pizza

Rao Bahadur Teaser Launch
మహేష్ బాబు గారు రావు బహదూర్ చూసి 'మునుపెన్నడూ చూడని సినిమా' అని చెప్పడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది: మోర్ దాన్ ఏ టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సత్యదేవ్

You are at idlebrain.com > news today >

30 June 2026
Hyderabad

టాలెంటెడ్ హీరో సత్యదేవ్, క్రియేటివ్ డైరెక్టర్ వెంకటేష్ మహా కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ సైకలాజికల్ డ్రామా 'రావు బహదూర్'. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్, వినూత్న ప్రచార కార్యక్రమాలు, పలువురు ప్రముఖుల ప్రశంసలతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై, ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా మేకర్స్ "మోర్ దాన్ ఏ టీజర్" పేరుతో ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోకు మహేష్ బాబు అందించిన పవర్‌ఫుల్ వాయిస్‌ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భావోద్వేగాలతో కూడిన ఈ నేరేషన్, రావు బహదూర్ కేవలం ఒక సినిమా కాదు... సరికొత్త సినీ అనుభూతి అనే విషయాన్ని తెలియజేస్తోంది.

"When drama begins, logic ends" అనే పాపులర్ కోట్ తో ప్రారంభమైన ఈ నేరేషన్‌కు మహేష్ బాబు కొత్త అర్థాన్ని జోడించారు. "డ్రామాతో పాటు మ్యాజిక్ కలిస్తే... లాజిక్‌కు కొత్త అర్థం పుడుతుంది" అంటూ చెప్పిన డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

ఒక చిన్న సందేహం ఎంతటి శక్తివంతంగా మారి విధినే మార్చగలదో, అసలు ఉండకూడని ఒక మనిషి జీవితాన్ని ఎలా నిలబెడుతుందో, ఆ సందేహం క్రమంగా అతని జీవితమంతా ఆక్రమించి ప్రపంచాన్నే తలకిందులు చేసే స్థాయికి ఎలా చేరుకుంటుందో నేరేషన్‌లో ఆసక్తికరంగా చూపించారు. కథను ఎక్కడా బయటపెట్టకుండా క్యూరియాసిటీని మరింత పెంచేలా ఈ వీడియోను తీర్చిదిద్దారు.

'‘ఇక్కడ మేజిక్‌ అంటే గారడి కాదు.. దృశ్య కావ్యం" అని మహేష్ బాబు చెప్పడం విశేషం. అద్భుతమైన విజువల్స్, భావోద్వేగాలతో కూడిన కథనంతో ఈ చిత్రం సరికొత్త సినీ అనుభూతిని అందించబోతోందని ఈ వీడియో స్పష్టం చేస్తోంది.

చివరగా "మునుపెన్నడూ చూడని విధంగా తెలుగు సినిమా.. రావు బహదూర్ " అని మహేష్ బాబు ఇచ్చిన హామీతో రావు బహదూర్ అంచనాలు మరింతగా పెరిగాయి.

ఈ సందర్భంగా నిర్వహించిన Q&A కార్యక్రమంలో చిత్ర బృందం విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.

అనురాగ్ రెడ్డి గారు.. మహేష్ బాబు గారు ఒక సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా అరుదు. అలాంటిది ఆయన ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం ఎలా అనిపించింది?
-ఇది ఎంత కొత్త తరహా సినిమానో మహేష్ బాబు గారికి పూర్తిగా తెలుసు. ఇలాంటి సినిమా తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటివరకు రాలేదు. మహేష్ బాబు గారు ఎప్పుడూ కొత్త తరహా సినిమాలను ప్రోత్సహించడానికి, రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఆయన ఒక సినిమాను ప్రజెంట్ చేస్తున్నారంటే కచ్చితంగా దానిపై భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను ఈ సినిమా తప్పకుండా అందుకుంటుందని మా నమ్మకం.

-ఇప్పటికే మేము కొందరికి సినిమా చూపించాం. సినిమా చూసిన వారందరూ కూడా "ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు" అని చెబుతున్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు ఒక కొత్త అనుభూతిని పొందుతాడు.

-ఈ తరహా కథ, ఈ స్థాయి పెర్ఫార్మెన్స్‌లు, ఈ తరహా మేకింగ్‌ను ఇప్పటివరకు ప్రేక్షకులు చూడలేదు. చాలా నమ్మకంతో ఈ మాట చెబుతున్నాం. ప్రస్తుతం ప్రేక్షకులు కొత్త తరహా సినిమాలను కోరుకుంటున్నారు. వారు ఆశిస్తున్న కొత్తదనాన్ని 'రావు బహదూర్' ద్వారా అందిస్తున్నాము.

-మహేష్ బాబు సినిమా చూసి 40 నిముషాలు సినిమా గురించి మాట్లాడారు. అప్పుడే మేము విజయం సాధంచిన నమ్మకం కలిగింది.

వెంకటేష్ మహా గారు.. ఇది తెలుగు సినిమాలో ఏ స్థాయిలో నిలబడుతుందని మీరు అనుకుంటున్నారు?
-తెలుగు సినిమా కిరీటంలో ఇది మరో కలికితురాయిగా నిలుస్తుంది. ఈ సినిమా చాలా కాలం పాటు గుర్తుండిపోతుంది. ప్రపంచంలో ఎక్కడున్న ప్రేక్షకులు చూసినా తెలుగు సినిమా ఎంత గొప్పగా ఉంటుందో చెప్పే చిత్రంగా ఇది నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా గొప్పతనాన్ని మరింత పెంచే సినిమా ఇది.

-నేను 'కేరాఫ్ కంచరపాలెం' సినిమా తీస్తున్నప్పుడు కూడా "ఇలాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులు అర్థం చేసుకోగలరా?" అనే కామెంట్లు వినిపించాయి. నేను మధ్యతరగతి కుటుంబంలో పెరిగాను. దర్శకుడిగా మారడానికి చాలా సంవత్సరాలు కష్టపడ్డాను. అలాంటి నేను ఒక కథ చేస్తున్నానంటే, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునేలా, ప్రతి ఒక్కరికీ చేరేలా ఉంటుందని నమ్ముతాను.

-మహేష్ బాబు గారు సినిమా చూశారు. ఆయనకు చాలా నచ్చింది. "ఈ సినిమాకు నేను వాయిస్ ఓవర్ ఇస్తాను" అని స్వయంగా చెప్పారు. "ఇలాంటి తెలుగు సినిమా నేను ఇంతకుముందు చూడలేదు" అని ఆయన చెప్పడం నాకు దక్కిన అతిపెద్ద ప్రశంస. మహేష్ బాబు గారి లాంటి సూపర్ స్టార్ మా సినిమాకు అండగా నిలవడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం జీవితాంతం గుర్తుంచుకునే గౌరవంగా భావిస్తాను.

సత్యదేవ్ గారు.. ఈ సినిమాతో ఆడియన్స్ కి మీరు ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నారు?

తెలుగు సినిమాకు మేము రాస్తున్న ప్రేమలేఖే 'రావు బహదూర్' సినిమా. మహేష్ బాబు గారు కూడా ఈ సినిమా చూసి "ఇది తెలుగు సినిమాకు ఒక లవ్ లెటర్" అని అన్నారు.

-ఈ సినిమాతో నాకు 'రావు బహదూర్ సత్యదేవ్' అనే ట్యాగ్ వస్తుందనే నమ్మకం ఉంది. ఎందుకంటే అలాంటి సినిమా ఇది. 'జ్యోతి లక్ష్మి' కి ముందు నేను కొన్ని సినిమాలు చేశాను. కానీ 'జ్యోతి లక్ష్మి' తర్వాత నా కెరీర్‌లో ఒక మంచి మార్పు వచ్చింది. అదే విధంగా 'రావు బహదూర్' కూడా నా కెరీర్‌లో మరో కీలకమైన మలుపు అవుతుందని నమ్ముతున్నాను.

-ఈ సినిమాలో వెంకటేష్ మహా గారు కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. ఆ పాత్రతో ఆయన మీ అందరినీ తప్పకుండా ఆశ్చర్యపరుస్తారు.

నిర్మాత గోపాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ: ఈ సినిమా చూసిన కొద్దీ మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. మహేష్ బాబు గారు లాంటి సూపర్‌స్టార్ ఈ సినిమాను ప్రజెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన సినిమా చూసి చాలా మెచ్చుకున్నారు. వెంకటేష్ మహా గారు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ పాత్రకు సత్యదేవ్ గారిని తప్ప మరెవరినీ ఊహించలేం. ఇది కుటుంబ సమేతంగా చూసే సినిమా. ప్రేక్షకులకు ఒక అద్భుతమైన మ్యాజికల్ ఎంటర్‌టైన్‌మెంట్ అనుభూతిని అందిస్తుంది.

నిర్మాత శరత్ చంద్ర మాట్లాడుతూ: రావు బహదూర్' లాంటి సినిమా ఇప్పటివరకు తెలుగు సినిమాలో రాలేదు. ఇలాంటి సినిమాను ప్రేక్షకులు ఇంతకుముందెప్పుడూ చూసి వుండరు. ఈ సినిమా క్రాఫ్ట్ అద్భుతంగా ఉంటుంది. ఈ శుక్రవారం ప్రేక్షకులకు చాలా భిన్నమైన అనుభూతి వుంటుంది. థియేటర్ నుంచి బయటకు వస్తున్న ప్రతి ప్రేక్షకుడు కచ్చితంగా ఒక కొత్త సినీ అనుభూతితోనే బయటకు వస్తారు.

దీప థామస్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ఈ సినిమాతో నా కల నెరవేరినట్టైంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన వెంకటేష్ మహా గారికి ధన్యవాదాలు. ఆయన తెరకెక్కించిన 'కేరాఫ్ కంచరపాలెం' నా ఫేవరెట్ సినిమా. సత్యదేవ్ గారితో కలిసి పనిచేయడం చాలా మంచి అనుభవం. మహేష్ బాబు గారి బ్యానర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. మహేష్ బాబు గారికి, నమ్రత గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఈవెంట్ లో మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved
Energetic Star Ram Pothineni’s Most Ambitious Project #RAPO23, Produced By Krishna Pothineni On Rapo Cinematics, Grand Launch TomorrowEnergetic Star Ram Pothineni’s Most Ambitious Project #RAPO23, Produced By Krishna Pothineni On Rapo Cinematics, Grand Launch Tomorrow