pizza

AGS Entertainment, Pradeep Ranganathan and Director Ashwath Marimuthu’s Return of the Dragon, Trailer unveiled. The film is set to hit theaters on February 21st
AGS ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా అశ్వత్ మారిముత్తు తెరకెక్కించిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ ట్రైలర్‌ రిలీజ్.. ఫిబ్రవరి 21న చిత్రం భారీ ఎత్తున విడుదల

You are at idlebrain.com > news today >

14 February 2025
Hyderabad

AGS Entertainment, one of the leading production houses in the South Indian film industry, produced the blockbuster Love Today. Pradeep Ranganathan directed and starred in the film. Now, this successful combination is back with Return of the Dragon. The film is produced by Kalpathi S. Aghoram, Kalpathi S. Ganesh, and Kalpathi S. Suresh. Pradeep Ranganathan once again takes the lead role in this film, directed by Ashwath Marimuthu, known for Ori Devuda. The film will be released in Telugu by Mythri Distributors. Poorvi Pictures releasing the film in Coastal Andhra Pradesh.

The trailer was unveiled. In the trailer, Pradeep Ranganathan portrays a young man named Ragavan struggling to achieve something in life despite having 48 backlogs in engineering. His character takes money from his friends and pretends to have received his salary to avoid burdening his parents. His relationships with Anupama and Kayadu Lohar fall apart due to his irresponsible behavior. It is clear that the film is an entertainer, designed to appeal to all audiences, with elements showcasing the twists and turns in his life. Alongside youth-oriented themes, the film also offers emotional elements that will resonate with family audiences.

The film has star-studded supporting cast of K.S. Ravikumar, Gautham Vasudev Menon, and Mysskin has generated great interest. The trailer also showcased Raghavan as an employee. The announcement video, teaser, and songs have created high expectations for the film. The film's creative producer is Archana Kalpathi, with Aishwarya Kalpathi serving as the associate creative producer.

Leon James composes the music, Niketh Bommi handles the cinematography, Pradeep E. Raghav is the editor, and S.M. Venkat Manikyam is the executive producer. The film also stars V.J. Sidhu, Harshat Khan, Mariam George, Indumati Manikandan, Thenappan, and others in key roles. Return of the Dragon grand release in theatres on February 21st.

AGS ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా అశ్వత్ మారిముత్తు తెరకెక్కించిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ ట్రైలర్‌ రిలీజ్.. ఫిబ్రవరి 21న చిత్రం భారీ ఎత్తున విడుదల

దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన AGS ఎంటర్‌టైన్‌మెంట్ వరుసగా హిట్ చిత్రాలను నిర్మిస్తోంది. AGS ఎంటర్‌టైన్‌మెంట్, ప్రదీప్ రంగనాథన్ కాంబోలో బ్లాక్ బస్టర్ ‘లవ్ టుడే’ చిత్రం వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌’ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ చిత్రాన్ని కల్పాతి ఎస్. అఘోరం, కల్పాతి ఎస్. గణేష్, కల్పాతి ఎస్. సురేష్ నిర్మించారు. ఒరి దేవుడా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఫిబ్రవరి 21న రాబోతోంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్‌లో అన్ని రకాల అంశాలను జోడించారు. యూత్‌కి కావాల్సినంత వినోదం, ప్రేమ, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్నింటినీ జోడించారు. ఇంజనీరింగ్‌లో 48 బ్యాక్‌లాగ్‌లు పెట్టుకున్న హీరో.. కాలేజీలో పనీ పాటా లేనీ గాలికి తిరిగే ఓ కుర్రాడిగా కనిపించాడు. ప్రేమ, బ్రేకప్, లైఫ్‌లో సెటిల్ అవ్వడం కోసం కష్టపడే తీరు ఇలా అన్నీ చూపించారు. ఫ్యామిలీ ఎమోషన్‌ను కూడా ట్రైలర్‌లో చూపించారు. బాధత్యారాహిత్యంగా ఉండే కుర్రాడి జీవితంలో వచ్చే సమస్యలు, సవాళ్లను చూపిస్తూ.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఓ ఎంటర్టైనర్ మూవీ అవుతుందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది.

ఈ చిత్రంలో కె. యస్. రవికుమార్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌, మిస్కిన్‌ వంటి స్టార్ డైరెక్టర్లు ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో, టీజర్, పాటలు సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక ఈ ట్రైలర్‌తో సినిమాపై మరింత బజ్ ఏర్పడింది. ఈ మూవీకి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా అర్చన కల్పాతి, అసోసియేట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఐశ్వర్య కల్పాతి పనిచేస్తున్నారు.

లియోన్ జేమ్స్ సంగీతం అందించగా.. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు, ప్రదీప్ ఇ. రాఘవ్ ఎడిటర్‌గా, ఎస్.ఎమ్. వెంకట్ మాణిక్యం ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో వి.జె. సిద్ధు, హర్షత్ ఖాన్, మరియం జార్జ్, ఇందుమతి మణికందన్, తేనప్పన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 21న థియేటర్లలో ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కాబోతోంది.

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved