pizza

Mahesh launches Robinhood song
సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేసిన నితిన్, శ్రీలీల, వెంకీ కుడుముల, మైత్రి మూవీ మేకర్స్ రాబిన్‌హుడ్‌ నుంచి ది యూనిక్ లవ్లీ & పెప్పీ బ్రాండ్ సాంగ్ - వేర్‌ ఎవర్ యు గో

You are at idlebrain.com > news today >

14 February 2025
Hyderabad

హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ రాబిన్‌హుడ్, వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో నితిన్ సరసన శ్రీలీల కథానాయికగా నటించింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఫస్ట్ సింగిల్ సూపర్ హిట్ అయింది. ఈరోజు, వాలెంటైన్స్ డే సందర్భంగా, ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ -వేర్‌ ఎవర్ యు గో సాంగ్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేశారు.

దర్శకుడు వెంకీ కుడుముల ఈ పాట కోసం ఒక యూనిక్ కాన్సెప్ట్‌ను డిజైన్ చేశారు. బ్రాండ్‌ల క్రియేటివ్ మిక్స్, వాటి ఐకానిక్ ట్యాగ్‌లైన్‌ల ద్వారా నితిన్, శ్రీలీల పట్ల తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తాడు. జివి ప్రకాష్ కుమార్ మెలోడీతో కూడిన ఎక్సయిటింగ్ ట్రాక్‌ను అందించారు. ఆర్కెస్ట్రేషన్ అద్భుతంగా. అర్మాన్ మాలిక్ వోకల్స్ అందాన్ని మరింత పెంచింది. ఈ ప్రేమ పాటను రాయడంలో సవాలును స్వీకరించి, బ్రాండ్‌లను, వాటి ట్యాగ్‌లైన్‌లను చాలా తెలివిగా ప్రజెంట్ చేసిన కృష్ణకాంత్‌కు స్పెషల్ క్రెడిట్ దక్కుతుంది.

నితిన్ పాటకు హై ఎనర్జీ తీసుకొచ్చారు. ఉబెర్-కూల్ అవతార్‌లో రాక్ చేశారు. శ్రీలీల కట్టిపడేసింది. వారి కెమిస్ట్రీ స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్ తో ఆకట్టుకుంది. విజువల్స్,ఎనర్జిటిక్ సెట్స్ మెస్మరైజ్ చేశాయి. వాలెంటైన్స్ డే కి ఇది పెర్ఫెక్ట్ సాంగ్.

నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రంలో సాయి శ్రీరామ్ బ్యుటీఫుల్ సినిమాటోగ్రఫీని అందించారు. కోటి ఎడిటర్‌గా పనిచేస్తుండగా, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్.

తారాగణం: నితిన్, శ్రీలీల, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: వెంకీ కుడుముల
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
CEO: చెర్రీ
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
DOP: సాయి శ్రీరామ్
ఎడిటర్: కోటి
ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరి తుమ్మల
లైన్ ప్రొడ్యూసర్: కిరణ్ బళ్లపల్లి
ఫైట్స్: రామ్-లక్ష్మణ్, రవివర్మ, విక్రమ్ మోర్
పబ్లిసిటీ డిజైనర్: గోపి ప్రసన్న

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved