Raju Weds Rambai is connecting with audiences on a deep emotional level: producer and distributor Bunny Vas at the film’s success meet
"రాజు వెడ్స్ రాంబాయి" సినిమాకు ప్రేక్షకులంతా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు - సక్సెస్ మీట్ లో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్
Starring Akhil Raj and Tejaswini as the lead pair, Raju Weds Rambai released today and emerged as a resounding success. Both audiences and critics are praising it as a heart-touching love story. Presented by Dr. Nageshwar Rao Poojari, the film is produced by Venu Udugula and Rahul Mopidevi under the banners Dolamukhi Subaltern Films and Monsoons Tales. It is directed by Sailu Kompati. The film was brought to theatres on a grand scale by Vamsi Nandipati Entertainments and Bunny Vas Works. Following its success, the team held a success meet in Hyderabad.
ETV Win Creative Producer Tanmay said, “We put two years of effort into Raju Weds Rambai. Today, the audience gave us the reward we hoped for. Our director Sailu brought this love story to the screen with honesty.”
Presenter Dr. Nageshwar Rao Poojari said, “The audience has made our film a grand success. Every young couple should watch this film. It’s a must-watch for families too. Seeing the response in theatres makes me very happy. From the moment the teaser released, I knew this film would do well. This is one of the most intense love stories to come in recent times.”
Director Saailu Kampati said, “I’m speechless with the success of our film. The credit for this platform and this success goes to ETV Win’s Sai and Nithin. They supported me like brothers. Their passion is completely for the film. With people who have such passion, many newcomers will get opportunities. I feel incredibly grateful to the media. Thank you to everyone.”
Music director Suresh Bobbili said, “When the song ‘Rambai Neemeedha Naku’ became a hit, I prayed that the film would also become a big success. When a movie succeeds, it adds two to three years of life to a technician’s career. I’m grateful to the audience for supporting the film.”
Editor Naresh Adupa said, “Thanks to everyone who watched and appreciated our film. For those who haven’t watched it yet, please do. Every member of our unit made this film with love. The hard work of our entire team shows that audiences always support good cinema.”
Actor Chaitanya Jonnalagadda said, “I’ve been following the talk since morning. Even though my team said it’s a super hit, I kept asking again and again to confirm. The audience is responding strongly to my character Venkanna - they’re even disliking me for it. Vasu sir told me before release that this role would be memorable in my career, and today his words came true.”
Producer Rahul Mopidevi said, “We believed this story would work well with audiences in theatres, and that belief has come true. Thank you to the audience and the media for supporting us.”
Heroine Tejaswini said, “Audiences are connecting with every emotion in Raju Weds Rambai. They’re enjoying the fun and getting emotional too. One of my friends called and said she cried out of happiness after watching it. The response we’re receiving shows the film’s success. Everywhere we visit, theatres are filled with excitement.”
Hero Akhil Raj said, “My ten years of struggle finally paid off with this film. I’ve been emotional since morning. On BookMyShow, 2,000 tickets are being booked every hour - this proves our film’s success. When I go to theatres, I can see the audience enjoying it. This is what I’ve been dreaming of all these years. We’ll meet audiences across all regions personally.”
Producer Venu Udugula said, “During promotions, we said the last 30 minutes of the film would be hard-hitting, and some thought it was just a publicity stunt. But now, the same people are calling it a good film. We are always ready to face criticism, but we never speak low of others. Audiences are saying the film is emotional and mind-blowing. Reviews are positive and trade analysts predict this trend will continue. ETV Win has set a benchmark in bringing small films to the masses.”
ETV Win Head Sai Krishna said, “We got more excited about the film after hearing Suresh Bobbili’s songs. That’s when we decided the film must release theatrically. Bapineedu garu strongly believed in bringing it to theatres. Lower ticket prices also helped our film.”
ETV Win Content Head Nithin said, “Those who doubted what a newcomer can do are now getting their answer with the theatre response. From today, our film has begun its triumphant run. Thanks to the entire team.”
Producer and distributor Vamshi Nandipati said, “For every release, I personally check the response at theatres. I did the same for Raju Weds Rambai, and I saw people connecting emotionally with the story. The love and support from the audience gives us the energy to make many more good films. Thanks to Bapinidu garu, who first believed in this project.”
Producer and distributor Bunny Vaas said, “Everyone is owning Raju Weds Rambai as their own. Lovers, fathers who oppose their children’s relationships - everyone is connecting to this story. Director Sailu made the film with honesty and purity. Suresh Bobbili’s music elevated it to another level. ETV Win has once again succeeded in encouraging new talent. The film’s success should first be enjoyed by the producers and the director. Our attempt was to bring this beautiful film as close as possible to audiences through a theatrical release. Some people felt emotional watching the scene where the father hits his daughter - I felt it too. But even there, the father’s action comes from love. Akhil and Tejaswini performed wonderfully; Chaitanya impressed as Venkanna. We succeeded once again in identifying great content.”
TECHNICAL CREW
Costume Designers – Priyanka Veeraboyina, Aarthi Vinnakota
Sound Design – Pradeep G.
Publicity Designer – Dhani Aelay
Production Design – Gandhi Nadikudikar
Executive Producer – Dhana Gopi
Cinematography – Wajid Baig
Music – Suresh Bobbili
Editing – Naresh Adupa
Co-Producers – Dolamukhi Subaltern Films, Monsoons Tales
Producers – Venu Udugula, Rahul Mopidevi
Writer & Director – Saailu Kampati
Production – ETV Win Originals Production
Theatrical Release – Vamsi Nandipati (Vamsi Nandipati Entertainments), Bunny Vas (Bunny Vas Works)
"రాజు వెడ్స్ రాంబాయి" సినిమాకు ప్రేక్షకులంతా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు - సక్సెస్ మీట్ లో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్
అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన "రాజు వెడ్స్ రాంబాయి" సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని దక్కించుకుంది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకులు, క్రిటిక్స్ ఈ సినిమాకు ప్రశంసలు అందిస్తున్నారు. "రాజు వెడ్స్ రాంబాయి" చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చారు. "రాజు వెడ్స్ రాంబాయి" విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఈ చిత్ర సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు.
ఈటీవీ విన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ తన్మయ్ మాట్లాడుతూ - "రాజు వెడ్స్ రాంబాయి" సినిమా వెనక మా రెండేళ్ల కష్టం ఉంది. ఈ రోజు ఆ కష్టానికి తగిన ఫలితాన్ని ప్రేక్షకులు ఇచ్చారు. మా డైరెక్టర్ సాయిలు ఈ ప్రేమ కథను ఎంతో నిజాయితీగా తెరపైకి తీసుకొచ్చారు. అన్నారు.
చిత్ర సమర్పకులు డా.నాగేశ్వరరావు పూజారి మాట్లాడుతూ - మా చిత్రాన్ని ప్రేక్షకులు గ్రాండ్ సక్సెస్ చేశారు. ఈతరంలోని ప్రతి ప్రేమ జంట చూడాల్సిన చిత్రమిది. ప్రతి కుటుంబం చూడాల్సిన సినిమా ఇది. థియేటర్స్ లో ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. మా సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడే ఈ మూవీ రిజల్ట్ గురించి చెప్పాను. ఇటీవల కాలంలో వచ్చిన ఇంటెన్స్ లవ్ స్టోరీ ఇదే. అన్నారు.
డైరెక్టర్ సాయిలు కంపాటి మాట్లాడుతూ - మా మూవీ సక్సెస్ తో మాటలు రావడం లేదు. నాకు ఈ వేదికను, ఈ సక్సెస్ ను ఇచ్చిన క్రెడిట్ ఈటీవీ విన్ సాయి, నితిన్ గారిదే. ఈ జర్నీలో నాకు బ్రదర్ లా సపోర్ట్ ఇచ్చారు. వారి తపన అంతా సినిమా కోసమే. సినిమా మీద ప్యాషన్ ఉన్న ఇలాంటి వాళ్లు ఉంటే ఎంతోమంది కొత్త వాళ్ల జీవితాలు బాగుపడతాయి. అమీర్ పేట చౌరస్తాలో బ్యాండ్ కొడతా. మీడియా మిత్రులకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ - రాంబాయి పాట హిట్ అయినప్పుడు సినిమా కూడా పెద్ద సక్సెస్ కావాలని ఎంతోమంది దేవుళ్లకు మొక్కుకున్నా. ఎందుకంటే ఒక సినిమా హిట్ అయితే టెక్నీషియన్ కు రెండు మూడేళ్లు కెరీర్ లైఫ్ పెరుగుతుంది. ఈ సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులుక కృతజ్ఞతలు. అన్నారు.
ఎడిటర్ నరేష్ అడుపా మాట్లాడుతూ - మా సినిమాను చూసి ఆదరిస్తున్న వారికి థ్యాంక్స్. ఇంకా చూడని వారు ఉంటే చూడమని కోరుతున్నా. మా యూనిట్ మెంబర్స్ అంతా ప్రేమించి చేసిన చిత్రమిది. మా సినిమా మా అందరి హార్డ్ వర్క్ ఉంది. కష్టపడి చేసిన మంచి సినిమాకు ఆదరణ ఉంటుందని మరోసారి ప్రూవ్ అయ్యింది. అన్నారు.
యాక్టర్ చైతన్య జొన్నలగడ్డ మాట్లాడుతూ - మార్నింగ్ నుంచి మా మూవీ టాక్ తెలుసుకుంటూనే ఉన్నా. సినిమా సూపర్ హిట్ అని మా వాళ్లు చెప్పినా మళ్లీ మళ్లీ అడిగి కన్ఫర్మ్ చేసుకున్నా. నేను చేసిన వెంకన్న పాత్రకు ప్రేక్షకులు బాగా రెస్పాండ్ అవుతున్నారు. నన్ను ద్వేషిస్తున్నారు. రిలీజ్ ముందే మా వాసు గారు ఈ సినిమా నీ కెరీర్ లో గుర్తుండిపోతుందని చెప్పిన మాట ఈ రోజు నిజమైంది. అన్నారు.
ప్రొడ్యూసర్ రాహుల్ మోపిదేవి మాట్లాడుతూ - ఈ స్టోరీ థియేటర్స్ లో ప్రేక్షకులకు నచ్చుతుంది అని మేము పెట్టుకున్న నమ్మకం నిజమైంది. అందుకు ప్రేక్షకులతో పాటు మాకు సపోర్ట్ గా నిలిచిన మీడియా మిత్రులకు థ్యాంక్స్. అన్నారు.
హీరోయిన్ తేజస్వినీ మాట్లాడుతూ - "రాజు వెడ్స్ రాంబాయి" సినిమాలోని ప్రతి ఎమోషన్ కు ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. ఫన్ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఎమోషన్ కు గురవుతున్నారు. లవ్ ను ఫీల్ అవుతున్నారు. మా స్నేహితురాలు ఫోన్ చేసి ఈ సినిమా చూశాక ఆనందంతో కన్నీళ్లు వచ్చాయని చెప్పింది. ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ మా సినిమా విజయానికి నిదర్శనం. మేము వెళ్లిన ప్రతి థియేటర్ లోనూ ఆడియెన్స్ సందడి కనిపిస్తోంది. అన్నారు.
హీరో అఖిల్ రాజ్ మాట్లాడుతూ - నేను పడిన పదేళ్ల కష్టం ఈ సినిమాతో దక్కింది. ఉదయం నుంచి ఎమోషనల్ గా ఉన్నాను. బుక్ మై షో లో గంటకు 2 వేల టికెట్స్ బుక్ అవుతున్నాయి. మా సినిమా సక్సెస్ కు ఇదే ప్రూఫ్. థియేటర్స్ లోకి వెళ్లి చూస్తే ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఇన్నేళ్లు కోరుకున్నది, చూడాలనుకున్నది ఇదే అనిపించింది. మీ దగ్గరకు మేమంతా వస్తాం, ప్రతి ప్రాంతంలోని థియేటర్స్ కు వచ్చి ప్రేక్షకుల్ని పలకరిస్తాం. అన్నారు.
ప్రొడ్యూసర్ వేణు ఊడుగుల మాట్లాడుతూ - "రాజు వెడ్స్ రాంబాయి" సినిమా చివరి 30 నిమిషాలు హార్డ్ హిట్టింగ్ గా ఉంటుందని మేము ప్రమోషన్ లో చెబితే అది పబ్లిసిటీ స్టంట్ అని కొందరు అన్నారు. అలా అన్న వారే ఇప్పుడు మంచి సినిమా అని అంటున్నారు. మేము ఓడిపోయేందుకు కూడా రెడీ గానీ దిగజారి మాట్లాడము. మా సినిమా ఎమోషనల్ గా ఉంది, మైండ్ బ్లోయింగ్ గా ఉందని ప్రేక్షకులు చెబుతున్నారు. రివ్యూస్ పాజిటివ్ గా వస్తున్నాయి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందని ట్రేడ్ వాళ్లు చెబుతున్నారు. చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడంలో ఈటీవీ విన్ ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. అన్నారు.
ఈటీవీ విన్ హెడ్ సాయి కృష్ణ మాట్లాడుతూ - రాజు వెడ్స్ రాంబాయి ప్రాజెక్ట్ మా దగ్గరకు వచ్చినప్పటి కంటే ఆ సినిమాకు సురేష్ బొబ్బిలి చేసిన సాంగ్స్ విన్నప్పుడే ఎక్కువ ఎగ్జైట్ అయ్యాం. ఈ సినిమాను థియేట్రికల్ గా రిలీజ్ చేయాలని సురేష్ బొబ్బిలి సాంగ్స్ విన్నప్పుడు ఫిక్స్ అయ్యాం. ఈ సినిమాను థియేట్రికల్ గా తీసుకురావాలని గట్టిగా నమ్మిన వ్యక్తి బాపినీడు గారు. తక్కువ టికెట్ రేట్స్ పెట్టడం కూడా మా మూవీకి కలిసొచ్చింది. అన్నారు.
ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ మాట్లాడుతూ - ఊరోడు సినిమా ఏం చేస్తాడు అని అన్న వాళ్లకు ఈ రోజు థియేటర్స్ లో వస్తున్న రెస్పాన్స్ సమాధానం ఇస్తోంది. ఈ రోజు నుంచి మా మూవీ బ్యాండ్ కొట్టడం మొదలైంది. మా మూవీకి వర్క్ చేసిన టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ - ఏ సినిమా రిలీజైనా థియేటర్స్ దగ్గర రెస్పాన్స్ తెలుసుకుంటాను. "రాజు వెడ్స్ రాంబాయి" సినిమాకు కూడా అలా వెళ్లి చూశాను. ప్రతి ఒక్కరూ కథకు రిలేట్ అవుతున్నారు. ఎమోషనల్ అవుతున్నారు. ప్రేక్షకులు ఇస్తున్న ఆదరణ, ప్రేమే మాకు ఇలాంటి మరెన్నో మంచి చిత్రాలు చేసే ఎనర్జీని, సపోర్ట్ ను అందిస్తోంది. ఈ సినిమాను ఫస్ట్ నమ్మిన బాపినీడు గారికి థ్యాంక్స్. అన్నారు.
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్ మాట్లాడుతూ - "రాజు వెడ్స్ రాంబాయి" సినిమాను ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకుంటున్నారు. ప్రేమలో ఉన్న అమ్మాయి, అబ్బాయి, ఆ ప్రేమను వద్దనే తండ్రి ప్రతి ఒక్కరూ ఈ కథకు కనెక్ట్ అవుతున్నారు. ఊరి నుంచి వచ్చిన డైరెక్టర్ సాయిలు తనలోని నిజాయితీ, ఆ ఫ్యూరిటీతో సినిమా రూపొందించాడు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ మూవీని మరో స్థాయికి తీసుకెళ్లింది. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయడంలో ఈటీవీ విన్ వారు మరోసారి సక్సెస్ అయ్యారు. ఈ సినిమా సక్సెస్ ను ఫస్ట్ ఎంజాయ్ చేయాల్సింది మూవీ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్. ఇలాంటి మంచి చిత్రాన్ని థియేట్రికల్ గా ప్రేక్షకుల దగ్గరకు వీలైనంత బాగా చేరువ చేయడానికే ప్రయత్నించాం. ఈ సినిమాలో హీరోయిన్ ను తండ్రి కొట్టే సీన్ ను చూసి కొందరు బాధపడ్డారు. నేనూ బాధపడ్డా. అయితే ఆ తండ్రి కూతురుని దండించడంలోనూ ప్రేమే ఉంది. హీరో హీరోయిన్లు అఖిల్, తేజస్వినీ బాగా పర్ ఫార్మ్ చేశారు. చైతన్య వెంకన్న రోల్ లో ఆకట్టుకున్నాడు. సినిమా కంటెంట్ ను జడ్జ్ చేయడంలో మేమంతా మరోసారి సక్సెస్ అయ్యాం. అన్నారు.