pizza

“Raju Weds Rambai” is a beautiful love story that touches your heart: Actor Adivi Sesh at the trailer launch
"రాజు వెడ్స్ రాంబాయి" మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ - ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

You are at idlebrain.com > news today >

14 November 2025
Hyderabad

Akhil and Tejaswini star as the lead pair in the film Raju Weds Rambai. The movie is being presented to the audience by ETV Win Originals Production. Under the presentation of Dr. Nageshwar Rao Pujari, the film is produced by Dolamukhi Subaltern Films and Monsoons Tales, with Venu Udugula and Rahul Mopidevi as producers. The film is directed by Saailu Kompati. On November 21, “Raju Weds Rambai” will have a grand theatrical release under the banners of Vamsi Nandipati Entertainments and Bunny Vas Works, headed by Vamsi Nandipati and Bunny Vas. The trailer launch event was held on Thursday in Hyderabad, with actor Adivi Sesh attending as the chief guest.

Lyricist Mittapalli Surender said, “I thank the audience for making the song Rambai Neemeedha Naaku a big hit. The same song appears as the title track in the movie. I wrote the entire song in one night. I got the opportunity to express the deep emotions of the story through this song.”

Music director Suresh Bobbili said, “Thanks to everyone who made the Rambai title song trend nationwide in the top 2 on social media. Along with this song, several others in the film will also entertain you. Through this movie, we want to convey many things to you. Please come to theatres on the 21st of this month, watch the film, and bless our team.”

Actor Chaitu Jonnalagadda said, “The trailer shows only a small sample of what our film is like. I played the role of Venkanna, the heroine's father. While watching the film, you will laugh, feel sad, and get emotional. You will definitely hate my character Venkanna and the more you hate it, the happier I feel. Akhil and Tejaswini performed very well. This film will bring them a good name.”

Actor Shivaji Raja said, “This is not a small film. The movie has strong support from ETV Win, Bunny Vas, and Vamsi Nandipati. The song Rambai Neemeedha Naaku became a sensational hit. This movie will also become a big hit by the end of the year. If I didn’t believe that, I wouldn’t say it. I’m happy that Sesh has come to support this movie.”

Producer Bunny Vas said, “We often celebrate stories like Romeo and Juliet and Laila Majnu, but this is a story that happened on our own Telugu soil. After watching the film’s climax, I couldn’t sleep for two days. Rambai kept haunting my mind. You will feel the same emotion once you watch it. Contrary to what some think, this story is not about honour killing. What this couple faced is even more brutal. We are bringing this story to the audience so that these buried truths come to light. This movie will stay in our hearts forever.”

Presenter Dr. Nageshwar Rao Pujari said, “Today’s youth give many names to love, but real love is living for each other and being ready even to die for each other. You will see such pure love in our film. The Rambai song became a big hit, and we hope the film gets the same success.”

Producer Rahul Mopidevi said, “We watch many love stories on screen and forget them, but some are based on true incidents. After watching Raju Weds Rambai, you’ll understand how lovers should correct their mistakes and stand by each other through the toughest situations. There is a lot to learn from this movie, and I am confident you will like it.”

Director Venu Udugula said, “The response to the trailer is very good. This is a timeless love story. Some people are deliberately spreading negativity, questioning scenes like the girl being slapped. How can one judge a film based only on a few moments from the trailer? This movie is not made with additions or deletions - it is made with honesty. Breaking barriers of caste, religion, and money, Raju and Rambai will be coming to theatres on the 21st of this month. Those criticizing the trailer will get their answer from the film itself.”

Director Saailu Kampati said, “When I first showed the story to Venu anna, he said it wasn’t in the proper script format. I didn’t know how to format a script, but I knew exactly how to show the emotion, how the beginning, interval, and climax should be, and how the film should be made. That’s how I made it. I thank Venu Udugula anna for giving me this opportunity. Later, ETV joined along with everyone else. The location and shooting conditions were new to all our artists, but they worked hard. Akhil, Tejaswini, Chaitu Jonnalagadda—everyone worked with passion. Suresh Bobbili anna brought life to our film with his music.”

ETV Win’s Sai Krishna said, “Adivi Sesh once tweeted in support of the movie Anaganaga on ETV Win, and the film received great audience appreciation. After that, we brought films like 90’s, Air, and Little Hearts. Now we are bringing Raju Weds Rambai to you. This is a film you will never forget.”

ETV Win’s Nithin said, “This movie has faced many struggles. Each time it faced a challenge, it became better. Wherever there is a good film, Sesh garu always comes forward to support it. Some people are criticising the trailer, saying it’s anti-feminism or pushing some ‘ism.’ This film is not about any ideology - it is about the truth. On the 21st of this month, we are bringing to theatres a love story that was buried for 15 years. You will see a girl who endures everything for love, a father who stands in the way of that love, and a lover who will go to any extent for it.”

Producer Vamsi Nandipati said, “When I decided to make this movie, many people tried to discourage me. The more they pushed me away from this project, the more determined I became. The climax emotionally moved me. If this climax does not shake you, I will stop making films. Just like 7/G Brindavan Colony and Premisthe inspired me to enter filmmaking, you too will feel inspired after watching this film. This is a love story that comes from the grassroots. Thanks to Adivi Sesh, the ‘Indian James Bond,’ for coming to support us.”

Actor Adivi Sesh said, “I watched the trailer and some scenes, and I know the story. I’m here to promote good content. Just like Care of Kancharapalem held silent premieres across multiple places, I suggest you do the same for this film in the coming week. Then, by release time, the audience will come searching for it. This is such a good movie. Akhil, Tejaswini, and Chaituu have acted wonderfully. I’ll even offer a role to Chaitu Jonnalagadda in my film. In this era of social media where people think only about viral content, bringing a pure love story to the audience is not easy. Apps may change, but love never changes. This is a genuinely made, beautiful, heart-touching love story.”

Heroine Tejaswini said, “I began my career with short films in 2019, and it took six years to reach this stage. I feel lucky to play the role of Rambai. I believe you liked our songs and trailer. The emotion in the trailer connecting with you makes us very happy. Many love stories come and go, but Raju Weds Rambai is different. This is a love story that will stay in your hearts.”

Hero Akhil Uddemari said, “I’ve been struggling for 10 years for a chance in films. Many offers came close and slipped away. Getting the role of Raju in Raju Weds Rambai made me forget all that pain. After watching our trailer, some asked why Raju slaps the girl. But just as Raju loves Rambai deeply, I urge you to love the Rambai in your life just as much. Raju is a great lover, and I want to be like Raju in my life too. I’ll never forget Sesh anna coming to support us. Please come to theatres on the 21st to watch the film.”

"రాజు వెడ్స్ రాంబాయి" మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ - ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. "రాజు వెడ్స్ రాంబాయి" చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 21న "రాజు వెడ్స్ రాంబాయి" సినిమాను వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. గురువారం హైదరాబాద్ లో హీరో అడివి శేష్ అతిథిగా ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

లిరిసిస్ట్ మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ - "రాజు వెడ్స్ రాంబాయి"లో రాంబాయి నీ మీద నాకు పాటను పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. సినిమాలో టైటిల్ సాంగ్ గా ఈ పాట వస్తుంది. ఒక్క నైట్ లోనే ఈ పాట మొత్తం రాశాను. కథలోని లోతైన భావాలను ఈ పాటలో వ్యక్తీకరించే అవకాశం కలిగింది. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ - రాంబాయి టైటిల్ సాంగ్ ను సోషల్ మీడియాలో ఇండియా వైడ్ టాప్ 2 లో ట్రెండ్ అయ్యేలా చేసిన ప్రేక్షకులు అందరికీ థ్యాంక్స్. ఈ పాటతో పాటు మరిన్ని సాంగ్స్ మిమ్మల్ని ఆకట్టుకోబోతున్నాయి. ఈ సినిమా ద్వారా మీకు చాలా విషయాలు చెప్పబోతున్నాం. ఈ నెల 21న థియేటర్స్ కు వచ్చి సినిమా చూసి మా టీమ్ ను బ్లెస్ చేయండి. అన్నారు.

నటుడు చైతు జొన్నలగడ్డ మాట్లాడుతూ - మా సినిమా ఎలా ఉంటుందో ట్రైలర్ లో చిన్న శాంపిల్ మాత్రమే చూపించాం. ఈ సినిమాలో నేను హీరోయిన్ తండ్రి వెంకన్న అనే క్యారెక్టర్ లో నటించాను. "రాజు వెడ్స్ రాంబాయి" సినిమా చూస్తూ మీరు నవ్వుతారు, బాధపడతారు, ఎమోషన్ కు గురవుతారు. ఈ చిత్రంలో నేను చేసిన వెంకన్న క్యారెక్టర్ ను మీరంతా ద్వేషిస్తారు. మీరు ఎంత హేట్ చేస్తే నేను అంత హ్యాపీగా ఫీలవుతా. అఖిల్, తేజస్వినీ బాగా పర్ ఫార్మ్ చేశారు. వాళ్లకు ఈ మూవీ మంచి పేరు తీసుకొస్తుంది. అన్నారు.

నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ - ఇది చిన్న సినిమా కాదు. ఈ మూవీ వెనక ఈటీవీ విన్, బన్నీ వాస్, వంశీ నందిపాటి లాంటి వాళ్లున్నారు. రాంబాయి నీ మీద నాకు అనే పాట పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా కూడా ఈ ఏడాది చివరలో పెద్ద హిట్ మూవీ కాబోతోంది. సినిమా బాగా లేకుంటే నేను ఇలా చెప్పను. శేష్ ఈ సినిమాను సపోర్ట్ చేసేందుకు రావడం హ్యాపీగా ఉంది. అన్నారు.

నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ - "రాజు వెడ్స్ రాంబాయి" సినిమాను సపోర్ట్ చేసేందుకు హీరో అడివి శేష్ గారు రావడం సంతోషంగా ఉంది. మనం ఎక్కడో జరిగిన రోమియో జూలియట్, లైలా మజ్ను కథల్ని హిట్ చేస్తాం. ఇది మన తెలుగు నేలపై జరిగిన కథ. ఈ సినిమా క్లైమాక్స్ చూసి నేను రెండు రోజులు నిద్రపోలేదు. రాంబాయి నా మైండ్ లో అలా తిరుగుతూనే ఉంది. సినిమా చూశాక మీకు కూడా అదే ఎమోషన్ కలుగుతుంది. అందరు అనుకుంటున్నట్లు ఇది పరువు హత్యకు సంబంధించిన కథ కాదు, అంతకంటే క్రూరమైన ఘటన ఈ జంటకు ఎదుర్కొంటారు. బయటకు రాకుండా చేసిన ఈ కథను ప్రేక్షకులకు చెప్పాలనే ఉద్దేశంతో మూవీని తీసుకొస్తున్నాం. మా గుండెల్లో నిలిచిపోయే సినిమా ఇది. అన్నారు.

చిత్ర సమర్పకులు డా.నాగేశ్వరరావు పూజారి మాట్లాడుతూ - ప్రేమకు యువత అనేక పేర్లు పెట్టుకుంటారు. కానీ ప్రేమంటే ఒకరికోసం ఒకరు బతకడం, ఒకరి కోసం ఒకరు చావుకైనా సిద్దపడటం. మా సినిమాలో ఇలాంటి ఉదాత్తమైన ప్రేమ కథను చూస్తారు. రాంబాయి సాంగ్ ను పెద్ద హిట్ చేశారు. సినిమాకు కూడా అలాంటి సక్సెస్ అందిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.

నిర్మాత రాహుల్ మోపిదేవి మాట్లాడుతూ - రకరకాల ప్రేమ కథల్ని మనం తెరపై చూసి మర్చిపోతాం. వాటిలో కొన్ని నిజంగా జరిగినవి కూడా ఉంటాయి. రాజు వెడ్స్ రాంబాయి సినిమా చూస్తే ప్రేమికులు తప్పుల్ని ఎలా సరిదిద్దుకోవాలి, ఎలాంటి పరిస్థితులు వచ్చినా నిలబడి ప్రేమను ఎలా గెలిపించుకోవాలి అనేది తెలుస్తుంది. ఈ సినిమా నుంచి నేర్చుకునేవి చాలా ఉన్నాయి. మీ అందరికీ సినిమా బాగా నచ్చుతుందని నమ్ముతున్నాం. అన్నారు.

డైరెక్టర్ వేణు ఊడుగుల మాట్లాడుతూ - "రాజు వెడ్స్ రాంబాయి" ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇది కాలానికి అతీతమైన ప్రేమ కథ. మా సినిమా ట్రైలర్ పై కొందరు కావాలనే విషం చిమ్ముతున్నారు. అమ్మాయిని కొట్టడం ఏంటి అని అడుగుతున్నారు. ట్రైలర్ లో ఉన్న సీన్స్ ను బట్టి సినిమాను ఎలా జడ్జ్ చేస్తారు. కూడికలు, తీసివేతలు ఆలోచించి చేసిన సినిమా కాదిది. కులం, మతం, డబ్బు వంటి అడ్డుగోడల్ని బద్దలు కొట్టి రాజు రాంబాయి ఈ నెల 21న థియేటర్స్ లోకి రాబోతున్నారు. మా ట్రైలర్ చూసి విమర్శలు చేస్తున్న వారికి మా సినిమానే గట్టి సమాధానం చెబుతుంది. అన్నారు.

డైరెక్టర్ సాయిలు కంపాటి మాట్లాడుతూ - "రాజు వెడ్స్ రాంబాయి" కథను వేణు అన్న దగ్గరకు తీసుకువెళ్లినప్పుడు స్క్రిప్ట్ కావాల్సిన ఫార్మేట్ లో లేదు అన్నారు. నాకు స్క్రిప్ట్ ఫార్మేట్ లో ప్రిపేర్ చేయడం తెలియదు కానీ ఈ కథను ఎలా తీయాలో, కథలోని ఎమోషన్ ఎలా చూపించాలో సినిమా బిగినింగ్, ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎలా ఉంటుందో పూర్తిగా తెలుసు. అలాగే సినిమా చేశాను. నాకు అవకాశం కల్పించిన వేణు ఊడుగుల అన్నకు థ్యాంక్స్. ఆయన తర్వాత ఈటీవీ వారు, మిగతా అందరూ మా ప్రాజెక్ట్ లోకి వచ్చారు. ఈ సినిమా షూటింగ్ చేసిన వాతావరణం, ఆ ప్రాంతం మా ఆర్టిస్టులు అందరికీ కొత్త. కానీ సినిమా కోసం కష్టపడ్డారు. అఖిల్, తేజస్వినీ, చైతు జొన్నలగడ్డ..వీళ్లందరూ ప్యాషన్ తో వర్క్ చేశారు. సురేష్ బొబ్బిలి అన్న తన పాటతో మా సినిమాకు ప్రాణం పోశారు. అన్నారు.

ఈటీవీ విన్ సాయి కృష్ణ మాట్లాడుతూ - ఈటీవీ విన్ లో వచ్చిన అనగనగ అనే మూవీని సపోర్ట్ చేస్తూ శేష్ గారు ఒక ట్వీట్ చేశారు. ఆ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఆ తర్వాతే 90's, ఎయిర్, లిటిల్ హార్ట్స్ లాంటి మూవీస్ ఈటీవీ విన్ ద్వారా చేశాం. ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయి సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సినిమా పేరును మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. అన్నారు.

ఈటీవీ విన్ నితిన్ మాట్లాడుతూ - ఈ సినిమా ఎన్నో కష్టాలను చూసింది. కష్టం ఎదురైన ప్రతిసారీ బెటర్ అవుతూ వచ్చింది. మంచి సినిమా ఎక్కడుంటే అక్కడ సపోర్ట్ చేసేందుకు శేష్ గారు వస్తారు. "రాజు వెడ్స్ రాంబాయి" సినిమా ట్రైలర్ చూసి కొందరు విమర్శిస్తున్నారు. ఇది ఫెమినిజం, ఏ ఇజం మీద చేసిన సినిమా కాదు. నిజం చెప్పేందుకు చేసిన సినిమా. 15 ఏళ్లు సమాధి చేయబడిన ఒక ప్రేమ కథను ఈ నెల 21న థియేటర్స్ లో చూపించబోతున్నాం. ప్రేమ కోసం ఎలాంటి కష్టమైన తట్టుకునే ప్రేమికురాలిని, ఆ ప్రేమను అడ్డుకునే ఆమె తండ్రిని, ప్రేమ కోసం ఎక్కడిదాకా అయినా వెళ్లే ప్రేమికుడిని ఈ సినిమాలో చూస్తారు. అన్నారు.

నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడుతూ - ఈ సినిమా చేద్దామనుకునే టైమ్ లో చాలా మంది డిజప్పాయింట్ చేశారు. వారు ఈ సినిమాకు నన్ను ఎంత దూరం చేయాలనుకుంటే నేను అంత దగ్గరయ్యాను. ఈ సినిమా చూసి క్లైమాక్స్ లో ఎమోషన్ కు గురయ్యాను. ఈ సినిమా క్లైమాక్స్ చూసి మీరు చలించకుంటే నేను సినిమాలు చేయను. 7జీ బృందావన్ కాలనీ, ప్రేమిస్తే లాంటి సినిమాలు చూసి నేను ప్రొడక్షన్ లోకి ఎలా వచ్చానో, మీరు కూడా ఈ సినిమా చూసి అలాగే ఇన్స్ పైర్ అవుతారు. ఇది రూట్స్ లో నుంచి వచ్చిన ప్రేమ కథ. ఈ సినిమాను సపోర్ట్ చేసేందుకు వచ్చిన ఇండియన్ జేమ్స్ బాండ్ శేష్ గారికి థ్యాంక్స్. అన్నారు.

హీరో అడివి శేష్ మాట్లాడుతూ - "రాజు వెడ్స్ రాంబాయి" సినిమా ట్రైలర్, కొన్ని సీన్స్ చూశాను, ఈ మూవీ కథ గురించి నాకు తెలుసు. ఇలాంటి మంచి కంటెంట్ ను ప్రమోట్ చేసేందుకే ఈ ఈవెంట్ కు వచ్చాను. కేరాఫ్ కంచెరపాలెం సినిమాను అనేక చోట్ల సైలెంట్ గా ప్రీమియర్స్ వేశారు. మీరు కూడా "రాజు వెడ్స్ రాంబాయి" సినిమాను రిలీజ్ ముందే ఈ వారం రోజులు వివిధ చోట్ల ప్రీమియర్స్ వేయండి. అప్పుడు రిలీజ్ టైమ్ కు ప్రేక్షకులే ముందుకు వస్తారు. అంతమంచి మూవీ ఇది. ఈ సినిమాలో అఖిల్, తేజస్విని, చైతూ బాగా నటించారు. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కు కూడా వస్తాను. చైతు జొన్నలగడ్డకు నా సినిమాలో అవకాశం ఇస్తా. వైరల్ కంటెంట్ ఎలా చేయాలని ఆలోచిస్తున్న ఈ సోషల్ మీడియా యుగంలో ఒక స్వచ్ఛమైన ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు రావడం సాధారణ విషయం కాదు. సోషల్ మీడియా యాప్స్ మారుతుంటాయి కానీ ప్రేమ మారదు. ఈ సినిమా జెన్యూన్ గా చేసిన ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. హార్ట్ టచింగ్ గా ఉంటుంది. అన్నారు.

హీరోయిన్ తేజస్వినీ మాట్లాడుతూ - షార్ట్ ఫిలింస్ తో 2019లో నా కెరీర్ ప్రారంభించాను. ఇప్పుడు ఈ వేదిక మీద నిలబడేందుకు ఆరేళ్లు పట్టింది. "రాజు వెడ్స్ రాంబాయి" సినిమాలో రాంబాయి పాత్రలో నటించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. మా మూవీ సాంగ్స్, ట్రైలర్ మీకు నచ్చిందనే నమ్ముతున్నాం. మా మూవీ ట్రైలర్ లోని ఎమోషన్ మీకు కనెక్ట్ కావడం సంతోషంగా ఉంది. ప్రేమకథలు ఎన్నో రావొచ్చు గానీ "రాజు వెడ్స్ రాంబాయి" లవ్ స్టోరీ వేరు. ఇది మీ గుండెల్లో నిలిచిపోయే ప్రేమ కథ. అన్నారు.

హీరో అఖిల్ ఉడ్డెమారి మాట్లాడుతూ - సినిమాల్లో అవకాశం కోసం పదేళ్లుగా కష్టపడుతున్నా. ఎన్నో ఆఫర్స్ దగ్గరిదాకా వచ్చి వెళ్లాయి. "రాజు వెడ్స్ రాంబాయి" సినిమాలో రాజుగా నటించే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. అవకాశాల కోసం తిరిగిన పదేళ్ల కష్టం మర్చిపోయా. మా మూవీ ట్రైలర్ చూశాక వీడేంది అమ్మాయిని కొడుతున్నాడు అన్నారు. కానీ రాజు రాంబాయిని ప్రేమించినంత గొప్పగా మీరు మీ జీవితంలోని రాంబాయిని ప్రేమించండి. రాజు గొప్ప ప్రేమికుడు. నేనూ నా జీవితంలో రాజులా ఉండాలని కోరుకుంటున్నా. మా మూవీ ట్రైలర్ లాంఛ్ కు శేష్ అన్న రావడం, మాకు సపోర్ట్ చేయడం మర్చిపోలేను. ఈ నెల 21న థియేటర్స్ లో సినిమా చూసేందుకు ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటున్నా. అన్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved