pizza

ICON star Allu arjun’s Pushpa2TheRule is now Indian Cinema's INDUSTRY HIT with THE HIGHEST EVER COLLECTION FOR A MOVIE IN INDIA
Icon Star Allu Arjun's 'Pushpa 2: The Rule' creates history by grossing Rs 1,831 Cr in 32 days
ఇండియన్‌ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయం... రూ.1831 కోట్ల వసూళ్లతో భారతీయ సినీ చరిత్రలో రికార్డులను తిరగరాసిన ఐకాన్‌స్టార్‌ పుష్ప-2 ది రూల్‌

You are at idlebrain.com > news today >

06 January 2025
Hyderabad

In an unprecedented triumph, 'Pushpa 2: The Rule' has rewritten the record books by grossing Rs 1831 crores in just 32 days of its release, making it the highest-grossing Indian film of all time in a month's time. The film was released on December 5, 2024, on a huge scale worldwide.

This monumental achievement is a historic moment for Indian cinema. Icon Star Allu Arjun's film has scripted what was believed to be impossible for an Indian film. Director Sukumar is a new sensation and one of the biggest filmmakers in the country now.

The film's phenomenal success surpasses the previous record holder, 'Baahubali 2: The Conclusion', which collected Rs 1810 crores over its entire theatrical run. 'Pushpa 2: The Rule' managed to eclipse this figure in a month, showcasing an extraordinary box office pull.

The film continued the saga from its predecessor, 'Pushpa 1: The Rise'.

Mythri Movie Makers has produced the film in association with Sukumar Writings. Devi Sri Prasad's songs and the rest of the technical output have received love from the audience. The performances by one and all have been showered with praises. Also starring Rashmika Mandanna, Fahadh Faasil and others, 'Pushpa 2' is a box office wonder.

ఇండియన్‌ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయం... రూ.1831 కోట్ల వసూళ్లతో భారతీయ సినీ చరిత్రలో రికార్డులను తిరగరాసిన ఐకాన్‌స్టార్‌ పుష్ప-2 ది రూల్‌

డిసెంబరు 4న ప్రీమియర్స్‌ షోస్‌తో ఇండియన్‌ బాక్సాఫీస్‌పై మొదలైన 'పుష్ప-2' ది రూల్‌ వసూళ్ల రికార్డుల పరంపర సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. కేవలం 32 రోజుల్లోనే భారతీయసినీ చరిత్రలో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కొత్త రికార్డును క్రియేట్‌చేసింది. కేవలం 32 రోజుల్లోనే రూ. 1831 కోట్ల రూపాయాలు వసూలు చేసి పుష్ప ది రూల్‌ భారతీయ సినీ చరిత్రలో తన పేరు మీద తిరగరాసుకుంది. రూ. 1810 కోట్ల రూపాయాలు వసూలు చేసిన బాహుబలి-2 వసూళ్లను క్రాస్‌ చేసి పుష్ప-2 కొత్త రికార్డును క్రియేట్ చేసింది.

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ల కలయికలో రూపొందిన పుష్ప-2 ది రూల్‌..ఈ సన్సేషన్‌ కాంబినేషన్‌లో అత్యున్నత నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్‌ సుకుమార్‌ రైటింగ్‌ సంస్థతో కలిసి ఈ ఇండియన్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమాను నిర్మించింది. విడుదలకు ముందే ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్‌స్‌ నుంచే సన్సేషనల్‌ బ్లాకబస్టర్‌ అందుకుంది. అల్లు అర్జున్‌ నట విశ్వరూపంకు, సుకుమార్‌ వరల్డ్‌ క్లాస్‌ టేకింగ్‌.. ప్రపంచ సినీ ప్రేమికులు ఫీదా అయిపోయారు. ముఖ్యంగా ఇండియాలో ఈ చిత్రం సృష్టించిన రికార్డుల పరంపరకు ఆకాశమే హద్దుగా ఉంది. సినిమా తొలి రోజు నుంచే 32 రోజు వరకు వసూళ్లలో వరుసగా ఇండియా ఆల్‌టైమ్‌ రికార్డులు సృష్టించిన తాజాగా ఈ చిత్రం కేవలం 32 రోజుల్లో 1831 కోట్లు వసూలు చేసి ఇండియా చరిత్రలో ఆల్‌టైమ్‌ రికార్డు సృష్ఠించింది. ఒక రికార్డు ప్రకటించే లోపే మరొ కొత్త రికార్డును పుష్ప-2 సాధించి రికార్డుల సాధించడంలో కూడా ఓ రికార్డును క్రియేట్‌ చేసింది. ఈ చిత్రం యావత్‌ భారతీయ సినీ పరిశ్రమను సంభ్రమశ్చర్యాలకు గురిచేస్తుంది. రష్మిక మందన్నా నాయికగా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ అద్భుతమైన బాణీలను అందించాడు. కూబా ఫోటోగ్రఫీ సినిమాకు వన్నెతెచ్చింది. ఈ చిత్రం సాధించిన, సాధిస్తున్న వసూళ్లతో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఇండియా నెంబర్‌వన్‌ హీరోగా అందరూ కొనియాడుతున్నారు. దర్శకుడు సుకుమార్‌ కూడా భారతదేశం గర్వించదగ్గ దర్శకుడిగా టాప్‌ పొజిషన్‌లో ఉన్నాడు.

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved