pizza

Red Puppet’s 1st schedule done
సుమంత్ ప్రభాస్, జగపతి బాబు, రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నెం1 సెకండ్ షెడ్యూల్ పూర్తి

You are at idlebrain.com > news today >

12 February 2025
Hyderabad

తన తొలి మూవీ ‘మేం ఫేమస్‌’తో లీడ్ యాక్టర్, దర్శకుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్ హీరోగా తన రెండో మూవీతో రాబోతున్నారు. ఈ కొత్త మూవీ రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ మేడిన్ వెంచర్. MR ప్రొడక్షన్స్ షార్ట్ ఫిల్మ్‌లతో పాపులరైనా సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో హై-ఎనర్జీ సన్నివేశాలు చిత్రీకరించారు. వీటిలో ఫస్ట్ అఫ్ ఇట్స్ కింద్ ఆటో రేస్ సీక్వెన్స్, ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్‌లు ఉన్నాయి, ఇవి థ్రిల్లింగ్ సినిమాటిక్ అనుభవాన్ని ఇస్తాయి. అలాగే సుమంత్ ప్రభాస్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, సుదర్శన్, వివా రాఘవ్, రోహిత్ కృష్ణ వర్మలతో కూడిన కామెడీ ట్రాక్‌లను చిత్రీకరించారు.

రేలంగి, భీమవరం, సకినేటిపల్లి లంక, అంతర్వేది ఆలయ ప్రాంగణంతో సహా అందమైన లోకేషన్స్ లోషూటింగ్ జరిగింది. ఈ షెడ్యూల్‌లో అనేక కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, జగపతి బాబు, లైలా, రాజీవ్ కనకాల, హర్షవర్ధన్ షూటింగ్ లో పాల్గొన్నారు.

ఇప్పుడు టీం మూడవ షెడ్యూల్‌కు సిద్ధమవుతోంది, ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభమై మార్చి మిడ్ టైం వరకు కొనసాగనుంది. ఇందులో పాటలు, ఇతర కీలకమైన సన్నివేశాల చిత్రీకరించనున్నారు.

ఈ చిత్రంతో నిధి ప్రదీప్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. జగపతి బాబు మేజర్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, హర్షవర్ధన్, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్, రీను & రోహిత్ కృష్ణ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సాయి సంతోష్ సినిమాటోగ్రఫీని, నాగ వంశీ కృష్ణ సంగీతం అందిస్తున్నారు, ప్రొడక్షన్ డిజైనర్ ప్రవల్య, ఎడిటర్ అనిల్ కుమార్ పి.

నటీనటులు: సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, జగపతి బాబు, రాజీవ్ కనకాల, హర్షవర్ధన్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్, రీను, రోహిత్ కృష్ణ తదితరులు

సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం – సుభాష్ చంద్ర
బ్యానర్ – రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్
డీవోపీ – సాయి సంతోష్
సంగీతం – నాగ వంశీ కృష్ణ
ఎడిటర్ – అనిల్ కుమార్ పి
ప్రొడక్షన్ డిజైనర్ – ప్రవల్య
సౌండ్ డిజైనర్ – నాగార్జున తాళ్లపల్లి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – మధులిక సంచన లంక

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved