చైతన్య ప్రసాద్, రామజోగయ్య శాస్త్రి వంటి వారి సాహిత్యం మా సినిమాకు ఆకర్షణ కానుంది. హీరో రాజ్ తరుణ్ తన సపోర్ట్ అందించారు. హీరోయిన్ హాసినీ సుధీర్ తెలుగుదనం ఉట్టిపడే అమ్మాయి. ఈ పాత్రకు చాలా బాగుంటుందని తీసుకున్నాం. రాజ్ తరుణ్ కు జోడీగా ఆమె బాగా కుదిరింది. "పురుషోత్తముడు" సినిమా సకుటుంబంగా ప్రేక్షకులంతా హాయిగా చూసేలా ఉంటుంది. ఇందులో ఎక్కడా వల్గారిటీ, చెడు అలవాట్లు చూపించడం వంటివి ఎక్కడా చేయలేదు. మా సంస్థలో ఇకపై వరుసగా సినిమాలు చేయాలనుకుంటున్నాం. "పురుషోత్తముడు" రిలీజైన కొద్ది రోజుల్లోనే మా కొత్త మూవీ ప్రకటిస్తాం. నైజాంలో మా మూవీని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్, ఏపీలో ఉషా పిక్చర్స్ వాళ్లు రిలీజ్ చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, ఒడిశా సహా ఓవర్సీస్ లోనూ మా "పురుషోత్తముడు" సినిమా రిలీజ్ అవుతోంది. మేము గర్వంగా చెప్పుకునే సినిమా "పురుషోత్తముడు" అవుతుంది. ఈ నెల 26వ తేదీన మీరంతా సినిమా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved