pizza

Happy Birthday Ritu Varma, Introducing Her As The Graceful & Resilient Sathyavati From T Gopichand, Sankalp Reddy, Srinivasaa Chitturi, Srinivasaa Silver Screen, Presented By Pavan Kumar- Historical Film #Gopichand33
టి గోపీచంద్, సంకల్ప్ రెడ్డి, శ్రీనివాసా చిట్టూరి, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్, పవన్ కుమార్ ప్రజెంట్స్- హిస్టారికల్ మూవీ #గోపీచంద్33 నుంచి సత్యవతిగా రీతు వర్మ గ్రేస్‌ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

You are at idlebrain.com > news today >

10 March 2026
Hyderabad

Macho Star T Gopichand is gearing up for his grand historical action spectacle, #Gopichand33, directed by the visionary Sankalp Reddy and mounted on a massive scale by producer Srinivasaa Chitturi under the prestigious banner Srinivasaa Silver Screen, with Pavan Kumar presenting the project. Designed as one of the most lavish ventures of Gopichand’s journey, the film promises a visual experience rooted in grandeur and intensity.

Meanwhile, the makers announced that Ritu Varma plays the leading lady opposite T Gopichand in the film. Extending birthday wishes, her character Sathyavati is introduced through this first look poster, presenting her in a graceful, fierce, and commanding avatar. She is seen drawing a bow with intense focus, embodying strength, precision, and warrior-like determination, set against an ancient palace-like backdrop with glowing lights. Styled in period-inspired attire with traditional jewelry and a battle-ready posture, the look establishes her as a powerful and resilient character within the film’s epic historical backdrop.

Ritu Varma portrays a first-of-its-kind role- a woman from a secluded mountain tribe set in the 7th century. Her character reflects the grace, resilience, and cultural spirit of her people. Through her performance, Ritu Varma adds warmth and authenticity to the world of the film while portraying a woman of quiet courage and conviction.

Gopichand plays a powerful role and has undergone a complete makeover for the character, preparing himself thoroughly.

Director Sankalp Reddy, known for his bold storytelling language and cutting-edge craftsmanship, is set to unfold a gripping, seldom-highlighted chapter from India’s past. This new narrative promises not just scale and spectacle but also emotional depth that resonates beyond the screen. Stepping into a role that marks uncharted territory in his career, T Gopichand is poised to deliver one of his most transformative performances yet.

Backing this vision is a potent technical team, with ace cinematographer Soundar Rajan lensing the film with a grand visual tone.

The shoot of the movie is nearing completion, while the team is simultaneously working on post-production.

Cast: T Gopichand, Ritu Varma

Technical Crew:
Director: Sankalp Reddy
Producer: Srinivasaa Chitturi
Banner: Srinivasaa Silver Screen
Presents: Pavan Kumar
DoP: Soundar Rajan
Editor: Chota K Prasad
Fight Masters: Venkat, Pruthvi, Real Satish
Dance Masters: Shankar, Vijay Polanki

టి గోపీచంద్, సంకల్ప్ రెడ్డి, శ్రీనివాసా చిట్టూరి, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్, పవన్ కుమార్ ప్రజెంట్స్- హిస్టారికల్ మూవీ #గోపీచంద్33 నుంచి సత్యవతిగా రీతు వర్మ గ్రేస్‌ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

మ్యాచో స్టార్ టి గోపీచంద్, విజనరీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్న హిస్టారికల్ మూవీ #గోపీచంద్33 తో రాబోతున్నారు. పవన్ కుమార్ ప్రజెంట్స్ చేస్తున్న ఈ చిత్రం గోపీచంద్ కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రాలలో ఒకటిగా రూపొందుతోంది.

ఈ చిత్రంలో రీతు వర్మ, టి గోపిచంద్ సరసన కథానాయికగా నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె పాత్ర సత్యవతిని ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా పరిచయం చేశారు.

పోస్టర్‌లో రీతూ వర్మ అద్భుతమైన గ్రేస్‌తో పాటు ఫియర్స్, కమాండింగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. విల్లు ఎక్కుపెట్టి ఏకాగ్రతతో కనిపిస్తూ, ఒక యోధురాలిలా ధైర్యం, సంకల్పాన్ని ప్రతిబింబిస్తున్నారు. పీరియడ్ స్టైల్ దుస్తులు, సంప్రదాయ ఆభరణాలు, యుద్ధానికి సిద్ధంగా ఉన్న లుక్ ఆమె పాత్రలోని పవర్ ని స్పష్టంగా చూపిస్తున్నాయి.

ఈ సినిమాలో రీతూ వర్మ పూర్తిగా కొత్త తరహా పాత్రలో కనిపించనున్నారు. 7వ శతాబ్దంలో పర్వత ప్రాంతాల్లో నివసించే ఒక గిరిజన తెగకు చెందిన మహిళగా ఆమె పాత్ర ఉంటుంది. ఆ తెగ సంస్కృతి, ధైర్యం, సహనాన్ని ప్రతిబింబించేలా సత్యవతి పాత్ర రూపుదిద్దుకుంది. తన నటన ద్వారా రీతూ వర్మ ఆ పాత్రకు సహజత్వం, భావోద్వేగాలను తీసుకురానున్నారు.

ఈ చిత్రంలో హీరో గోపీచంద్ ఇప్పటివరకు చేయని పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్ర కోసం ఆయన పూర్తిగా మేకోవర్ అయ్యి ప్రత్యేకంగా సిద్ధమయ్యారు.

ఇన్నోవేటివ్ కథనాలు, టెక్నికల్ ఫినెస్‌కు పేరుగాంచిన సంకల్ప్ రెడ్డి, భారత చరిత్రలో వెలుగులోకి రాని ఒక శక్తివంతమైన అధ్యాయాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నారు. సినిమా విజువల్ వండర్ గా ఉండబోతోంది.

ఈ సినిమాకు టాప్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్‌, అనుదీప్ దేవ్ సంగీత అందిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అదే సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సైమల్టేనియస్‌ కొనసాగుతున్నాయి.

నటీనటులు: టి గోపీచంద్, రీతు వర్మ

సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: సంకల్ప్ రెడ్డి
నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి
బ్యానర్: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్
సమర్పణ: పవన్ కుమార్
సినిమాటోగ్రాఫర్: సౌందర్ రాజన్
ఎడిటర్: చోటా కె ప్రసాద్
ఫైట్ మాస్టర్స్: వెంకట్, పృథ్వీ, రియల్ సతీష్
డ్యాన్స్ మాస్టర్స్: శంకర్, విజయ్ పోలంకి

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved