pizza

Biggest film 'Pushpa 2: The Rule' amasses Rs 1,700 Cr; Icon Star Allu Arjun's film does it the fastest in Indian history
21 రోజుల్లో రూ.1705 కోట్లు కలెక్ట్‌ చేసిన తొలి భారతీయ చిత్రం ఇండియన్‌ బ్లాక్‌బస్టర్‌ 'పుష్ప-2'

You are at idlebrain.com > news today >

26 December 2024
Hyderabad

India's biggest film, 'Pushpa 2: The Rule', has another feather in the cap. After holding the all-time record of being the fastest 500 Cr, 1000 Cr, 1500 Cr film, it is now the fastest 1700 Cr film in the history of Indian cinema. Icon Star Allu Arjun's film is a scorching sensation to describe which language is not adequate.

Mythri Movie Makers today said that the HIGHEST GROSSER of Indian cinema for the year 2024 continues to topple records. "Ours is the FASTEST INDIAN FILM EVER to collect 1700 CRORES with a gross of 1705 CRORES WORLDWIDE in 21 days," the production house mentioned on social media.

The other day, the film created a new record in Hindi. Pushpa Raj literally introduced the Rs 700 Cr club to Hindi cinema. The powerful sequel, directed by Sukumar is the first-ever film to collect Rs 700 Cr in Hindi.

The wildfire phenomenon called 'Pushpa 2' has truly become a sensation of sorts everywhere. The film's mass action moments, songs, dances, and dialogues have become a rage.

21 రోజుల్లో రూ.1705 కోట్లు కలెక్ట్‌ చేసిన తొలి భారతీయ చిత్రం ఇండియన్‌ బ్లాక్‌బస్టర్‌ 'పుష్ప-2'

ఇండియా మొత్తం పుష్ప-2 రికార్డుల మోత.. ఇండియన్‌ బాక్సాఫీస్‌పై పుష్పరాజ్‌ రూల్‌..కంటిన్యూ

డిసెంబరు 4న ప్రీమియర్స్‌ షో నుంచే ఇండియన్‌ బాక్సాఫీస్‌పై మొదలైన పుష్పరాజ్ రూల్‌.. రోజు రోజుకి అత్యధిక కలెక్షన్లతో కొనసాగుతోంది. ఐకాన్‌ స్టార్‌ నట విశ్వరూపం బ్రిలియంట్‌ అండ్‌ జీనియస్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ అత్యద్భుతమైన టేకింగ్‌..మెస్మరైజింగ్‌ కథ కథనాలు వెరసి.. పుష్ప-2 ది రూల్‌ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామి, సరికొత్త రికార్డుల మోత.. ఇండియన్‌ సినీ చరిత్రలో పుష్ప-2 సరికొత్త అధ్యాయం క్రియేట్‌ చేస్తోంది.

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ల పుష్ప-2 ది రూల్‌.. చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తోంది. ఈ సన్సేషన్‌ కాంబినేషన్‌లో అత్యున్నత నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్‌ సుకుమార్‌ రైటింగ్‌ సంస్థతో కలిసి ఈ ఇండియన్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమాను నిర్మించింది. విడుదలకు ముందే ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్‌స్‌ నుంచే సన్సేషనల్‌ బ్లాకబస్టర్‌ అందుకుంది. అల్లు అర్జున్‌ నట విశ్వరూపంకు, సుకుమార్‌ వరల్డ్‌ క్లాస్‌ టేకింగ్‌.. ప్రపంచ సినీ ప్రేమికులు ఫీదా అయిపోయారు. ముఖ్యంగా ఇండియాలో ఈ చిత్రం సృష్టించిన రికార్డుల పరంపరకు ఆకాశమే హద్దుగా ఉంది. సినిమా తొలి రోజు నుంచే కంటిన్యూగా వసూళ్లలో వరుసగా ఇండియా ఆల్‌టైమ్‌ రికార్డులు సృష్టించిన ఈ చిత్రం తాజాగా 21 రోజుల్లో రూ.1705 కోట్ల రూపాయాలు సాధించి ఇండియన్‌ సినిమా చరిత్రలోనే అత్యంత వేగవంతగా రూ.1700 కోట్లు కలెక్ట్‌ చేసిన తొలి చిత్రంగా సరికొత్త రికార్డును నెలకొల్పింది.


కేవలం 21 రోజుల్లోనే రూ.1705 కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగా 'పుష్ప-2' ది రూల్‌ బాక్సాఫీస్‌పై సరికొత్త అధ్యాయాన్ని క్రియేట్‌ చేసింది. ప్రతి భాషలో సునామీలా దూసుకపోతున్న పుష్ప-2 ముఖ్యంగా బాలీవుడ్‌లో తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. బాలీవుడ్‌లో ఇప్పటి వరకు రూ. 700 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసి వందేళ్ల బాలీవుడ్‌ చరిత్రలోనే సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తోంది.

ఒక రికార్డు ప్రకటించే లోపే మరొ కొత్త రికార్డును పుష్ప-2 సాధిస్తుండటం యావత్‌ భారతీయ సినీ పరిశ్రమను సంభ్రమశ్చర్యాలకు గురిచేస్తుంది. రష్మిక మందన్నా నాయికగా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ అద్భుతమైన బాణీలను అందించాడు. కూబా ఫోటోగ్రఫీ సినిమాకు వన్నెతెచ్చింది. ఈ చిత్రం సాధించిన, సాధిస్తున్న వసూళ్లతో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఇండియా నెంబర్‌వన్‌ హీరోగా అందరూ కొనియాడుతున్నారు. దర్శకుడు సుకుమార్‌ కూడా భారతదేశం గర్వించదగ్గ దర్శకుడిగా టాప్‌ పొజిషన్‌లో ఉన్నాడు. ఆయన దర్శకత్వ ప్రతిభకు అంతర్జాతీయంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved