Hollywood actor Arnold Vosloo, best known for his role in The Mummy, plays Sir Theodore Hector in Ranabaali
"రణబాలి" చిత్రంలో సర్ థియోడోర్ హెక్టర్ క్యారెక్టర్ లో నటిస్తున్న "ది మమ్మీ" మూవీ ఫేమ్ హాలీవుడ్ యాక్టర్
Vijay Deverakonda and Rashmika Mandanna are starring together in the grand pan-India film Ranabaali, directed by Rahul Sankrityan. Presented by T-Series and produced by Naveen Yerneni and Y. Ravi Shankar under the Mythri Movie Makers banner, the film is being made on a massive budget.
Set against the backdrop of the 19th century, Ranabaali is based on real historical events that took place during British rule between 1854 and 1878.
Renowned Hollywood actor Arnold Vosloo is making his Indian cinema debut with Ranabaali. He plays the pivotal role of Sir Theodore Hector in the film. On the occasion of Arnold Vosloo's birthday, the makers released a special poster wishing him a happy birthday. The poster introduces his character as "Sir Theodore Hector, the Demon of the Famine Lands."
Recently, Ranabali successfully completed 100 days of shooting. With huge expectations across India, the film is gearing up for a worldwide release on September 11.
Cast:Vijay Deverakonda, Rashmika Mandanna, Arnold Vosloo, and others.
Technical Team
Banner: Mythri Movie Makers
Presented by: Gulshan Kumar, Bhushan Kumar, T-Series Films
Producers: Naveen Yerneni, Y. Ravi Shankar
Story & Direction: Rahul Sankrityan
Co-Producers: Anurag Parvathaneni, Shiv Chanana
CEO: Cherry
Music: Ajay–Atul
Cinematography: Nirav Shah, Jishnu Bhattacharjee
Writer: Pramod Thammineni
Production Designer: Shivam Rao Nagasani
Editor: Karthika Srinivas R
Chief Executive Producer: R. Chandrasekhar
Executive Producer: Chembolu Sai Aditya
Choreography: Kruti Mahesh
Costume Designer: Archana Rao
Art Director: Vithal Kosanam
VFX Supervisor: Sunil Raju Chinta
Action Choreographers: Yannick Ben, Andy Long Nguyen, Robin Subbu
Sound Designer: Raghunath Kemishetty
Publicity Designer: Kabilan Chelliah
"రణబాలి" చిత్రంలో సర్ థియోడోర్ హెక్టర్ క్యారెక్టర్ లో నటిస్తున్న "ది మమ్మీ" మూవీ ఫేమ్ హాలీవుడ్ యాక్టర్
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "రణబాలి" సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా "రణబాలి" సినిమా రూపొందుతోంది.
"రణబాలి"తో తొలిసారి ఇండియన్ సినిమాలో నటిస్తున్నారు ప్రముఖ హాలీవుడ్ నటుడు, "ది మమ్మీ" మూవీ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ. ఈ చిత్రంలో ఆయన సర్ థియోడోర్ హెక్టర్ అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ రోజు ఆర్నాల్డ్ వోస్లూ పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు "రణబాలి" మేకర్స్. బర్త్ డే పోస్టర్ లో 'కరువు నేల రాక్షసుడు సర్ థియోడోర్ హెక్టర్' అంటూ ఆయన పాత్రను పరిచయం చేశారు.
ఇటీవలే "రణబాలి" సినిమా సక్సెస్ ఫుల్ గా వంద రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ రిలీజ్ కు అన్ని సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి.