pizza

Pushpa netts Rs. 100 crores in Hindi. Only 5th dubbed film to do so!
‘తగ్గేదే లే’.. అంటూ హిందీలో రూ.100 కోట్ల క్ల‌బ్‌లో ‘పుష్ప ది రైజ్’

You are at idlebrain.com > news today >
Follow Us

31 January 2022
Hyderabad

Pushpa The Rise is a true underdog success story. From a film nobody cared to a 100 cr club movie. When the Hindi version of Pushpa The Rise released, it only collected a nett around Rs 3 crores. Every trade pundit has written it off. It went on collecting Rs. 4 crores on Saturday and Rs. 5 crores on Sunday. It was very strong on weekdays too. However, they expected it to fizzle down as there is a biggie called 83 The Film which retells the successful cricket world cup win and it also has a huge star Ranveer Singh in it. The impact of 83 on Pushpa was minimal. It continued to get steady and healthy collections. It has crossed 5th highest dubbed film KGF chapter one (Rs. 44 crores) in no time. They expected it to stop at Rs. 50 crores. And the word of mouth has become so strong that the momentum continued. Then they released Pushpa non-Hindi versions on an OTT platform. Pushpa continued it’s merry way at the box office. Then the Hindi version of Pushpa was also released on the OTT. Pushpa continued collecting more moolah and ended up in the elite club of Rs. 100 crores by 29th January.

Here is the list of Hindi dubbed films that joined the club of 100 crores:

Bahubali 2 - Rs. 511 crores
2.0 - Rs 189 crores
Saaho - Rs. 142 crores
Bahubali 1 - Rs. 118.7 crores
Pushpa 1 - Rs 100 crores

Prabhas leads the list with 3 films. Rajnikanth has one. Allu Arjun is a new entrant. Entire Bollywood went gaga over Pushpa film and Allu Arjun’s performance with their tweets and insta posts/stories.

‘తగ్గేదే లే’.. అంటూ హిందీలో రూ.100 కోట్ల క్ల‌బ్‌లో ‘పుష్ప ది రైజ్’

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘త‌గ్గేదే లే’ అంటూ ‘పుష్ప ది రైజ్’ చిత్రంతో బాక్సాఫీస్ వ‌ద్ద రెచ్చిపోతున్నారు. పాన్ ఇండియా మూవీగా గ‌త ఏడాది డిసెంబ‌ర్ 17న విడుద‌లైన ఈ చిత్రం ఇటు ద‌క్షిణాదిన అటు ఉత్త‌రాదిన కలెక్ష‌న్స్ దుమ్ము రేపుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు రూ.300 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించ‌డం విశేషం. ముఖ్యంగా బాలీవుడ్‌లో పుష్ప సాధిస్తున్న క‌లెక్ష‌న్స్ అక్క‌డి హీరోల‌కు సైతం షాకింగ్‌గా ఉంది. లేటెస్ట్‌గా బాలీవుడ్‌లో పుష్ప మూవీ రూ.100 కోట్ల నెట్ వ‌సూళ్ల‌ను అధిగ‌మించింది.

విడుద‌లైన రోజు రూ.3 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. దీంతో బన్నీ పాన్ ఇండియా మూవీ బాలీవుడ్‌లో తొలి రోజున ఇంతేనా సాధించిందని అనుకున్న‌వాళ్లూ లేక‌పోలేదు. విడుద‌ల స‌మ‌యంలో ఉన్న తొంద‌ర కార‌ణంగా బ‌న్నీ అండ్ టీమ్ బాలీవుడ్‌లో పెద్ద రేంజ్‌లో ప్ర‌మోష‌న్స్ చేయ‌లేదు. అయితే క్ర‌మంగా ‘పుష్ప ది రైజ్’ వ‌సూళ్లు రోజు రోజుకీ పెరుగుతూ వ‌చ్చాయే కానీ.. త‌గ్గ‌లేదు. ఓ తెలుగు సినిమా అందులోనూ బ‌న్నీకి పుష్ప బాలీవుడ్‌లో తొలి సినిమా. అయినా బ‌న్నీ మేనియా ఓ రేంజ్‌లో దూసుకెళ్లింది. డిఫ‌రెంట్ క‌థాంశం, బ‌న్నీ బాడీ లాంగ్వేజ్‌, లుక్‌.. సుకుమార్ టేకింగ్, యాక్ష‌న్ ఎలిమెంట్స్ అన్నీ బాలీవుడ్ ఆడియెన్స్‌కు బాగా న‌చ్చాయి. అలా సినిమా నెమ్మ‌దిగా వ‌సూళ్ల‌ను పెంచుకుంటూ వ‌చ్చి రూ.100 కోట్ల క‌బ్ల్‌లోకి చేరింది.

తెలుగు నుంచి హిందీలోకి డ‌బ్బింగ్ వెర్ష‌న్‌గా విడుద‌లై రూ.100 కోట్ల మైలురాయిని దాటిన ద‌క్షిణాది చిత్రాల్లో ‘పుష్ప ది రైజ్’ ఐదో స్థానాన్ని ఆక్ర‌మించ‌డం విశేషం. ఈ లిస్టులో బాహుబ‌లి ది క‌న్‌క్లూజ‌న్ ముందు వ‌రుస‌లో ఉంది. ఈ చిత్రానికి రూ.510.99 కోట్లు వ‌సూళ్లు వ‌చ్చాయి. త‌ర్వాత సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ 2.0. ఈ సినిమాకు రూ.189.55 కోట్లు వ‌చ్చాయి. త‌ర్వాత స్థానం ప్ర‌భాస్ సాహో చిత్రానిదే. ఈ మూవీకి ర‌రూ.142.95 కోట్లు వ‌చ్చాయి. నాలుగో స్థానంలో బాహుబ‌లి ది బిగినింగ్ నిలిచింది. ఈ చిత్రానికి 118.70 కోట్లు రాగా.. ఐదో స్థానంలో పుష్ప ది రైజ్ నిలిచింది. ఈ చిత్రం 100.38 కోట్లు రావ‌డం విశేషం.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved