pizza

Pushpa 2 creates all time record by collecting 829 crores
ఇండియా మొత్తం పుష్ప-2 రికార్డుల మోత.. ఇండియన్‌ బాక్సాఫీస్‌పై పుష్పరాజ్‌ రూల్‌.. రూ.829 కోట్ల వసూళ్లతో ఇండియన్‌ సినీ చరిత్రలో సరికొత్త రికార్డు!

You are at idlebrain.com > news today >

09 December 2024
Hyderabad

As expected, Pushpa 2 is on a record-breaking spree. Bolstered by positive word of mouth and Allu Arjun’s tour de force performance, the film enjoyed a great Sunday as well.

With the first weekend completed the film’s total worldwide gross stands at a mammoth Rs 829 crores. “BIGGEST INDIAN FILM is the BIGGEST WILDFIRE AT THE BOX OFFICE #Pushpa2TheRule becomes the FASTEST INDIAN FILM to cross 800 CRORES Gross worldwide with a 4 day collection of 829 CRORES. RULING IN CINEMAS,” film’s production house Mythri Movie Makers wrote on X on Monday.

In Hindi, the film continued to make merry at the box office. After emerging as the highest grosser on day one for any film released in Hindi, the film established new records on Sunday as well, setting a tall order for other films to emulate. “A HISTORIC DAY in Indian Cinema. A record breaking day in Hindi #Pushpa2TheRule collected a Nett of 86 CRORES on Sunday creating an all time record of the HIGHEST Hindi collection in a single day,” Mythri added on X. This spectacular rise is particularly striking despite the absence of a holiday release.

In North America as well, there’s no stopping the film. Its total gross stands at $ 9.4 million.

Co-starring Rashmika Mandanna, and Fahadh Faasil in pivotal roles, Pushpa 2 also boasts an ensemble cast including Sunil, Brahmaji, Rao Ramesh, Anasuya Bharadwaj and Jagapathi Babu. Written and directed by Sukumar, Pushpa 2 picks up where its predecessor, Pushpa: The Rise (2021), left off, offering an exhilarating continuation of the gripping saga with high-octane action, captivating performances, and foot-tapping music.

ఇండియా మొత్తం పుష్ప-2 రికార్డుల మోత.. ఇండియన్‌ బాక్సాఫీస్‌పై పుష్పరాజ్‌ రూల్‌.. రూ.829 కోట్ల వసూళ్లతో ఇండియన్‌ సినీ చరిత్రలో సరికొత్త రికార్డు!

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ల పుష్ప-2 ది రూల్‌.. చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తోంది. ఈ సన్సేషన్‌ కాంబినేషన్‌లో అత్యున్నత నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్‌ సుకుమార్‌ రైటింగ్‌ సంస్థతో కలిసి ఈ ఇండియన్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమాను నిర్మించింది. విడుదలకు ముందే ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్‌స్‌ నుంచే సన్సేషనల్‌ బ్లాకబస్టర్‌ అందుకుంది. అల్లు అర్జున్‌ నట విశ్వరూపంకు, సుకుమార్‌ వరల్డ్‌ క్లాస్‌ టేకింగ్‌.. ప్రపంచ సినీ ప్రేమికులు ఫీదా అయిపోయారు. ముఖ్యంగా ఇండియాలో ఈ చిత్రం సృష్టించిన రికార్డుల పరంపరకు ఆకాశమే హద్దుగా ఉంది. సినిమా తొలి రోజు నుంచే మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు వసూళ్లలో వరుసగా ఇండియా ఆల్‌టైమ్‌ రికార్డులు సృష్టించిన ఈ చిత్రం తాజాగా నాలుగు రోజు వసూళ్లలో కూడా రూ. 829 కోట్లు వసూలు చేసి ఇండియా చరిత్రలో ఆల్‌టైమ్‌ రికార్డు సృష్ఠించింది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.829 కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగా 'పుష్ప-2' ది రూల్‌ బాక్సాఫీస్‌పై సరికొత్త అధ్యాయాన్ని క్రియేట్‌ చేసింది. ప్రతి భాషలో సునామీలా దూసుకపోతున్న పుష్ప-2 ముఖ్యంగా బాలీవుడ్‌లో తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. బాలీవుడ్‌లో నాలుగో రోజు ఒక్క రోజులోనే రూ.86 కోట్లు వసూలు చేసి సరికొత్త సంచలనానికి తెరలేపింది. ఇప్పటి వరకు ఏ హిందీ చిత్రం కూడా సింగిల్‌ డేలో 86 కోట్ల నెట్‌ను సాధించలేదు. హిందీలో నాలుగు రోజులకు రూ. 291 కోట్లు కలెక్ట్‌ చేసి, ఇప్పటివరకు ఇంత త్వరగా అంటే కేవలం నాలుగు రోజుల్లోనే 291 కోట్లు కలెక్ట్‌ చేసిన హిందీ చిత్రంగా నిలిచింది. దీంతో పాటు పలు రికార్డులు కూడా పుష్పరాజ్‌ కైవసం చేసుకున్నారు. ఒక రికార్డు ప్రకటించే లోపే మరొ కొత్త రికార్డును పుష్ప-2 సాధిస్తుండటం యావత్‌ భారతీయ సినీ పరిశ్రమను సంభ్రమశ్చర్యాలకు గురిచేస్తుంది. రష్మిక మందన్నా నాయికగా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ అద్భుతమైన బాణీలను అందించాడు. కూబా ఫోటోగ్రఫీ సినిమాకు వన్నెతెచ్చింది. ఈ చిత్రం సాధించిన, సాధిస్తున్న వసూళ్లతో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఇండియా నెంబర్‌వన్‌ హీరోగా అందరూ కొనియాడుతున్నారు. దర్శకుడు సుకుమార్‌ కూడా భారతదేశం గర్వించదగ్గ దర్శకుడిగా టాప్‌ పొజిషన్‌లో ఉన్నాడు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved