‘Padhe Padhe’ - The Second Single from "Rākāsā" Brings a Soulful Blend of Classical Grace and Tender Romance
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మించిన ‘రాకాస’ నుంచి మనసుని హత్తుకునే ‘పదే పదే’ అంటూ సాగే మెలోడీ సాంగ్ రిలీజ్
The makers of *Rākāsā* have unveiled the film’s second single, *“Padhe Padhe,”* introducing audiences to a soothing romantic melody that captures the gentle emotions of love slowly finding its voice. Sung by *Sindhuja Srinivasan*, composed by *Anudeep Dev*, and written by lyricist *Kittu Vissapragada*, the track adds a heartfelt dimension to the film’s growing musical journey. Presented as a lyrical video featuring *Sangeeth Sobhan* and *Nayan Sarika*, *“Padhe Padhe”* offers listeners an emotional glimpse into a moment where affection quietly begins to surface between the film’s lead characters.
What makes *“Padhe Padhe”* stand out is its elegant musical design that blends classical texture with a contemporary melodic flow. Composer *Anudeep Dev* introduces the gentle sound of the *veena* into the arrangement, adding a graceful classical flavour that enriches the song’s emotional depth. This traditional instrumentation moves smoothly over a soft urban melodic groove, creating a relaxed rhythmic structure that allows the melody to unfold naturally. Lyricist *Kittu Vissapragada* shapes the song around the delicate experience of expressing love through hints rather than direct confession, capturing the inner voice of someone who keeps finding small reasons to move closer to the person they care for, hoping their feelings will eventually be understood. Complementing this emotional core, singer *Sindhuja Srinivasan* brings warmth and sincerity through her expressive vocal performance, giving the composition a gentle intimacy that enhances the song’s tender romantic mood.
Headlined by *Sangeeth Sobhan*, who has recently cemented his popularity with the youth-centric successes *MAD* and *MAD Square*, *Rākāsā* places him alongside *Nayan Sarika* in a story that blends romance, humour and fantastical elements. The film also features a lively ensemble that includes *Vennela Kishore, Brahmaji, Tanikella Bharani, Ashish Vidyarthi,* and *Getup Srinu*. The project is written and directed by *Manasa Sharma*, who first earned recognition through her work as the creator and writer of *Oka Chinna Family Story* and later as the director of *Bench Life*.
On the technical side, the film is supported by a seasoned crew shaping its visual tone and musical atmosphere. *Anudeep Dev* composes the soundtrack, bringing together melody and thematic mood for the film’s narrative. Cinematography is handled by *Raju Edurolu*, while *Anwar Ali* oversees editing. The production is mounted by *Niharika Konidela* under the banner *Pink Elephant Pictures* in collaboration with *Zee Studios*, with *Umesh Kumar Bansal* backing the film as producer.
The film’s promotional campaign has already begun to attract notable digital traction. The *title glimpse* has crossed *1.9 million views*, while the teaser has generated strong online engagement, moving past *2.8 million views*. The first single *“Rapappa”* has also performed strongly, crossing *1.1 million views on YouTube*. With the arrival of the second single *“Padhe Padhe,”* the soundtrack now reveals a softer romantic dimension, expanding the musical identity of the film and further strengthening audience curiosity around the project.
Beyond the domestic market, *Rākāsā* is preparing for a significant overseas rollout. The film will be released across more than *350 international screens* through *Atharvana Bhadrakali Pictures*, covering major territories including the *USA, the United Kingdom, Europe, Canada,* and *Australia*. Distribution in *North America* will be managed by *Prathyangira Cinemas*, while the film’s songs are being released under the reputed *Saregama* label.
With each promotional step steadily widening the film’s reach from teaser engagement to the growing response for its songs, *Rākāsā* continues to build momentum as it approaches its *worldwide theatrical release on April 3, 2026*.
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మించిన ‘రాకాస’ నుంచి మనసుని హత్తుకునే ‘పదే పదే’ అంటూ సాగే మెలోడీ సాంగ్ రిలీజ్
`పదే పదే ప్రాణం నిన్నే కోరగా
కలే నిజం కాదా నిన్ను చేరగా
ఒకే ఒక ఆశ చాలుగా నువ్వే చాలుగా
ప్రపంచమే లేదే ప్రతీ క్షణం నువ్వే నా కథ`
అంటూ అమ్మాయి తన మనసులోని ప్రేమను అబ్బాయికి చెప్పటానికి ఎంతో ఆశతో, ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇంతకీ అమ్మాయి మనసులో ప్రేమను సంపాదించుకున్న అబ్బాయి కథేంటో తెలుసుకోవాలంటే రాకాస సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్..
ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ ఎన్నో అవార్డుల్ని, రివార్డుల్ని అందుకుంది. అలాంటి ఓ అద్భుతమైన సినిమా తరువాత జీ స్టూడియోస్ సమర్పణలో నిహారిక తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాతగా ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు.
ఇప్పటి వరకు ‘రాకాస’ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్, గ్లింప్స్, టీజర్, సాంగ్ అన్నీ కూడా జనాల్లో క్యూరియాసిటీని పెంచేశాయి. ప్రస్తుతం మ్యూజికల్ ప్రమోషన్స్‌లో టీం బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ‘పదే పదే’ అంటూ సాగే ఓ మెలోడీ సాంగ్‌ను తాజాగా రిలీజ్ చేసింది. ఈ లిరికల్ వీడియో సాంగ్‌ని చూస్తుంటే హీరో మీద హీరోయిన్‌కి ఉన్న ప్రేమ, వన్ సైడ్ లవ్ స్టోరీ కనిపిస్తోంది. హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ, వారి ప్రేమను చాటేలా సాంగ్ సాగింది. ఇక గ్రామీణ వాతావరణంలో చిత్రీకరించిన ఈ పాటలోని విజువల్స్ మనసుని హత్తుకునేలా ఉన్నాయి.
అనుదీప్ దేవ్ అందించిన బాణీ, కిట్టు విస్సాప్రగడ సాహిత్యం, సింధూజ శ్రీనివాసన్ గాత్రం ఈ పాటను మరింత ప్రత్యేకంగా, గుండెల్ని హత్తుకునేలా మార్చేశాయి. ఈ చిత్రానికి రాజు ఎదురోలు సినిమాటోగ్రఫర్‌గా, ఎడిటర్‌గా అన్వర్ అలీ పని చేశారు. ఈ మూవీ ఆడియో హక్కుల్ని సరిగమ సంస్థ సొంతం చేసుకుంది. ఈ సినిమాని ఓవర్సీస్‌లో అథర్వణ భద్రకాళి పిక్చర్స్, కెనడాలో ప్రత్యంగిరా సినిమాస్ ఏప్రిల్ 3న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు.
సాంకేతిక వర్గం: బ్యానర్స్: జీ స్టూడియోస్, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ l నిర్మాతలు: నిహారిక కొణిదెల, ఉమేష్‌కుమార్ బన్సాల్ l కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: మానస శర్మ l ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మన్యం రమేష్ l ఆడిషన్ స్క్రీన్ ప్లే: మహేష్ ఉప్పాల l సంగీతం: అనుదీప్ దేవ్ l సినిమాటోగ్రాఫర్: రాజు ఎదురోలు l యాక్షన్ కొరియోగ్రాఫర్: విజయ్ l ఎడిటర్: అన్వర్ అలీ l ప్రొడక్షన్ డిజైనర్: రామాంజనేయులు l ఆర్ట్ డైరెక్టర్: పుల్ల విష్ణు వర్ధన్ l కాస్ట్యూమ్ డిజైనర్: సంధ్య సబ్బవరపు l పి.ఆర్.ఒ: ఎస్.కె.నాయుడు-ఫణి కందుకూరి (బియాండ్ మీడియా) l ఈవెంట్ పార్ట్‌నర్: యు వుయ్ మీడియా l మార్కెటింగ్: టికెట్ ఫ్యాక్టరీ.