23 September 2023
Hyderabad
Presenting the National Crush Rashmika Mandanna as Geetanjali From Ranbir Kapoor, Sandeep Reddy Vanga, Bhushan Kumar, Pranay Reddy Vanga, T Series, Bhadrakali Pictures Animal, Teaser On Sep 28th
Director Sandeep Reddy Vanga who overwhelmed the Telugu audience with Arjun Reddy, and then awe-struck the Hindi audience with its remake Kabir Singh, is readying a never-before actioner for movie buffs across the country. The Pan India film Animal starring Ranbir Kapoor in the lead role is getting ready for release on December 1st.
While post-production works are underway, promotional activities are in full swing for the movie. The makers who previously unveiled Ranbir Kapoor’s first look and then a pre-teaser have now come up with a character poster of the National Crush Rashmika Mandanna who played Ranbir’s love interest in the movie.
Rashmika is introduced as Geethanjali, and she is a stunner in the first look poster. Draped in a saree, Rashmika flashes an adorable smile here. The bindi on her forehead adds more charm to her overall look. Like Arjun Reddy and Kabir Singh, Animal will also have Sandeep Reddy Vanga’s mark superb love story.
The much-anticipated teaser of 'Animal' will be released on the 28th of September. Behind this grand venture is the prolific producer Bhushan Kumar, a name synonymous with cinema today. This cinematic masterpiece boasts stellar talents- Anil Kapoor, Bobby Deol, and Tripti Dimri, ensuring a visual and emotional treat for all movie enthusiasts.
Animal is produced by Bhushan Kumar & Krishan Kumar's T-Series, and Pranay Reddy Vanga's Bhadrakali Pictures. The film will be released in 5 languages - Hindi, Telugu, Tamil, Kannada, and Malayalam.
Cast: Ranbir Kapoor, Anil Kapoor, Rashmika Mandanna, Bobby Deol, and Tripti Dimri
Technical Crew:
Director: Sandeep Reddy Vanga
Producers: Bhushan Kumar, Pranay Reddy Vanga
Banners: T Series, Bhadrakali Pictures
రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ ‘యానిమల్’ నుండి గీతాంజలి గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న, సెప్టెంబర్ 28న టీజర్
అర్జున్ రెడ్డితో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించి, తర్వాత ‘కబీర్ సింగ్’ రీమేక్ తో హిందీ ప్రేక్షకులను అలరించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. దేశవ్యాప్తంగా సినీ ప్రియుల కోసం మునుపెన్నడూ లేని విధంగా ఓ యాక్షన్ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్ర ‘యానిమల్’ డిసెంబర్ 1న విడుదలకు సిద్ధమవుతోంది.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా, సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇంతకుముందు రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్, ప్రీ-టీజర్‌ను రిలీజ్ చేసిన మేకర్స్ ఇప్పుడు ఈ చిత్రంలో రణబీర్ కు జోడిగా నటించిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్యారెక్టర్ పోస్టర్ ని విడుదల చేశారు.
రష్మికను గీతాంజలిగా పరిచయం చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. చీర కట్టులో అందమైన చిరునవ్వుతో మెరిసింది రష్మిక. ఆమె నుదిటిపై బొట్టు మరింత ఆకర్షణను జోడిస్తుంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ లాగానే యానిమల్ కూడా సందీప్ రెడ్డి వంగా మార్క్ అద్భుతమైన ప్రేమకథ వుంటుంది.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'యానిమల్' టీజర్ సెప్టెంబర్ 28న విడుదల కానుంది.ఈ గ్రాండ్ వెంచర్ వెనుక ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్ వున్నారు. అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి డిమ్రీ.. భారీతారాగణం ఈ సినిమాటిక్ మాస్టర్‌పీస్ లో వుంది. ప్రేక్షకులకు విజువల్, ఎమోషనల్ ట్రీట్ ని అందించనుంది.
యానిమల్‌ను భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్‌ల టీ-సిరీస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం - 5 భాషల్లో విడుదల కానుంది.
తారాగణం: రణబీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక మందన్న, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రీ
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా
నిర్మాతలు: భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా
బ్యానర్లు: టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్