pizza

Ramani Kalyanam Trailer & Pre Release Event
రమణి కళ్యాణం ట్రైలర్.. పక్కా ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌

You are at idlebrain.com > news today >

20 May 2026
Hyderabad

ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు భారీ యాక్షన్‌, హంగామా కంటే మనసుకు దగ్గరయ్యే కథలకే ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉండే క్లీన్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్స్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అలాంటి సమయంలో రమణీ కళ్యాణం మంచి ఫీల్‌గుడ్ సినిమాలా కనిపిస్తోంది. ఇప్పటికే టీజర్‌, టైటిల్ సాంగ్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా, ఇప్పుడు ట్రైలర్‌తో అంచనాలను మరింత పెంచేసింది.

“కోల్పోయిన ప్రతి వారి దగ్గర ఒక కథ ఉంటుంది” అనే డైలాగ్‌తో మొదలయ్యే ట్రైలర్ మొదటి క్షణం నుంచే కథలోకి తీసుకెళ్లింది. సంజన RJ & సింగర్. తనకి చుపులేదు.. మరోవైపు నడవలేని స్థితిలో ఉంటాడు రాజ్. ఈ రెండు పాత్రల మధ్య ప్రేమ కథని చాలా ఎంటర్టైనింగ్ అలాగే ఎమోషనల్ గా చెప్పారు డైరెక్టర్ విజయ్ ఆదిరెడ్డి

ఈ కథని నేచురల్‌గా చూపించిన తీరు ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచింది. ఎక్కడా బలవంతపు డ్రామా లేకుండా, చిన్న చిన్న ఎమోషనల్ మూమెంట్స్‌తో కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది.

సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్ కెమిస్ట్రీ చాలా సహజంగా అనిపించింది. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, సంభాషణలు ట్రైలర్‌కు మంచి ఫీల్ తీసుకొచ్చాయి. ముఖ్యంగా సైలెంట్ ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి.

కోర్ట్ ఫేం రామ్ జగదీష్ రాసిన డైలాగ్స్ ట్రైలర్‌కు మరో బలం. కొన్ని మాటలు నేరుగా హార్ట్‌ను టచ్ చేసేలా ఉన్నాయి.

టెక్నికల్‌గా కూడా ట్రైలర్ మంచి ఇంప్రెషన్ ఇచ్చింది. సాఫ్ట్ విజువల్స్‌తో కెమెరా వర్క్ బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సన్నివేశాలను మరింత ఎలివేట్ చేసింది. మొత్తం మీద ట్రైలర్ అంతా ఒక క్లీన్ ఫీల్‌గుడ్ మూవీని ప్రామిస్ చేస్తోంది

విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్ ని నిర్మిస్తున్నారు. మే 22న విడుదల కానున్న రమణీ కళ్యాణం ప్రస్తుతం ట్రైలర్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి ఆసక్తిని పెంచుతోంది.

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved