National crush Rashmika Mandanna has completed a remarkable nine-year journey in Indian cinema, starring in 25 films across four languages. From Telugu and Tamil to Kannada and Hindi, Rashmika has delivered a streak of hits, super hits, and blockbusters, carving a truly pan-India legacy.
Unlike many who achieve regional stardom, Rashmika has won hearts nationwide with her charm, talent, and relatable performances. Her box-office record speaks volumes — with films like Pushpa, Pushpa 2, Animal, Chhaava, and Thamma collectively grossing thousands of crores, she stands tall as one of Indian cinema’s most successful actresses. Yet, she insists that audience love matters more than numbers.
Continuing her golden run, Rashmika is gearing up for the release of The Girlfriend on November 7, a pan-India film that has already created massive buzz with its intense trailer. With her evolving choice of roles and unstoppable momentum, Rashmika continues to reign as the undisputed queen of Indian cinema.
9 ఏళ్లలో 4 భాషల్లో 25 చిత్రాలతో ఇండియన్ సినిమా క్వీన్ గా మారిన హీరోయిన్ రశ్మిక మందన్న
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 9 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకుంది. 9 ఏళ్ల కెరీర్ లో నాలుగు భాషల్లో మొత్తం 25 మూవీస్ లో నటించింది రశ్మిక. ఈ సినిమాల్లో హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ తో పాటు బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన సినిమాలు ఎన్నో ఉండటం విశేషం. హీరోయిన్స్ ప్రాంతీయంగా పేరు తెచ్చుకోవడం చూస్తుంటాం కానీ పాన్ ఇండియా స్థాయిలో వరుస విజయాలు సాధిస్తూ తన స్టార్ డమ్ క్రేజ్ చూపిస్తోంది రశ్మిక. అందం, నటన, ఆకర్షణతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. మరో హీరోయిన్ కు లేనంత క్రేజ్ ను సొంతం చేసుకుంటోంది రశ్మిక.
వెయ్యి కోట్ల రూపాయల సినిమాలను అలవోకగా అందుకుంటూ ఇండియన్ సినిమా క్వీన్ గా మారింది. రశ్మిక నటించిన పుష్ప, పుష్ప 2, యానిమల్, ఛావా, థామా చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులు తిరగరాశాయి. అయితే బాక్సాఫీస్ నెంబర్స్ కంటే ప్రేక్షకుల ప్రేమే తనకు ముఖ్యమని చెబుతుంటుంది రశ్మిక మందన్న. ఈ అందాలతార తన విజయాలను కొనసాగిస్తూ మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. రశ్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నవంబర్ 7న పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్ లో రశ్మిక పర్ ఫార్మెన్స్ మెస్మరైజ్ చేస్తోంది. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రశ్మిక కెరీర్ లో మరో మైల్ స్టోన్ కాబోతోందనే ప్రెడిక్షన్స్ ట్రైలర్ సక్సెస్ తో ఏర్పడుతున్నాయి.
Watched the trailer of #TheGirlFriend. If you’re expecting a soft, mellow tone just because it’s directed by Rahul Ravindran, you’re in for a surprise. The characters are layered and complex, making the trailer both gripping and intriguing. It carries a dark undertone, leaving…