`
pizza

Rama Banam trailer to be launched in Rajahmundry on 20 April during a special event
గోపీచంద్, శ్రీవాస్, టీజీ విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘రామబాణం’ థియేట్రికల్ ట్రైలర్ ఏప్రిల్ 20న రాజమండ్రిలో గ్రాండ్ గా విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

18 April 2022
Hyderabad

'లక్ష్యం', 'లౌక్యం' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ 'రామబాణం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాత.

ఈ చిత్రంలో గోపీచంద్ సరసన డింపుల్ హయతి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఐఫోన్, దరువెయ్యరా పాటలు చార్ట్ బస్టర్స్ గా అలరించాయి.

తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 20న రాజమండ్రిలో జరిగే గ్రాండ్ ఈవెంట్ లో రామబాణం ట్రైలర్ ని విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ట్రెండీ అవుట్ ఫిట్ లో స్టయిలీష్ గా కనిపించారు గోపిచంద్.

భూపతి రాజా ఈ చిత్రానికి కథను అందించగా, వెట్రి పళని స్వామి సినిమాటోగ్రఫీ, మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. మధుసూదన్ పడమటి డైలాగ్స్ అందించగా, ప్రవీణ్ పూడి ఎడిటర్ గా పనిచేస్తున్నారు.

జగపతి బాబు, ఖుష్బు ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రంలో సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

మే 5న ఈ చిత్రం భారీస్థాయిలో విడుదల కానుంది.

తారాగణం: గోపీచంద్, డింపుల్ హయతీ, జగపతి బాబు, ఖుష్బు, సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: శ్రీవాస్
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: మిక్కీ జె మేయర్
డీవోపీ: వెట్రి పళనిసామి
ఎడిటర్: ప్రవీణ్ పూడి
కథ: భూపతి రాజా
డైలాగ్స్: మధుసూదన్ పడమటి
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved