pizza

Namit Malhotra’s Ramayana — The World’s Greatest Epic in the Making — Unveils ‘The Introduction’: A Glimpse Into a Universe, With Groundbreaking East-West collaboration
నమిత్ మల్హోత్రా రామాయణ-ప్రపంచంలోనే గొప్ప ఇతిహాసం- అత్యద్భుతమైన 'రామాయణ: ది ఇంట్రడక్షన్' రిలీజ్, గ్రౌండ్ బ్రేకింగ్ ఈస్ట్-వెస్ట్ కొలాబరేషన్

You are at idlebrain.com > news today >

03 July 2025
Hyderabad

Set 5,000 years ago and revered by 2.5 billion people around the world, Namit Malhotra’s Ramayana is a two-part live-action cinematic universe being reimagined on the scale of the biggest tentpoles produced to date. The film unites some of Hollywood and India’s celebrated talent in a partnership like never seen before.

Directed by Nitesh Tiwari, Produced by Namit Malhotra’s Prime Focus Studios and 8-time Oscar winning VFX studio DNEG in association with Yash’s Monster Mind Creations; Ramayana is being filmed for IMAX and will release worldwide : Part 1 in Diwali 2026 and Part 2 in Diwali 2027.

July 3rd, 2025 : The creators behind the world’s most ambitious cinematic event unveiled the epic universe of Ramayana with the global launch of ‘Ramayana: The Introduction’ — setting the stage for the timeless battle between two of mythology’s most iconic forces: Rama vs. Ravana. The launch spanned the globe — with fan screenings across nine Indian cities and a spectacular billboard takeover at Times Square, New York. Helmed by visionary filmmaker and producer Namit Malhotra and co-produced by Yash, Ramayana brings together a formidable army of Oscar-winning technicians, Hollywood’s finest creators, and India’s biggest names in acting and storytelling — reimagining one of civilization’s most powerful epics as a cutting-edge cinematic universe, rooted in Indian culture and created for the world.

THE STORY
Set in a timeless age, the universe is held in balance by the cosmic trinity — Brahma the Creator, Vishnu the Protector, and Shiva the Destroyer — who preserve harmony among gods, sages, humans, and demons. But from the ashes of this balance rises a force unlike any before.

An unlikely demon child transforms into Ravana — the most feared and indestructible king in all creation. His roar shakes the heavens, and his purpose is clear: to destroy Vishnu, the god of protection, whom he believes has always stood against his kind.

To stop him, Vishnu descends to Earth in his weakest form — as a mortal prince named Rama.

And thus begins the eternal battle:
Rama vs. Ravana. Mortal vs. Immortal. Light vs. Darkness. This is Ramayana — a story of cosmic war, timeless destiny, and the triumph of good — still shaping the spirit of a billion people today.

THE CAST & CREW
In a stellar casting coup bringing together India’s biggest stars, Ramayana features:
Ranbir Kapoor as Rama, a fourth-generation icon of Indian cinema
Yash, India’s leading pan-India superstar and co-producer, as Ravana
Sai Pallavi as the beloved Sita
Sunny Deol, Indian cinema’s enduring action hero, as Hanuman
Ravie Dubey in a refreshing new role as Lakshman, Rama’s loyal brother
Supporting this powerful cast is an extraordinary crew. For the first time ever, Oscar-winning legends Hans Zimmer and A.R. Rahman join forces to craft a new cinematic symphony.

Hollywood’s top stunt directors— Terry Notary (Avengers, Planet of the Apes) and Guy Norris (Mad Max: Fury Road, Furiosa) — are choreographing the epic battles between gods and demons.

The visual grandeur of ancient India is being reimagined by renowned production designers Ravi Bansal (Dune 2, Aladdin, etc) and Ramsey Avery (Captain America, Tomorrowland, etc), delivering an immersive cinematic experience at an unprecedented scale.

A VISION FROM INDIA TO THE WORLD
Namit Malhotra, producer, filmmaker, founder of Prime Focus, and CEO of DNEG, shares:
“This is a cultural movement for every Indian around the world. With Ramayana, we’re not just retelling history; we’re introducing our legacy to the world.Bringing together the finest global talent allows us to tell this story with authenticity, emotion, and state-of-the-art cinematic innovation. We’ve seen Ramayana portrayed before — but this version reimagines its landscapes, creatures, and battles with the scale and splendour they deserve. As Indians, this is our truth. Now, it will be our gift to the world.”

Nitesh Tiwari, director of the film shares:
“Ramayana is a story we’ve all grown up with. It carries the soul of our culture. Our aim was to honour that soul — and present it with the cinematic scale it truly deserves. As a filmmaker, it’s both a huge responsibility and a heartfelt honour to bring it to life. . It’s a tale that has endured across millennia because it speaks to something deep and eternal within us. We are not simply making a film. We are offering a vision — one rooted in reverence, shaped by excellence, and made to transcend borders”

Crafted for the world’s most immersive formats, including IMAX, Ramayana is envisioned as a transcendent theatrical experience — a cinematic odyssey into the heart of one of humanity’s most enduring epics.

The glimpse was exclusively premiered for the media on the state-of-the-art PCX screen at Prasads, and it left everyone in awe. Critics hailed it as a visual marvel and described the experience as nothing like they’ve ever witnessed before.

నమిత్ మల్హోత్రా రామాయణ-ప్రపంచంలోనే గొప్ప ఇతిహాసం- అత్యద్భుతమైన 'రామాయణ: ది ఇంట్రడక్షన్' రిలీజ్, గ్రౌండ్ బ్రేకింగ్ ఈస్ట్-వెస్ట్ కొలాబరేషన్

5000 సంవత్సరాల క్రితం జరిగిన గొప్ప ఇతిహాసం ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్ల మంది భక్తికి ప్రతీక నమిత్ మల్హోత్రా 'రామాయణ' రెండు భాగాల లైవ్-ఆక్షన్ సినిమాటిక్ యూనివర్స్‌గా, ఇప్పటివరకు రూపొందిన అతి పెద్ద టెంట్‌పోల్ సినిమాల స్థాయిని రీఇమాజిన్ చేయనుంది. ఈ చిత్రం హాలీవుడ్, భారతదేశానికి చెందిన ప్రతిభావంతులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే, ఇప్పటివరకు ఎప్పుడూ చూడని గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది.

నితేశ్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, 8 సార్లు ఆస్కార్ అందుకున్న VFX స్టూడియో DNEG సంయుక్తంగా, యాష్ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ తో కలిసి నిర్మిస్తున్న రామాయణ, IMAX కోసం చిత్రీకరించబడుతోంది. ఈ చిత్రం పార్ట్ 1 – దీపావళి 2026లో, పార్ట్ 2 – దీపావళి 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

జూలై 3, 2025:
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినీ ఈవెంట్ కి నాంది పలికేలా మేకర్స్ 'రామాయణ: ది ఇంట్రడక్షన్' పేరిట ఈ ఎపిక్ మూవీని గ్లోబల్‌గా ఆవిష్కరించారు. ఇది పురాణాలలోని రెండు అత్యంత ప్రసిద్ధ శక్తులైన రాముడు vs. రావణ మధ్య కాలాతీత యుద్ధానికి వేదికగా నిలిచింది. ఈ ప్రయోగం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది ఈ లాంచ్ భారతదేశంలోని తొమ్మిది ప్రధాన నగరాలలో ఫ్యాన్ స్క్రీనింగ్స్ ద్వారా, అలాగే న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో భారీ బిల్బోర్డ్ టేకోవర్ ద్వారా వరల్డ్ వైడ్ గా జరిగింది. విజనరీ దర్శక నిర్మాత నమిత్ మల్హోత్రా నేతృత్వంలో, యాష్ సహనిర్మాతగా రూపొందిస్తున్న ఈ రామాయణ… ఆస్కార్ అవార్డు పొందిన సాంకేతిక నిపుణులు, హాలీవుడ్ నిపుణులు, భారతీయ నటీనటులు, కథా కళాకారులను ఒకే వేదికపైకి తీసుకొస్తోంది. ఇది మన నాగరికతలోని అత్యంత శక్తివంతమైన ఇతిహాసాన్ని ఆధునిక సాంకేతికతతో, భారతీయ సంస్కృతి మూలాలపై ఆధారపడిన ప్రపంచస్థాయి సినిమాటిక్ యూనివర్స్‌గా రీడిఫైన్ చేయనుంది.

కథ:
కాలానికి అతీతమైన యుగంలో, ఈ బ్రహ్మాండం సమతుల్యంలో కొనసాగుతోంది . ఈ సమతుల్యాన్ని బ్రహ్మ (సృష్టికర్త), విష్ణు (రక్షకుడు), శివుడు (లయకారుడు) త్రిమూర్తులు కాపాడుతూ ఉంటారు. దేవతలు, ఋషులు, మనుషులు, రాక్షసుల మధ్య సమరసతను ఈ త్రిమూర్తులే నిలుపుతున్నారు. కానీ ఆ సమతుల్యంలోంచి, ఇప్పటివరకు ఎప్పుడూ లేనంతటి ఒక విపరీత శక్తి ఉద్భవిస్తుంది.

ఒక రాక్షస శిశువు, సృష్టిలోనే అత్యంత భయంకరుడు, దుర్జేయుడు అయిన రావణుడిగా మారతాడు. అతని గర్జన ఆకాశాలను కంపింపజేస్తుంది. అతని ఉద్దేశ్యం విష్ణువును నాశనం చేయడం. ఎందుకంటే అతను ఎప్పుడూ తన జాతికి విరోధంగా ఉన్నాడని అతడి నమ్మకం.

అతడిని ఆపేందుకు, విష్ణువు తన బలహీనమైన రూపమైన ఒక మానవ రాజకుమారుడైన రాముడిగా భూమిపై అవతరిస్తాడు.

ఇక్కడినుంచే మొదలవుతుంది శాశ్వత యుద్ధం:
రాముడు vs రావణుడు
మనిషి vs రాక్షసుడు
వెలుగు vs చీకటి
రామాయణం ఒక బ్రహ్మాండ యుద్ధగాధ, శాశ్వత విధి, గొప్ప విజయం — ఇది ఈ రోజుకీ బిలియన్ మందిలో స్పూర్తిని రగిలించేస్తోంది.

నటీనటులు & సాంకేతిక బృందం
భారతదేశపు అగ్రశ్రేణి తారలు రామాయణంలో ప్రధాన పాత్రలుగా నటిస్తున్నారు.
భారతీయ సినిమాలో నాలుగో తరం ఐకాన్ రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నారు.
పాన్ ఇండియా సూపర్‌స్టార్ & సహనిర్మాత యష్ రావణుడిగా
అందరి మనసులను గెలుచుకున్న అభిమాన నటి సాయి పల్లవి సీతగా
హనుమంతుడిగా సన్నీ డియోల్ – లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు.

ఈ శక్తివంతమైన తారాగణానికి తోడుగా, అద్భుతమైన సాంకేతిక బృందం మద్దతిస్తోంది. తొలిసారి ఆస్కార్ అవార్డు విజేతలు హాన్స్ జిమ్మర్, ఏ.ఆర్. రెహ్మాన్ కలిసి సంగీతం అందిస్తున్నారు. హాలీవుడ్‌లో అగ్రశ్రేణి స్టంట్ డైరెక్టర్లు టెర్రీ నోటరీ (Avengers, Planet of the Apes), గై నోరిస్ (Mad Max: Fury Road, Furiosa) గ్రాండ్ యుద్ధ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్లు రవి బన్సాల్ (Dune 2, Aladdin) రాంసే ఏవరీ (Captain America, Tomorrowland ) కలిసి పనిచేస్తున్నారు — ఇది ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించనుంది.

నిర్మాత, దర్శకుడు, Prime Focus వ్యవస్థాపకుడు, DNEG CEO అయిన నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ..“ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికీ సంబంధించిన ఒక సాంస్కృతిక ఉద్యమం. రామాయణం ద్వారా మేము కేవలం చరిత్రను తిరిగి చెబుతున్నట్లు కాదు — మేము మన వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. ప్రపంచ స్థాయి ప్రతిభను ఒకచోట కలిపి, ఈ కథను నిజమైన భావోద్వేగంతో, నూతనమైన సినిమాటిక్ టెక్నాలజీతో చెప్పగలగడం సాధ్యమవుతోంది. ఇంతకుముందు రామాయణాన్ని ఎన్నోసార్లు చూశాం — కానీ ఈ వెర్షన్‌లో దాని దృశ్యాలు, యుద్ధాలు అన్నీ నిజమైన వైభవం, విస్తృతతతో రీఇమేజిన్ చేయబడుతున్నాయి. భారతీయులైన మనకు ఇది నిజం. ఇప్పుడు ఇది ప్రపంచానికి మనం ఇచ్చే బహుమతి'అన్నారు.

దర్శకుడు నితేశ్ తివారీ మాట్లాడుతూ..రామాయణం అనేది మనందరం చిన్ననాటి నుంచి ఎదిగి విన్న, చూసిన కథ. ఇది మన సంస్కృతికి ఆత్మవంటిది. ఆ ఆత్మను గౌరవించడమే మా లక్ష్యం — అదే సమయంలో ఈ కథకు అర్హమైన సినిమాటిక్ స్థాయిలో ప్రజెంట్ చేయాలనుకున్నాం. ఒక దర్శకుడిగా, ఇది నా కోసం ఒక భారీ బాధ్యత మాత్రమే కాదు — ఓ గౌరవప్రదమైన అవకాశమూ. ఈ కథ ఎందరో తరాలుగా ఎందుకు నిలిచిపోయిందంటే అది మన లోపల వున్న ఒక శాశ్వతమైన, లోతైన భావనను తాకుతుంది. మేము కేవలం ఒక సినిమా తీస్తున్నాం కాదు మేము ఒక దృష్టిని అందిస్తున్నాం. అది భక్తితో పుట్టినదే, శ్రేష్ఠతతో రూపొందించబడింది, మరియు సరిహద్దులను దాటి పోవడానికి రూపొందించబడింది'అన్నారు.

ప్రపంచంలోని అత్యంత విశేష అనుభూతిని ఇచ్చే ఫార్మాట్లలో, ముఖ్యంగా IMAX కోసం రూపొందించబడిన రామాయణ, ప్రేక్షకులను అద్వితీయమైన థియేట్రికల్ అనుభవంలోకి తీసుకెళ్లేలా రూపొందుతోంది. ఇది ఇతిహాసాల్లో ఎన్నటికీ నిలిచిపోయే ఒక మహాకావ్యంలోనికి సినిమాటిక్ ప్రయాణం.

ఈ గ్లింప్స్‌ను ప్రత్యేకంగా మీడియా కోసం హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రీమియర్ చేశారు. అందరూ ఆశ్చర్యపోయేలా, అది అద్భుత అనుభూతిని కలిగించింది. విమర్శకులు దీన్ని ఒక విజువల్ వండర్‌గా ప్రశంసించగా, “ఇలాంటి అనుభవం మేము ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు” అని అభిప్రాయపడ్డారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved